Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘కేసీయార్ అమృత హస్తాలు – హరీష్‌ దివ్యాశీస్సులతో’ అని చెక్కించాలా..?!

March 22, 2026 by M S R

.

రాజకీయంగా కేటీయార్‌ను వేగంగా దాటేసి, ప్రచారంలో ముందంజలో ఉండాలనే ఆతృతతో హరీష్ రావు పలుసార్లు తన స్థాయికి ఏమాత్రం తగని వ్యాఖ్యలు, ప్రకటనలకూ వెళ్లిపోతున్నాడు… కేసీయార్‌ను నెత్తిన మోయడం వరకు వోకే, అర్థం చేసుకోవచ్చు కానీ, కొన్ని హేతురహిత వ్యాఖ్యలతో తనలోని విజ్ఞుడైన రాజకీయ నాయకుడిని తనే కుదించుకుంటూ… మరో కౌశిక్‌రెడ్డి అయిపోతున్నాడా..?

ఉదాహరణకు… తెలంగాణ సీఎం ప్రారంభించబోతున్న నర్మెట్ట ఆయిల్ పామ్ ప్లాంటు గురించి…!!  తనేమంటాడంటే..? ‘‘మేమే నిర్మించాం, కానీ రేవంత్ రెడ్డి తన పేరుతో శిలాఫలకాలు వేసుకుంటున్నాడు, క్రెడిట్ తీసుకుంటున్నాడు’’…. ఇదేదో అన్యాయం అయినట్టు..! ఇదేదో అపచారం చేసినట్టు..!

Ads

YSR పీరియడ్ నుంచి మంత్రిగా అనుభవం ఉన్న హరీష్ రావుకు తెలియదా..? KCR హయాంలో దాదాపు నంబర్ టూగా చలామణీ అయిన తనకు తెలియదా..? మరిచిపోయాడా..? ప్రభుత్వం అంటే ఒక నిరంతర ప్రక్రియ” (Continuity of Government)... పాలకులు- పార్టీలు మారవచ్చు కానీ, వ్యవస్థలు కొనసాగుతూనే ఉంటాయి…

– పాలనలో కొనసాగింపు (Administrative Continuity)… ఏ పెద్ద ప్రాజెక్టు అయినా ఒకే రోజులో పూర్తి కాదు… గత ప్రభుత్వం దీనికి స్థల సేకరణ, నిధుల కేటాయింపు, నిర్మాణ పనులు చేపట్టింది… ఒక దశకు ట్రయల్ రన్ దాకా వచ్చినట్టుంది… కానీ ఈ ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేసింది.., నిజానికి పూర్తి చేయలేదు, జరగాల్సింది చాలా చాలా ఉంది… వివరంగా దిగువన చెప్పుకుందాం…

ఆస్తుల సృష్టి (Asset Creation) …. ప్రభుత్వాలు మారినా ఆస్తి (Asset) అనేది ప్రజల సొత్తు… ₹300 కోట్లు అనేది ప్రజల పన్నుల డబ్బు… కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్లాంట్ సక్సెస్ అవ్వడం అనేది రాష్ట్ర ప్రయోజనం… ఒకరు విత్తనం నాటితే, మరొకరు నీరు పోసి చెట్టును పెంచడం వంటిదే ఈ ప్రక్రియ… ఇదేమీ కేసీయర్ సొంత డబ్బు కాదు, హరీష్ రావు పర్సు నుంచి ఖర్చు చేయలేదు… ఆయిల్‌ఫెడ్, అంటే ప్రభుత్వ ఫ్యాక్టరీ… ప్రైవేటు ప్రాపర్టీ కాదు…

విధానపరమైన కొనసాగింపు (Policy Continuity) … దేశంలో వంట నూనెల దిగుమతి తగ్గించాలనేది కేంద్ర ప్రభుత్వ విధానం… దానికి అనుగుణంగా తెలంగాణలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడం అనేది ఒక లాంగ్ టర్మ్ పాలసీ… పార్టీలతో సంబంధం లేకుండా ఈ ‘మిషన్’ కొనసాగడం వల్లనే రైతులకు నమ్మకం కలుగుతుంది…

రైతుల్ని వరి, పత్తి వంటి పంటల నుంచి మళ్లించి.., దీర్ఘకాలిక ఆదాయకల్పన కలిగించే.., మనకిప్పుడు విస్తీర్ణం పెరగాల్సిన అపరాలు, నూనెగింజల ఉత్పత్తి వైపు మళ్లించాలనేది జాతి అవసరం… ఇందులో విదేశీమారకద్రవ్యం దాకా లెక్కలుంటాయి… గత ప్రభుత్వం “మేము పునాది వేశాం” అని చెప్పుకుంటే, ప్రస్తుత ప్రభుత్వం “మేము దీన్ని పట్టాలెక్కించాం” అని చెప్పుకుంటుంది… కానీ సాంకేతికంగా చూస్తే ఇది ప్రభుత్వ విజయం…



హరీష్ రావు అంత గొప్పగా ఓన్ చేసుకోవడానికి ఏముందని..? K. Chandrashekar Rao ప్రభుత్వం సమయంలో…

  • FFB (Fresh Fruit Bunch) (CPO) ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం ప్రారంభం…
  • సివిల్ వర్క్స్ + మెషినరీ ఇన్‌స్టాలేషన్ ఎక్కువ వరకు పూర్తి.. .
  • కొన్ని యూనిట్లలో trial runs (పరీక్షాత్మక ఉత్పత్తి) ప్రారంభం…
  • Oilfed ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఫైనలైజ్…

కానీ పూర్తి స్థాయి commercial production స్టార్ట్ కాలేదు… refinery, integrated downstream units ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి…


ఇప్పుడు Revanth Reddy ప్రభుత్వం చేస్తున్నది

  • Plant‌ను అధికారికంగా ప్రజలకు అంకితం (inauguration for commercial operations)…
  • Trial stage నుంచి regular production mode కి మార్చడం…
  • Refinery unit‌కు శంకుస్థాపన (ఇది కొత్తగా add అవుతున్న కీలక భాగం)…
  • Integrated model వైపు shift చేయడం (processing + refining)…

అంటే…: “ఇప్పుడే కొత్తగా కట్టిన ఫ్యాక్టరీ” కాదు… “ఇప్పటికే ఉన్న ప్లాంట్‌ను operational stageకి తీసుకురావడం + expansion”…


  • ❗ పూర్తి స్థాయి Refinery construction (₹40–80 కోట్లు) కావాలి…
  • ❗ Capacity expansion (30–60 TPH → 120 TPH target) జరగాలి…
  • ❗ Biomass-based co-generation power plant పూర్తి utilization జరగాలి…
  • ❗ Sufficient FFB supply (raw material issue) – ఇది biggest bottleneck…
  • ❗ పూర్తి స్థాయి farmer linkage + plantation maturity…

biggest unanswered questions… 

  • Telangana climate → పూర్తి humid కాదు (oil palmకి ideal కాదు)…
  • Kaleshwaram Lift Irrigation Scheme ద్వారా moisture పెరిగిందా? → debatable…
  • 50,000 acres target → ground realityలో పూర్తిగా achieve కాలేదు…
  • FFB supply లేకుంటే → plant underutilized అవుతుంది…

 ఇదే అసలు policy vs practicality conflict…


  • ప్రైవేటు పోటీ…: తెలంగాణలో ఆయిల్ ఫెడ్ (ప్రభుత్వ రంగం)తో పాటు గోద్రెజ్ ఆగ్రోవెట్, పతంజలి, 3F ఆయిల్ పామ్ వంటి ప్రైవేటు సంస్థలు కూడా వివిధ జిల్లాల్లో తమ సొంత ప్రాసెసింగ్ యూనిట్లను నడుపుతున్నాయి..



 

  • ఇక ఇందులో క్రెడిట్ చోరీ ఏముంది హరీష్ రావు వాదిస్తున్నట్టుగా…. ఇప్పటికిప్పుడు అర్జెంటుగా శిలాఫలకాలపై ‘‘కేసీయార్ అమృతహస్తాలతో… హరీష్‌రావు దివ్య ఆశీస్సులతో’’ అని పెద్దగా చెక్కించలేరు కదా… అప్పటి వ్యవసాయ మంత్రి ఎవరో గుర్తుకులేదు గానీ… ఆయన పేరు, యాక్టింగ్ సీఎం కేటీయార్ పేర్లు కూడా యాడ్ చేయమంటారా..? ఇవేం విమర్శలు..? ప్రజాధనంతో నిర్మించే తెలంగాణ ప్రజల ఆస్తి పఢావు పడకుండా ఈ ప్రభుత్వం పూర్తి చేసి, క్రెడిట్ తీసుకుంటే, విజ్ఞతతో వ్యవహరిస్తే… తప్పుపట్టాల్సిందేముంది..?!


 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నో, నో… నేను దురంధర్ సినిమా చూడను… ప్లీజ్, నన్నొదిలేయండి…
  • అవును, నేను నేషనలిస్టునే… సో వాట్..? అదేమైనా భ్రష్టాచారమా..?
  • ‘కేసీయార్ అమృత హస్తాలు – హరీష్‌ దివ్యాశీస్సులతో’ అని చెక్కించాలా..?!
  • కొందరు బ్రాండ్లను నమ్ముకోరు – వాళ్లే స్వయంగా బ్రాండ్లు అవుతారు…
  • పొలిటిషయన్ తెలివి ముందు జర్నలిస్టుల తెలివి… జస్ట్ ఓ జుజుబీ…
  • సినిమా- రాజకీయం… పడుగూపేక..!! అరవ పాలిటిక్స్ అదోరకం… ఎలాగంటే..?
  • గ్యాస్, పెట్రో, డీజిల్ మాత్రమే కాదు… ఎరువులకూ కొరత ప్రమాదం…
  • దురంధర్ లో బాగా పేలిన పాత్ర… బడే సాహెబ్… ఎవరీ నటుడంటే..?
  • భయం నుంచి విముక్తి – ఆ పచ్చిపుండు వేదన – దురందర్ మరో కోణం…
  • ఒకే వ్యక్తి తల్లి ప్లస్ తండ్రి..! ఈ ప్రచారం ఏమిటి..? అసలు నిజాలు ఏమిటి..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions