Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమెరికా ‘గుండెకాయ’కే ఇరాన్ గురి..! పుతిన్ ఆడుతున్న కొత్త ఆట..!!

March 23, 2026 by M S R

.

ఇరాన్‌పై బాంబింగును ఐదు రోజులపాటు ఆపేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది… రాత్రే కదా, 48 గంటల డెడ్‌లైన్ అన్నాడు, ఆ తరువాత అంతం చూస్తానన్నాడు ట్రంపు, వెంటనే ఇదేమిటి..? ఏమో, పుతిన్ ఏమని హెచ్చరించాడో, అమెరికాకు ఎక్కడ తగిలిందో తెలియదు గానీ… ఇరాన్ ఆల్రెడీ సమకూర్చుకున్న ఆయుధ సంపత్తి అమెరికా, ఇజ్రాయిల్ డిఫెన్స్ నిఫుణులకూ అంతుపట్టడం లేదనేది మాత్రంం వాస్తవం…



Pardha Saradhi Potluri  ….. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ దిశగా ఇరాన్? ICBM ని స్వంతంగా అభివృద్ధి చేసుకునే దిశగా ఇరాన్ వేగంగా అడుగులు వేస్తున్నది! హిందూ మహాసముద్రంలో ఉన్న డిగో గార్షియా దీవుల మీదకి ఇరాన్ రెండు ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ( IRBM ) లని ప్రయోగించింది!

Ads

ఒక మిసైల్ డిగో గార్షియా దీవుల దగ్గరికి వెళ్లి హిందూ మహాసముద్రంలో కూలిపోయింది!
రెండో మిసైల్ ని డిగో గార్షియా దీవుల దగ్గర గస్తీ కాస్తున్న బ్రిటన్ రాయల్ నేవికి చెందిన ఫ్రీగేట్ SM -3 నావల్ వర్షన్ ఇంటర్సెప్ట్ మిసైల్ తో కూల్చి వేసింది!
ఇరాన్ నుండి హిందూ మహాసముద్రంలో ఉన్న డిగో గార్షియా దీవుల మధ్య దూరం షుమారుగా 4,000 కిలోమీటర్లు ఉంటుంది!
4 వేల కిలోమీటర్లు దూరం ప్రయాణించగల బాలిస్టిక్ మిసైల్ ని ఇరాన్ డెవలప్ చేయగలగింది అనేదే వార్ స్ట్రాటజిస్ట్స్ ని ఆశ్చర్యపరిచింది!
పెంటగన్ వార్ రూమ్ నిశ్శబ్దంగా గమనిస్తున్నది!

ఫిబ్రవరి 28 న ఇరాన్ అమెరికా మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం అవగానే వార్ స్ట్రాటజిస్ట్స్ తమతమ విశ్లేషణలు చేశారు ఇరాన్ బలాలు, బలహీనతల గురుంచి.
యుద్ధ విశ్లేషకులు ఏకగ్రీవంగా ఒప్పుకున్నది ఇరాన్ IRGC బలం, మిసైల్ స్టాక్స్, డ్రోన్స్ స్టాక్ బలంగా ఉన్నాయని!

ఇరాన్ ఎయిర్ ఫోర్స్, ఇరాన్ నావీ అమెరికా, ఇజ్రాయేల్ ముందు రెండు రోజులు కూడా నిలబడలేవు!
ఇంతవరకూ వార్ స్ట్రాటజిస్ట్స్ ఊహించిన విధంగానే జరిగాయి!
కానీ… ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్, షహీద్ 136 డ్రోన్లు తమ లక్ష్యాలని పిన్ పాయింట్ అక్క్యూరసీతో ధ్వంసం చేయగలవు అని అంచనా వేయలేకపోయారు సదరు డిఫెన్స్ ఎనలిస్టులు.
పెంటగాన్, మోస్సాద్ ఇరాన్ దగ్గర 4,000 వేల కిలోమీటర్స్ వెళ్ళగలిగిన మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయని పసిగట్టలేకపోయాయి!
అగైన్ క్రెడిట్ గోస్ టు వ్లాడిమిర్ పుతిన్!

CIA, మోస్సాద్ ఎలా పనిచేస్తాయో పుతిన్ కి తెలుసు. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రాం కోసం ఇరాన్ లో ఏకంగా అండర్ గ్రౌండ్ సిటీలని కట్టించాడు! అసలైన మిసైల్ ప్రోగ్రామ్ అండర్ గ్రౌండ్ లలో జరుగుతుండగా ఇజ్రాయేల్ అమెరికా దాడులకోసం కొన్ని ఫ్యాక్టరీలని వదిలేశారు. వాటి మీద దాడి చేసి ఇరాన్ ఇక మిసైల్స్ ప్రయోగించే శక్తిని కోల్పోయింది అని స్టేట్మెంట్ ఇచ్చేసాడు ట్రంప్!

ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చిన రెండో రోజే ఇరాన్ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ తో డిగోగార్షియా దీవుల మీద దాడి చేసి షాక్ ఇచ్చింది!
పుతిన్ ఇల్యూమినాటి మీద యుద్ధం ప్రకటించి రెండు నెలలు అవుతున్నది! పుతిన్ లక్ష్యం ఇల్యూమినాటి మాత్రమే! నాటో కాదు! అమెరికా కాదు!
ఒకసారి ఇల్యూమినాటి నెట్వర్క్ దెబ్బతింటే మిగతా అన్నీ దారిలోకి వస్తాయి. రష్యా, చైనా, ఇరాన్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికన్ దేశాలు ఓకే వైపు ఉండి యుద్ధం చేస్తున్నాయి ఇరాన్ ఒక్కటే కాదు!

డిగో గార్షియా దీవుల మీద దాడి ఎందుకు?
డిగో గార్షియా దీవులలో అమెరికా, బ్రిటన్ ల అతి పెద్ద సంయుక్త ఎయిర్ బేస్ ఉంది. హెవీ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానాలు, B2 స్టెల్త్ బాంబర్స్ ఈ దీవులలోనే ఉన్నాయి. హిందూ మహా సముద్రంలోని ఈ దీవులలో డీప్ వాటర్ సీ పోర్ట్ కూడా ఉంది, అమెరికన్ అణు జాలాంతర్గాములు ఇక్కడ ఉన్నాయి. జెట్ ఫైటర్స్ తో పాటు సబ్ మెరైన్ ల సర్వీసింగ్ ఫెసిలిటి కూడా ఉంది.
1990 ఇరాక్ వార్, వియత్నాం వార్, ఆఫ్ఘనిస్తాన్ వార్, లిబియా వార్ ఇలా అన్ని నాటో దళాలు ఇక్కడినుండే పనిచేసాయి!

హిందూ మహాసముద్రంలో మధ్యలో ఉండే ఈ దీవి భౌగోళికంగా చాలా కీలకమైన ప్రదేశంలో ఉంది! ముఖ్యంగా హిందూ మహాసముద్రం ద్వారా జరిగే వాణిజ్య నౌకల రక్షణ కోసం అని పైకి చెప్తున్నా చైనాని అడ్డుకోవడానికే అంత పెద్ద ఎయిర్ బేస్ కట్టారు!
సముద్రం ద్వారా జరిగే ప్రపంచ రవాణా లో 3/4వంతు హిందూ మహాసముద్రం ద్వారానే జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇతర దేశాల నుండి చైనాకి, చైనా నుండి ఇతర దేశాలకి ఈ మార్గం గుండా మలక్కా జలాసంధిని దాటుకొని వెళ్తాయి.

డిగో గార్షియా దీవుల నుండి ఏదన్నా భూమి ఉంటుంది అంటే అది 1300 km దూరంలో ఉంటుంది! మిలిటరీ పరంగా చూస్తే భూమి మీద అత్యంత సురక్షిత, రహస్య మిలిటరీ స్థావరం ఏదన్నా ఉంటే అది డిగో గార్షియా దీవులే!
భూమి మీద చుట్టూ సముద్రం మధ్యలో దీవి, దానిలో పచ్చని చెట్లు, చుట్టూ నీలి సముద్రం ( హిందూ మహా సముద్రాన్ని బ్లూ వాటర్స్ అని పిలుస్తారు ) తీర ప్రాంతం తెల్లటి ఇసుకతో ఉంటూ అత్యంత సుందరమైన దీవులుగా ప్రసిద్ధిగాంచినవి డిగో గార్షియా దీవులు.

డిగో గార్షియా దీవులు మారిషస్ దేశానికి చెందినవి!
1. 1786 లో బ్రిటన్ మారిషస్ తో పాటు డిగో గార్షియా దీవులని స్వాధీనం చేసుకుంది!
2. 1965 లో బ్రిటన్ ప్రభుత్వం డిగో గార్షియా దీవులని మారిషస్ నుండి వేరు చేసి తన అదీనంలోనే ఉంచుకున్నది మారిషస్ స్వతంత్ర దేశంగా ఏర్పడ్డాక కూడా. అయితే 3 మిలియన్ పౌండ్లని ఇచ్చి దీవులని కొన్నది బ్రిటన్!
3. 1968 నుండి 1973 వరకూ డిగోగార్షియా దీవులలో ఉండే స్థానిక చగోసియన్స్ ని బలవంతంగా ఆ దీవుల నుండి వెళ్లగొట్టి అమెరికాతో కలిసి ఎయిర్ బేస్ కట్టింది!
4. 1968 నుండి ఈ ప్రాంతాన్ని బ్రిటీష్ ఇండియన్ ఓషన్ టెరటరీ ( BIOT ) గా వ్యవహారిస్తున్నారు.

5. డబ్బులు ఇచ్చి కొన్న దీవులని అక్కడి స్థానికులని వెళ్లగొట్టడం మీద అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసులు ఎదుర్కొన్న బ్రిటన్ మే నెల 2025 లో 99 సంవత్సరాల లీజు ఒప్పందం చేసుకొని, కేసుల నుండి బయటపడ్డది!
డిగో గార్షియా దీవులు అనేవి స్థిరంగా ఉండే విమానవాహక యుద్ధ నౌక అని వ్యవహారిస్తారు! మొత్తం 3,000 మంది ఎయిర్ ఫోర్స్, నేవీ సిబ్బంది ఉంటారు అక్కడ!

అమెరికా తరువాత అత్యంత ఖరీదైన మిలిటరీ అసెట్స్ అంటే B-2 బాంబర్స్, ఏరియల్ రీ ఫ్యూయల్ చేసే టాంకర్స్, అమెరికా , బ్రిటన్ లకి చెందిన F-35, F-15 ఫైటర్స్ ఉంటాయి .సబ్ మెరైన్ లకి కావాల్సిన
అత్యాధునిక సర్వీసింగ్ సదుపాయలు ఉన్నాయి.
డిగో గార్షియా దీవులలో అమెరికన్, బ్రిటన్ మిలిటరీకి సంబంధించిన వారు తప్పితే ఇతరులు ఎవరూ ఉండరు. దీవుల నుండి 15 నాటికల్ మైళ్ళ వరకూ సముద్రంలో చిన్న బోట్ కూడా వెళ్ళడానికి వీలులేదు!

అమెరికా, బ్రిటన్ దేశాలకి వాళ్ళ దేశంలో కాకుండా బయట ఉన్న అతి పెద్ద మిలిటరీ స్థావరం డిగో గార్షియా!
ప్రపంచ యుద్ధం అంటూ మొదలైతే రష్యా, చైనా కలిసి మొదట దాడి చేసి ధ్వంసం చేసేది డిగోగార్షియాలోని ఎయిర్ బేస్ నే! డిగో గార్షియా కనుక నాశనం అయితే ఆసియా, హిందూ మహాసముద్రంలో అమెరికా, బ్రిటన్ లకి పట్టు ఉండదు! గల్ఫ్ ప్రాంతంలో అమెరికా పాత్ర పెద్దగా ఉండదు!
ఇంత ప్రాధాన్యత ఉన్న ప్రదేశం కాబట్టి రష్యా ఇరాన్ చేత దాడి చేయించింది!

డిగో గార్షియా లో ఎయిర్ బేస్ అనేది చైనాకి చెక్ పెట్టడానికే!
పుతిన్, జింగ్ పింగ్ అమెరికాతో పాటు నాటో దేశాలకి చేసిన హెచ్చరిక ఇరాన్ చేసిన దాడి!
ఇరాన్ దాడి విఫలం అయ్యిందా?
లేదు. రష్యా చైనాలు ఇచ్చిన లాంగ్ రేంజ్ మిసైల్ ఏక్విప్మెంట్ ని పరీక్షించింది!
Here is the catch!

ఇరాన్ మిసైల్ ప్రోగ్రాం అనేది 2,000 km అని భావించాయి అమెరికా, ఇజ్రాయేల్ దేశాలు. ఇరాన్ ప్రధాన టార్గెట్ ఇజ్రాయేల్ కాబట్టి 2,000 km వరకే పరిమితం అవుతున్నదని భావించారు!
కానీ… దక్షిణ యూరోప్ తో పాటు భారత్ లోని కొంత భాగం కూడా ఇరాన్ మిసైల్ పరిధిలోకి వచ్చేసింది ఇప్పుడు!
ప్రపంచ యుద్ధం అంటూ మొదలైతే ఇరాన్ మిసైల్ రేంజ్ లోకి వచ్చే ప్రాంతాలు…..
మొత్తం పశ్చిమ ఆసియా, మొత్తం మధ్య ఆసియాతో పాటు పాకిస్తాన్, భారత్ లోని పశ్చిమ భాగం, తూర్పు ఆఫ్రికా, రోమ్, ఏథెన్స్, బుడాపేస్ట్, వార్సా, వియన్నా.
ఉక్రెయిన్ చాలా క్లోజ్ డిస్టెన్స్ లోకి వచ్చేసింది!

ఇండిపెండెంట్ అనలిస్టులు వేస్తున్న అంచనా ప్రకారం ఇరాన్ ఇప్పటికే ICBM ని పరీక్షించే దశలో ఉందని!
4,000 KM పరిధి మధ్యశ్రేణి బాలిస్టిక్ మిసైల్ అంటారు.
5,500 KM పరిధి ICBM రేంజ్! అంటే ఇంకో 1500 KM రేంజ్ పెంచగలగాలి. ఇప్పటికే ICBM రేంజ్ కోసం ట్రయల్స్ మొదలుపెట్టింది ఇరాన్.

ఫిబ్రవరి 28 న మొదలైన ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగం ఇప్పటికీ కొనసాగు్తూనే ఉంది. కానీ గత మూడు రోజులుగా ఇరాన్ ప్రయోగిస్తున్న మిసైల్స్ వేగం చూస్తే అవి ఖచ్చితంగా ICBM లు అని నిర్ధారణకి వచ్చారు.
ICBM పరిధి 5,500 KM అయితే టార్గెట్ 4,000 KM పరిధిలో ఉంటే అక్కడివరకు మాత్రమే ప్రయాణించి టార్గెట్ ని ఛేధిస్తుంది!
డిగో గార్షియా మీద ప్రయోగించిన రెండు మిసైల్స్ పరీక్ష కోసం మాత్రమే అయిండవచ్చు!

మొదటి మిసైల్ గమ్యం చేరకుండానే హిందూ మహాసముద్రంలో కూలిపోయింది అని అమెరికా అంటున్నది తప్పితే ఇరాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు!
చైనా సాటిలైట్స్ మిసైల్స్ ప్రయాణ మార్గం (( Trajectory ) తో పాటు ఎక్కడి వరకూ ఎంత వేగంతో ప్రయాణించాయి అనే డాటా ని రికార్డ్ చేసి ఉండవచ్చు!

గత 22 రోజులుగా ఇరాన్ మిసైల్స్ ని అమెరికన్, ఐజ్రాయేలి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అయిన పేట్రియాట్, థాడ్, ఎజిస్ BMD, ఐరన్ డోమ్, బరాక్ లాంటివి ఆపలేకపోయాయి.
కానీ మొన్న AEGIS SM -3 ఇంటర్సెప్టర్ ఒక మిసైల్ ని అడ్డుకోగలిగింది! SM -3 ఇంటర్సెప్టర్ మిసైల్ డిగో గార్షియా దీవుల దగ్గర్లో ఉన్న డిస్ట్రాయర్ ప్రయోగించి అడ్డుకున్నది!
ఈ మొత్తం డాటా ని విశ్లేషించి ఎలాంటి మార్పులు చేయాలో రష్యా నిర్ణయించి ఈసారి సక్సెస్ అయ్యేట్లుగా చేస్తుంది!

రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియా దేశాలు మిసైల్ పవర్ విషయంలో అమెరికాకి ఛాలెంజ్ విసురుతూ మేము సిద్ధంగా ఉన్నామనే సంకేతాన్ని ఇచ్చినట్లయింది!
ఇక్కడ మిసైల్స్ రేంజ్ తో పాటు యాక్క్యూరసిని పరిగణలోకి తీసుకుంటే అమెరికా, యూరోప్, ఇజ్రాయేల్ దగ్గర జవాబు లేదన్నది స్పష్టమైనది!

డిగో గార్షియాతో పాటు అమెరికాలోని కాలిఫోర్నియా మా తదుపరి టార్గెట్ అని ఇరాన్ విదేశాంగ మంత్రి ఒక ప్రైవేట్ పోడ్కాస్ట్ లో చెప్పాడు అంటే ICBM దిశగా ఇరాన్ అడుగులు వేస్తున్నట్లుగా భావించాలి!
2,500 మేరైన్ల ని గల్ఫ్ లో మొహరించింది అమెరికా!
అంటే భూమి మీద యుద్దానికి సిద్ధమైనట్లే అనుకోవాలి!

IRGC ని భూమి మీద ఎదుర్కోవడం అమెరికన్ మెరైన్స్ కి కష్టం! IRGC చావుకి సిద్ధమై పోరాడుతుంది కాబట్టి ఇరు వైపులా ప్రాణ నష్టం ఎక్కువగా ఉండొచ్చు!
మెరైన్స్ కదలికలని రష్యన్ సాటిలైట్స్ గమనిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తాయి కాబట్టి అమెరికన్స్ కి భూమి మీద యుద్ధం అనేది అంత తేలికగా విజయం దొరకదు!
ట్రంప్ వెనకకి తగ్గి ఇజ్రాయేల్ కి అప్పచెప్పి చేతులు దులుపుకోవచ్చు!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్లస్థలాలు… మళ్లీ మొదటికొచ్చింది ఇష్యూ…
  • రిటైర్డ్ ఉద్యోగులకు ఊరట… రేవంత్ రెడ్డి సర్కారుకు హైకోర్టు డెడ్‌లైన్…
  • అమెరికా ‘గుండెకాయ’కే ఇరాన్ గురి..! పుతిన్ ఆడుతున్న కొత్త ఆట..!!
  • చెప్పేవాడికి వినేవాడు లోకువ… చివరకు ఆ డ్రగ్స్ తండ్రీ నీతిబోధ…
  • సియాచిన్ జవాన్ల ప్రతి శ్వాసలోనూ ఈ జంట ఔదార్యపు పరిమళం
  • ప్రజెంట్ జనరేషన్‌‌కు లీస్ట్ ప్రయారిటీ కెరీర్… జర్నలిజం… ఎందుకంటే..?
  • ‘ఎర్ర’కోటకు బీటలు…! చివరి లెఫ్ట్ నౌక మునక..? కేరళ ముఖచిత్రం..!!
  • దురంధర్… నిజంగా నాటి సాహసి మేజర్ మోహిత్ శర్మ కథేనా..?!
  • రచ్చ ఆగడం లేదు… ఆ రోత పాటకు నానా విఫల సమర్థనలు…
  • రామ రామ… గోత్రాల పేరిట రాములోరి పెళ్లిపై ఓ శుష్క రాద్ధాంతం..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions