.
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో మరో మడతపేచీ… ఇన్నాళ్లూ జవహర్‌లాల్ జర్నలిస్టు హౌజింగ్ సొసైటీ దీర్ఘకాలిక పోరాటం పట్ల సానుకూలంగా, సానుభూతితో వ్యవహరించిన రేవంత్ రెడ్డి తన స్టాండ్ మార్చాడు… సొసైటీ సభ్యులకు తీవ్ర నిరాశ ప్రస్తుతం…
కేసీయార్ హయాంలో ఈ సొసైటీ సభ్యులకు ఎంత అన్యాయం జరిగిందో తనకు పూర్తిగా తెలుసు… వైఎస్ హయాంలో ఈ సొసైటీకి ఇవ్వబడిన రెండు స్థలాలను అప్పగిస్తూ ఓ దశలో తనే సర్క్యులర్ కూడా ఇచ్చాడు… కానీ ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఈ స్థలకేటాయింపుల్ని (సివిల్ సర్వీస్, ప్రజాప్రతినిధుల స్థలాలు కూడా) కొట్టేసిందో సమస్య మళ్లీ మొదటికొచ్చింది…
Ads
ఇప్పుడిక లీగల్ మార్గాలు మూసుకుపోయాయి… (ప్రజాప్రతినిధులకు ఇవ్వబడిన స్థలాల్లో రేవంత్ రెడ్డికి ఇచ్చిన స్థలమూ ఉంది)… ఈలోపు సేమ్, కేసీయార్ పిరియడ్‌లో లేవనెత్తినట్టే… మరి జేఎన్‌జీ సొసైటీలో లేని సభ్యుల మాటేమిటి అనే ప్రశ్న తలెత్తింది… వాళ్లకూ న్యాయం జరగాలి అనే వాదన మొదలైంది… సేమ్, కేసీయార్ బాటకు మళ్లిన రేవంత్ రెడ్డి కూడా తన స్టాండ్ మార్చి, సొసైటీలుగా కాదు, అందరికీ కలిపి ఒకేచోట, ఒకేసారి స్థలాలు ఇస్తాను, కలిసి రండి, సరైన ప్రతిపాదనలు, ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి తగిన సమ్మతిని ఇవ్వండి అని కుండబద్ధలు కొట్టేశాడు…
డబ్బు కట్టి, 18 ఏళ్లుగా నిరీక్షిస్తున్న, పోరాడుతున్న జర్నలిస్టులను… ఆ సొసైటీలో లోని సభ్యులనూ కలిపేశాడు సీఎం.., మిగతావారూ అర్హులే… అందరికీ ఇవ్వాలి, న్యాయమైన కోరికే, కానీ ఫస్ట్ జేఎన్‌జే సొసైటీ, తరువాత అందరికీ న్యాయం చేయాలని జేఎన్‌జే సొసైటీ ఇన్నాళ్లు కోరుతోంది… ఇప్పుడదంతా పోయినట్టే… సమస్య పూర్తిగా మొదటికొచ్చింది… జేఎన్‌జే సొసైటీకి నిరాాశ.,., కాకపోతే మిగతా జర్నలిస్టుల్లో ఆశలు చిగురించాయి…
ఐతే జేఎన్‌జే 18 ఏళ్ల క్రితం సొసైటీ… తరువాత వేలాది మంది జర్నలిస్టుల, అందులో సీనియర్లు కూడా ఈ ప్రొఫెషన్‌లోకి వచ్చారు… ప్రింట్, టీవీ, వెబ్, డిజిటల్… అర్హులు ఎవరు అనే కీలక ప్రశ్న తలెత్తుతోంది… వడబోసి ఫైనల్ జాబితా ఖరారైతే, అప్పుడు సొసైటీల వారీగా కాదు, వ్యక్తులకు ఇస్తాం అంటున్నాడు సీఎం… ఇదెప్పుడు తెమలాలి… ఎవరు పూనుకోవాలి… మీడియా అకాడమీ చైర్మన్ ఈ సమస్యను వదిలేసినట్టే కనిపిస్తోంది… అందరూ కలిసి రండి అనే సూచన పైకి బాగున్నట్టు కనిపించినా… ఇది సొసైటీ ఆశల మీద ఒకరకంగా నీళ్లు గుమ్మరించడమే… అంటే, అందరినీ ఒకగాటన కట్టేయడం…
అత్యంత విలువైన పేట్ బషీరాబాద్, నిజాంపేట స్థలాల్ని ఇచ్చేది లేదని తాజాగా కుండబద్ధలు కొట్టేశాడు సీఎం… సో, పాత రెండు స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడమే తరువాయి అన్నమాట… అంతేకాదు, జర్నలిస్టులు అప్పట్లో చెల్లించిన డబ్బును కూడా చెల్లించడానికి ఇబ్బందులు ఉన్నాయి అనే హింట్ కూడా ఇచ్చాడు… రాహుల్ గాంధీ ఫేమస్ వైరల్ మాటలు ఉన్నాయి కదా… బై బై, ఖతం, టాటా, గుడ్ బై…
ప్రెస్ క్లబ్ స్థలం లీజు పెంపు విషయమై ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరుగురు జర్నలిస్టులు శాసనమండలిలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పుేడు ఆయనే ఇచ్చిన క్లారిటీ ఇది… (వాట్సప్ న్యూస్ గ్రూపుల్లో ఆయన్ని కలిసిన జర్నలిస్టులు షేర్ చేసుకున్న వివరాల ప్రకారం…)
‘‘ఎలాంటి లీగల్ ఇష్యూస్ లేకుండా అర్హులైన అందరికీ టీజీఐఐసీ ద్వారా ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇస్తాం… జేఎన్జే సభ్యులకు, ఇతరులకు ఒకేసారి ఫోర్త్ సిటీలో న్యాయం చేస్తాం… ఐతే, అందుకు జర్నలిస్టులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని తెలియజేయాలి… ఇందుకోసం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సంప్రదింపులు జరపాలి… జేఎన్జే సొసైటీతోపాటు ఇతర జర్నలిస్టులు కలిసి రెండు మూడు ప్రతిపాదనలతో రావాలి… లేని పక్షంలో నేనే అందరికీ కలిపి ఒక యూనిట్ గా ఏకకాలంలో స్థలాల కేటాయింపులు జరుపుతాను…
మూసీ ప్రాజెక్టుకు సంబంధించి మధు రిట్జ్ అపార్టమెంట్ విషయంలో మొదట్లో నేను సానుకూలంగా ఉన్నాను, వేరే స్థలం ఇస్తానన్నాను, పరిహారం ఇస్తానన్నాను, మొదట సరేనన్నారు, తరువాత మాటమార్చారు, అలాగాకుండా జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో స్థలాలిస్తాను.., ఈమేరకు జర్నలిస్టులందరూ కలిసి తమ ప్రతిపాదనలతో రావాలి… మొదట ప్రభుత్వానికి మీ సమ్మతి తెలపాలి…’’ ఇదీ రేవంత్ రెడ్డి చెప్పింది…

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షకార్యదర్శులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన వాళ్లలో ది హిందూ పత్రిక పొలిటికల్ ఎడిటర్ రామసాయం రవికాంత్ రెడ్డి, సాక్షి దినపత్రిక బ్యూరోచీఫ్ శ్రీకాంత్ కగనీకర్, టీ న్యూస్ ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ వి. భరద్వాజ్, ఫ్రీలాన్స్ జర్నలిస్టు ట్యాంక్ బండ్ రాములు ఉన్నారు… సొసైటీలకు ఇస్తాడా..? వ్యక్తులకు ఇస్తాడా అనే క్లారిటీ కూడా రేవంత్ రెడ్డి ఇవ్వలేదు…
Share this Article