Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రామ రామ… గోత్రాల పేరిట రాములోరి పెళ్లిపై ఓ శుష్క రాద్ధాంతం..!

March 23, 2026 by M S R

.

భద్రాచలం సీతారాముల కల్యాణం సమీపించగానే ఓ తలతిక్క వివాదం తన్నుకొస్తుంది వార్తల్లోకి… ఎవరెవరో ఏవో పిచ్చి వాదాలు వినిపిస్తారు… పనికిమాలిన పంచాయితీలతో ఎందుకు తన్నుకుంటారో అర్థం కాదు… ఓ సగటు రామభక్తుడి కోణంలో పరికిద్దాం ఓసారి…

అసలు పంచాయితీ ఏమిటంటే..? కొన్నేళ్లుగా సీతారాముల కల్యాణం గాకుండా లక్ష్మినారాయణుల కల్యాణం జరిపిస్తున్నారట… రామచంద్రుడు, రామభద్రుడు అనకుండా రామనారాయణ అని పెళ్లి సమయంలో ప్రస్తావిస్తున్నారట… దాంతో ప్రవర మారిపోయి అపచారం జరిగిపోతోంది… తక్షణం మార్చకపోతే మేమే వేరే పెళ్లి చేస్తాం ఆయనెవరో హూంకరిస్తున్నాడు…

Ads

  • అసలు పెళ్లి చేయడానికి తనెవరు..? ఏమో… హిందూ ధర్మంలో ఈ పంచాయితీలు ఎక్కువైపోయి కదా, ఒకవైపు ఇతర మతాల నుంచి తీవ్ర ముప్పు ముంచుకొస్తున్నా సరే, ఈ అనైక్యత కొంప ముంచుతున్నా… ఎవరూ తగ్గడం లేదు… ఎప్పటివో తగాదాలు, శైవం- వైష్ణవం నడుమ… అప్పుడప్పుడూ చినజియ్యర్ అజ్ఞానంతో గోకుతూనే ఉంటాడు, మంట పెడుతుంటాడు…

రామేశ్వరం గుడి నిర్మాత దగ్గర నుంచి అసలు ఆది శంకరాచార్య పీఠాల దాకా ఏవేవో పెంట బాగోతం పెడుతుంటాడు తెలుసు కదా… సరే, ఈ వార్త చదవండి, భద్రాచలం తగాదాపై ఒకాయన ఉరుముతున్నాడు…

భద్రాచలం

  • భద్రాచలం ప్రాంత పరిరక్షణ సమితి అట… హిమాలయ యోగి (?) స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి అట… ఏమాత్రం స్థితప్రజ్ఞత (మానసిక పరిపక్వ స్థితి), స్థితిప్రజ్ఞత (పరిస్థితిని బట్టి ప్రదర్శించే తెలివి) కనిపించని ఈ స్వామి ఎవరో, ఈ సమితి ఏమిటో, ఏం చేస్తుందో, ప్రతి స్వామికీ ఈ సరస్వతి అనే సఫిక్స్ ఏమిటో అస్సలు అర్థం కాదు… ఆయన బాధ ఏమిటంటే..?

సీతారామకల్యాణం వశిష్ట గోత్ర ఉచ్చరణతో జరగాలి కదా, రామనారాయణుడు అని వేరే ప్రవర చదువుతున్నారట… అలాగే సీత ప్రవర బదులు లక్ష్మి గోత్రం చదువుతున్నారట కల్యాణం సమయంలో… సరే, అదేం ఘోర అపచారమో వాళ్లకే తెలియాలి… కానీ ఓ మామూలు భక్తుడి కోణంలో చూస్తే… సో వాట్, రామనారాయణ అయితేనేం, రామచంద్రుడు అయితేనేం… రాముడు ఆ నారాయణుడి అవతారం, సీత ఆ లక్ష్మి అవతారం…

(అక్కడ వెలిసింది రాముడు, అంతే… అమ్మవారిని ఒడిలో కూర్చోపెట్టుకుని దర్శనమిస్తాడు… కల్యాణరాముడు… మరి రామచంద్రుడు అనే పేరు ప్రామాణికం అయ్యే పక్షంలో ఈ చంద్రుడెవరు ఆయన పేరులోకి రావడానికి..? కనీసం రామనారాయణుడు అనే పక్షంలో విష్ణు అవతారంగా అర్చించినట్టు..!! పోనీ, రామభద్రుడు అనండి, భద్రాచల రాముడు అన్నట్టుగా ఉంటుంది… ఇక్కడ ఉన్నది వైకుంఠరాముడు, చతుర్భుజ రాముడు, అంటే నారాయణుడి అవతారంలాగే ఉంటాడు… మరి రామనారాయణ అనే పిలుపులో ఘోరాపచారం ఏమిటో…)

bhadrachalam

  • సాక్షాత్తూ వాళ్ల మూల రూపాల పేర్లు చదువుతూ పెళ్లి జరిపిస్తే తప్పేమిటిట..? సంప్రదాయం వర్సెస్ శాస్త్రం నడుమ చాలా చిన్నటి, పలుచని రేఖ ఉంటే ఉండొచ్చుగాక… కానీ దాన్ని ఓ విద్వేషపు విభజనరేఖగా మార్చే కుతంత్రం ఎవరి మేలు కోసం..? సాక్షాత్తూ ఆ రాముడే హర్షించడు… ఈ మాట అంటే కొందరికి కోపం… ఎందుకయ్యా అంటే వినరు… ఇదుగో ఇలాంటి చిల్లర పంచాయితీలే కదా హిందువుల్లో అనైక్యతకు, దిక్కుమాలిన వర్గ వివాదాలకు కారణం…

 

bhadrachalam

‘‘024 ఏప్రిల్‌లో హైకోర్టు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐదుగురు పండితులతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసి, మూడు నెలల్లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించిందట… మరి ఆ కమిటీ ఏమైంది..? తెలియదు..! వెంటనే రేవంత్ రెడ్డి స్వయంగా కలగజేసుకుని, స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్లు…

  • అసలు పాలకుడు కేసీయార్ స్వయంగా స్వామి వారి పెళ్లికి ముత్యాల తలంబ్రాలు తీసుకురావడాన్నే మానేసినప్పుడు, రామభక్తుల మనోభాావాల్ని విస్మరించినప్పుడు ఒక్కడూ మాట్లాడినట్టు గుర్తులేదు… ఆ సంప్రదాయాన్ని కొనసాగించిన పాత తానీషాలు, నిజాం నవాబులు కేసీయార్‌కన్నా చాలా చాలా నయం..!!

srirama

కేసీయార్ భద్రాచలం రాముడి పట్ల తీవ్ర నిర్లక్ష్యం కనబరిచాడు… నయాపైసా ఇవ్వలేదు… ఈ సీఎం స్వయంగా ఈసారి పెళ్లికి తనే ముత్యాల తలంబ్రాలు మోసుకొస్తానంటున్నాడు… 300 కోట్లతో తనే మరో భక్త రామదాసుగా మారి, గుడిని ఓ భవ్యమందిరంగా పునర్నిర్మిస్తాను అంటున్నాడు… మరికొన్ని తరాలపాటు ఏ అసౌకర్యమూ తలెత్తని డిజైన్లు, నిర్మాణ ప్రణాళికల గురించి ఆలోచించండి…

  • కానీ ఈ స్థితిలోనూ అక్కడి అర్చకవర్గాలు మాత్రం ఇదుగో ఇలాంటి తన్నులాటలో సాక్షాత్తూ ఆ రామచంద్రుడికి శిరోభారంగా తయారయ్యారు..!! (అక్కడి పూజా పద్దతులు, పెళ్లి తంతు, సంప్రదాయం, శాస్త్రం, ఆగమ విశిష్టతలు తెలియని ఓ సాదాసీదా సగటు భక్తుడి కోణంలో మాత్రమే చదవండి… హిందూ ధర్మానికి ఇప్పుడు అవసరమైంది ఏకత… ఈ వివేచనారాహిత్యం కాదు…) సో, అయ్యలూ… మీమీ పాండిత్య, శాస్త్ర ప్రకర్ష కాదు, కాస్త భక్తిని ప్రదర్శించండి, పంచండి..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దురంధర్… నిజంగా నాటి సాహసి మేజర్ మోహిత్ శర్మ కథేనా..?!
  • రచ్చ ఆగడం లేదు… ఆ రోత పాటకు నానా విఫల సమర్థనలు…
  • రామ రామ… గోత్రాల పేరిట రాములోరి పెళ్లిపై ఓ శుష్క రాద్ధాంతం..!
  • జాణవులే వరవీణవులే – కిలికించితాలలో… స్మితను కూడా మరవలేం…
  • జియో పాలిటిక్స్… క్యూబాలో నిత్యనరకం… 18 నెలల్లో 6 బ్లాక్ అవుట్స్…
  • తెగ నవ్విస్తున్న టూప్లస్‌టూ పెళ్లిచూపుల కథ… మార్కెటింగ్ కన్సల్టెన్సీ…
  • సత్వర న్యాయం Vs చట్టప్రకారం న్యాయం… ఇదెప్పుడూ తెమిలే ప్రశ్న కాదు…
  • సతి అనుమతి లేని సంభోగం కూడా ఓ అత్యాచారమే… చిరైయా…
  • దురంధర్..! మనం సినిమా చూసే విధానాన్ని మార్చేస్తోంది… కొత్తగా, బలంగా…!
  • నో, నో… నేను దురంధర్ సినిమా చూడను… ప్లీజ్, నన్నొదిలేయండి…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions