Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రచ్చ ఆగడం లేదు… ఆ రోత పాటకు నానా విఫల సమర్థనలు…

March 23, 2026 by M S R

.

ఇంకా రగడ చల్లారడం లేదు… అదేనండీ ఆ పాట గురించే… అదే రాబోయే కేడీ, ది డెవిల్ సినిమాలోని ఆ బూతు పాట ‘సర్కే చునార్ తేరీ సర్కే’ గురించి… ఇంకా సోషల్ మీడియా చర్చిస్తూనే ఉంది… కేంద్రం, సెన్సార్ బోర్డు కన్నెర్ర చేసి, అన్ని ప్లాట్‌ఫారాల నుంచి దాన్ని రిమూవ్ చేయించినా సరే… చర్చ, రచ్చ సాగుతూనే ఉంది…

జాతీయ మహిళ కమిషన్ కూడా స్పందించి ఆ డాన్సర్ నోరా ఫతేహి, దర్శకుడు జోతి ప్రేమ్, నటుడు సంజయ్ దత్, లిరిసిస్ట్ రఖీబ్ ఆలం తదితరులకు నోటీసులు జారీ చేసి, విచారణకు రావాలని ఆదేశించింది… సైబర్ పోలీసులకూ ఫిర్యాదులు అందుతున్నాయి… మత సంఘాలు కూడా భగ్గుమంటున్నాయి…

Ads

ఎస్, కన్నడ- తెలుగు ఇతర భాషల్లోకన్నా హిందీలోనే బూతు దట్టించినట్టున్నారు… (నోరా చెబుతున్న వివరణ కూడా అదే… మూడేళ్ల క్రితం నాకు చెప్పిన అర్థం వేరు, పాట హిందీ వెర్షన్ నాకు తెలియదు అని…) ద్వంద్వార్థం ఏమీ కాదు, స్ట్రెయిట్ రోత అది… అబ్బే, అందులో ఏముంది, ఏనాటి నుంచో సినిమాల్లో వినిపించే వెగటు ధోరణే కదా అని తేలికగా కొట్టేస్తున్నారు… అయితే..?

పాట రాసినోడిని, ఆ నిర్మాత (మహిళ)నూ, ఆ దర్శకుడినీ, పాట కంపోజ్ చేసినవాడిని వదిలేసి, పాడిన మంగ్లీని మాత్రమే విమర్శించడం ఏమిటని ఆమెను వెనకేసుకొస్తున్నవాళ్లూ ఉన్నారు… నిజమే, ఆమెను మాత్రమే విమర్శించడం కరెక్టు కాదు, కానీ అది పాడకుండా తన వివేచన, విజ్ఞత, వివేకం ప్రదర్శించి ఉండాల్సింది…

కొందరేమో తెలుగు పాట లిరిక్స్ ఎక్కడో సంపాదించి, అందులో బూతు ఏముంది అని సన్నాయినొక్కులు నొక్కుతున్నారు… హిందీలో అది ఇలా స్టార్టవుతుంది…

పహెలో ఉటాలే, అందర్ వో డాలే, నీచే ఏక్ బూంద్ నా గిరాయే, ఖాళీ కర్‌కే నిక్‌లే, చూసేగా యా చటేగా… (ముందు దాన్ని లేపు, లోపల పెట్టుకో, ఒక్క చుక్క కూడా కింద పడొద్దు, ఖాళీ చేశాకే బయటికి తియ్యి, పీలుస్తావో, నాకుతావో… ఇదీ దాని మొరటు అర్థం…) మామూలు సందర్భంలో దాన్ని ఎలా అర్థం చేసుకుంటారనేది వదిలేస్తే… ఓ వయ్యారి వెగటు ఫోజులతో, స్టెప్పులతో ఐటమ్ డాన్స్ చేస్తుంటే ప్రేక్షకుడు ఎలా అర్థం చేసుకుంటాడు..? అదీ ముఖ్యం…

nora

సినిమా టీమ్‌లో ఒకడు ఏదో వివరణ ఇచ్చాడు… అది మందు సీసా గురించట… పైకెత్తి, నోట్లో పెట్టుకుని, చుక్క కూడా మిగలకుండా, కింద పడకుండా, ఖాళీ చేశాకే బయటికి తీయాలట… అదీ కవి హృదయమట… వాడి బొంద, అలాంటప్పుడు పీలుస్తావో, నాకుతావో అనే పదాలు ఎందుకొస్తాయి మరి..? చిల్లర సమర్థన…


  • ఒక పాటను కేవలం సాహిత్యం పరంగా చూడకూడదు… దాని వెనుక ఉన్న మ్యూజిక్, ఆ డ్యాన్స్ చేసే నటి హావభావాలు, కెమెరా యాంగిల్స్… ఇవన్నీ కలిపి ఒక ‘సజెసివ్’ (లైంగిక అర్థాన్ని స్ఫురింపజేసే) వాతావరణాన్ని సృష్టిస్తాయి…

  • మందు సీసా గురించి చెప్పాలనుకుంటే అంత వెగటు ఫోజులు, డబుల్ మీనింగ్ డైలాగులు అవసరం లేదు… కాబట్టి, ఆ వివరణలన్నీ “చిల్లర సమర్థనలే”…



మంగ్లి

మరికొందరు సోషల్ మీడియాలో మరోరకం విఫల సమర్థనకు దిగారు… అది మరీ వితండం… అదట, మామిడిపండు తినే లేదా చీకే పద్దతి అట… ఎలాగంటే, నోట్లో పెట్టుకుని, రసం చుక్క కిందపడకుండా, జాగ్రత్తగా పీల్చుకుంటూ లేదా నాక్కుంటూ మొత్తం గుజ్జు ఖాళీ చేశాకే బయటికి తీయాలని చెప్పడం అట… అబ్బే, అశ్లీలం కాదు, అది మామిడి పండు తినే విధానాన్ని సరదాగా చెప్పడం అట…

అలాంటప్పుడు ‘మొదట దాన్ని పైకి లేపు’ అనే మాటెందుకు వస్తుంది..? ఎవడెన్ని విఫల సమర్థనలకు దిగినా సరే, బూతు బూతే, రోత రోతే… కొందరు దీన్ని మంచినీళ్ల సీసాకు వర్తింపజేసి, ఇంకొందరు కూల్ డ్రింక్ తాగే సవాల్ గురించీ చెబుతున్నారు… బట్, ఆ దరిద్రపు రచయిత భావమేమిటో అందరికీ సరిగ్గానే అర్థమైంది కాబట్టే ఈ స్థాయి వ్యతరేకత వచ్చింది… మంగ్లి కూడా తప్పు తెలుసుకుని క్షమాపణ అడిగింది, అంటే తప్పు అని అంగీకరించింది…

(ఈ రోత పాట గురించి ఇంత విపులంగా రాసినందుకు క్షంతవ్యుడిని… చాలామంది తెలుగులో పాట చదివి, ఇందులో బూతు ఏముంది అని కొట్టిపారేస్తున్నందుకు ఇలా రాయాల్సి వచ్చింది…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘ఎర్ర’కోటకు బీటలు…! చివరి లెఫ్ట్ నౌక మునక..? కేరళ ముఖచిత్రం..!!
  • దురంధర్… నిజంగా నాటి సాహసి మేజర్ మోహిత్ శర్మ కథేనా..?!
  • రచ్చ ఆగడం లేదు… ఆ రోత పాటకు నానా విఫల సమర్థనలు…
  • రామ రామ… గోత్రాల పేరిట రాములోరి పెళ్లిపై ఓ శుష్క రాద్ధాంతం..!
  • జాణవులే వరవీణవులే – కిలికించితాలలో… స్మితను కూడా మరవలేం…
  • జియో పాలిటిక్స్… క్యూబాలో నిత్యనరకం… 18 నెలల్లో 6 బ్లాక్ అవుట్స్…
  • తెగ నవ్విస్తున్న టూప్లస్‌టూ పెళ్లిచూపుల కథ… మార్కెటింగ్ కన్సల్టెన్సీ…
  • సత్వర న్యాయం Vs చట్టప్రకారం న్యాయం… ఇదెప్పుడూ తెమిలే ప్రశ్న కాదు…
  • సతి అనుమతి లేని సంభోగం కూడా ఓ అత్యాచారమే… చిరైయా…
  • దురంధర్..! మనం సినిమా చూసే విధానాన్ని మార్చేస్తోంది… కొత్తగా, బలంగా…!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions