Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

క్షమాపణకు ‘దురంధర్ స్టార్’ రెడీ… ఇక్కడితో ముగించాలని వేడికోలు…

March 26, 2026 by M S R

.

అందరూ దురంధర్ సినిమా కంటెంటు, వసూళ్లు, రికార్డుల గురించి మాట్లాడుతున్నారు… సినిమాలోని పాత్రల నిజజీవిత వ్యక్తుల కథలూ చర్చిస్తున్నారు… పాకిస్థానీలతోపాటు ఇండియాలోని ఇండియా వ్యతిరేకుల ఏడుపుల గురించీ చెప్పుకుంటున్నారు… సినిమాపై అకారణ ద్వేషం ప్రదర్శించేవాళ్లు కొందరైతే… దర్శకుడిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నవాళ్లు చాలామంది… ఐతే ప్రధానంగా సినిమాలో చెప్పుకోవాల్సిన అంశం… కథానాయకుడు రణవీర్ సింగ్ నటన…

తను మంచి నటుడిగా గతంలోనూ ప్రూవ్ చేసుకున్నాడు కానీ దురంధర్‌లో విశ్వరూపం… నటనకు కీలకంగా చెప్పే నాలుగు అంశాల్లోనూ… అంటే ఆంగికం, వాచికం, ఆహార్యం, సాత్వికం… అన్నింట్లోనూ టాప్ రేంజ్… అంటే, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, లుక్, ఎమోషన్స్ ఎట్సెట్రా… ఆ పాత్రకు తగిన నటనను దర్శకుడు ఆదిత్య థర్ పిండుకున్నాడు రణవీర్ సింగ్ నుంచి…

Ads

నిన్నటి నుంచీ మరో రెండు అంశాలు కూడా బహుళ ప్రచారంలోకి వస్తున్నాయి… అందులో ఒకటి రణవీర్ సింగ్ కాంతార కంట్రవర్సీ… ఓసారి ఎక్కడో (IFFI- గోవా వేడుక) కాంతారలో రిషబ్ శెట్టి నటనను మెచ్చుకుంటూ ఫ్లోలో ఓ తప్పు చేశాడు… నిజానికి తప్పు కాదు, పొరపాటు… చాముండి దేవతగా రిషబ్ శెట్టి అభినయాన్ని ప్రశంసించేవేళ ఆడ దెయ్యం అని నోరుజారాడు… అంతేకాదు, దెయ్యం అనే అర్థమొచ్చేలా కళ్లు, నాలుక తిప్పుతూ నటించి చూపాడు…

అది సహజంగానే భూతకోల ప్రాంత విశిష్ట దైవాలను అవమానించినట్టుగా జనంలోకి వెళ్లింది… సోషల్ మీడియా విరుచుకుపడింది… కర్నాటకలో ఎక్కడో ఓ కేసు కూడా నమోదైంది… అక్కడికి ఆ వేదిక మీద రిషబ్ శెట్టి వారిస్తున్న రణవీర్ సింగ్ వినిపించుకోలేదు… తను ఉద్దేశపూర్వకంగా ఒక కల్చర్‌ను, ఒక ప్రాంత మనోభావాల్ని (హిందూ) కించపరిచే ఉద్దేశం లేకపోయినా సరే… ఎప్పుడైతే బలమైన వ్యతిరేకత వ్యక్తమైందో… అప్పుడే హుందాగా క్షమాపణ చెబితే సంస్కారయుతంగా ఉండేది… కానీ చెప్పలేదు…

రణవీర్

నిన్న కోర్టులో తన న్యాయవాది ‘‘బేషరతు క్షమాపణలు చెబుతూ కోర్టుకు అఫిడవిట్ ఇవ్వడానికి రణవీర్ సింగ్ రెడీ, అలాగే మైసూరు చాముండి హిల్స్ గుడికి వెళ్లి, మొక్కి, దేవతకు క్షమాపణ నివేదిస్తాడు’’ అని కోర్టుకు చెప్పాడు… సమాజంపై ప్రభావం చూపగల సెలబ్రిటీలు మతానికి సంబంధించిన అంశాల్లో సంయమనంతో, వివేకంతో మెలగాలని కోర్టు కూడా అసంతృప్తిని వ్యక్తీకరించింది… అఫిడవిట్ కాదు, బహిరంగ క్షమాపణ (ఓరల్ అపాలజీ) బెటర్ అని సూచించింది…

నిజానికి రణవీర్ సింగ్ మతం పట్ల నాట్ పర్టిక్యులర్… వాళ్లది పాకిస్థాన్ నుంచి దేశవిభజన సమయంలో కష్టాలు పడుతూ ఇండియాకు వలసవచ్చిన కుటుంబం… తాత సిఖ్, నానమ్మ క్రిస్టియన్… తను పెళ్లి చేసుకున్నది కొంకణ్ హిందూ దీపిక పడుకోన్… సింధీ సంప్రదాయాలు… పెళ్లి సమయంలో కూడా అటు సిఖ్ కల్చర్‌లో, అటు కొంకణ్ హిందూ స్టయిల్‌లో వివాహ కార్యక్రమాలు నిర్వర్తించారు…

మరో అంశం… ఇంత భారీ విజయం సాధించినా సరే రణవీర్ సింగ్ భార్య దీపిక పడుకోన్ ఎక్కడా సక్సెస్ మీట్లలో గానీ, ఆ టీమ్‌తో గానీ ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపించలేదు… దీనిపైనా విమర్శలు, ఎందుకంటే, తనది లిబరల్ మైండ్ సెట్… తను సినిమా నచ్చలేదనీ, అందుకే దూరం ఉంటోందని విమర్శల సారం…

యామి

నిజమే, తన మైండ్ సెట్ అదే, గతంలో జేఎన్‌యూ అరాచక అల్లర్లు, నిరసనల వద్దకు వెళ్లి మరీ మద్దతు పలికింది… కానీ ఈ సినిమా విషయంలో ఆమె దూరంగా ఉండటానికి కారణం బహుశా మరో కారణం కావచ్చు… ఆమె, రణవీర్ తమ సినిమాలకు సంబంధించి ఇండిపెండెంట్‌గా వ్యవహరిస్తారు… ఒకరి సినిమా ప్రమోషన్లకు మరొకరు పెద్దగా పట్టించుకోరు… ఇదీ అంతేనేమో… పైగా తన బిడ్డను చూసుకోవడానికే ఆమె ప్రాధాన్యత… దీని కోసమే కదా, ఆమె కల్కి-2 ను కూడా వదిలేసుకుంది… దురంధర్ సినిమాతో తనకు ప్రత్యక్ష సంబంధం లేదు…

దీపికకు కంట్రాస్టుగా యామీ గౌతమ్‌ను  చూపిస్తున్నారు చాలామంది… కానీ యామీ దురంధర్ సినిమా టీమ్ మెంబర్… సినిమా విజయాన్ని ప్లస్ దర్శకుడిగా తన భర్త విజయాన్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తుంది… పైగా ఆమె జాతీయవాది… ఆ జంట ప్రధాన సినిమాలు అలాంటివే… సో, దీపికనూ, యామీని ఒకేరకంగా చూడలేం కూడా..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సిద్దిపేట మాత్రమే కాదు..! సిరిసిల్ల, గజ్వెల్ కూడా *అన్ బ్రేకబుల్* కావు..!!
  • ఒక హైజాకర్… ఒక గ్యాంగ్‌స్టర్… వేర్వేరు కథలు… ఒకటే అంతిమతీర్పు…
  • క్షమాపణకు ‘దురంధర్ స్టార్’ రెడీ… ఇక్కడితో ముగించాలని వేడికోలు…
  • … ఇప్పుడైతే ఆ పాట మీద పెద్ద గొడవ అయ్యేదేమో… అసలే మోహన్‌బాబు…
  • మల్టీ నేషనల్ కంపెనీలకన్నా మనవాళ్లు తక్కువేమీ కాదు… చదవండి…
  • ఓహ్… స్టార్‌టీవీ Vs జీటీవీ… ఇంత కథ ఉందా..? స్టార్ ఫుల్‌ఫామ్ తెలుసా..?!
  • ఏడుపుగొట్టు కేరక్టర్లను వదిలేయండి… దురంధర్ సక్సెస్ ఏంటో తెలుసా..?!
  • వావ్, షేన్ వార్న్..! సంపద సృష్టించడం అంటే, ఇదుగో ఇదీ…
  • అన్నీ నిజాలు చెప్పడం మొదలెడితే… ప్రతి క్షణం అమెరికా ఇరాన్ వార్ మరి..!!
  • కార్పొరేట్ క్రికెట్ దందా… ఖాళీ సీట్లు… డొల్ల బాధ్యత… కాస్మెటిక్ కన్నీళ్లు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions