Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒక హైజాకర్… ఒక గ్యాంగ్‌స్టర్… వేర్వేరు కథలు… ఒకటే అంతిమతీర్పు…

March 26, 2026 by M S R

.

దురంధర్ సినిమాలోని రెండు పాత్రల కథలు చెప్పేది ఒకటే — మన చట్టాలు, మన న్యాయాలు కొందరిని శిక్షించలేనప్పుడు… కాలం ఊరుకోదు, పాపం పండినరోజు ఏ అజ్ఞాత తుపాకీయో సరైన ‘శిక్ష’ను నిర్దాక్షిణ్యంగా అమలు పరుస్తుంది… కేసులు క్లోజ్ చేస్తుంది… వివరాల్లోకి వెళ్తే…

IC-814 హైజాకర్ నుంచి అతీక్ అహ్మద్ వరకూ: పాపం పండితే…  ఒకడు విమానం హైజాక్ చేసిన ఉగ్రవాది… మరోడు ప్రజాస్వామ్యంలోనే ఎదిగిన మాఫియా నాయకుడు… బయటకి చూస్తే — ఇద్దరి ప్రపంచాలు వేరు. కానీ లోతుగా వెళ్తే — ఒకే అంతిమ తీర్పు కనిపిస్తుంది. అది కోర్టు తీర్పు కాదు… కాలం ఇచ్చిన తీర్పు.

Ads

1999లో జరిగిన Indian Airlines Flight IC-814 hijacking ఘటనలో, Zahoor Mistry అనే పేరు ఒక భయంకర గుర్తుగా నిలిచిపోయింది. విమానంలో నిరపరాధి ప్రయాణికుడిని హత్య చేసి, దేశాన్ని ఒత్తిడికి గురిచేసిన ఆ ఘటన తర్వాత… అతను మాయమయ్యాడు. ఆ సందర్భంలోనే జైష్ ఏ మొహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజహర్‌ను విడిచిపెట్టాల్సి వచ్చింది… అనేక ఉగ్రసంఘటనలకు ప్రధాన బాధ్యుడు…

కానీ సంవత్సరాలు గడిచాయి. ప్రభుత్వాలు మారాయి. కానీ జహూర్ మిస్త్రీపై విచారణ లేదు, న్యాయం లేదు… అసలు దొరికితే కదా… ఎంచక్కా కరాచీలో ఒక కొత్త పేరుతో జీవించాడు… పాకిస్థాన్ అంటేనే అలాంటివాళ్లకు అడ్డా, సేఫ్ జోన్ కదా… ఒకప్పుడు దేశాన్ని కుదిపేసినవాడు… రహస్యంగా ఎక్కడో, నిశ్శబ్దంగా జీవితం గడిపాడు…

ఇంకో వైపు, Atiq Ahmed కథ మరింత విరుద్ధంగా ఉంటుంది. తను ఎక్కడా దాక్కో లేదు. భయపడలేదు. కేసులు ఉన్నా, ఆరోపణలు ఉన్నా — ప్రజల మధ్యే తిరిగాడు. రాజకీయ శక్తిని కవచంగా మార్చుకుని, నేరాలపై నేరాలు పెంచుకుంటూ ముందుకెళ్లాడు. చట్టం అతని వెంటాడినట్టు కనిపించింది… కానీ అతనిని ఆపలేకపోయింది.

ఇద్దరిలో ఒకడు రహస్యంగా నీడల్లో జీవించాడు… మరొకడు వెలుగులోనే జీవించాడు… కానీ పాపం పండినప్పుడు కాలం వెనకాముందూ చూడలేదు… ఏ తేడా చూపలేదు…  సంవత్సరాల తర్వాత, కరాచీలో కాల్పుల్లో Zahoor Mistry చనిపోయాడు. ఎవరూ పెద్దగా ఊహించని ముగింపు. ఒక కథకు అదీ ముగింపు… ఆ తుపాకీ ఎవరిది..? తేలదు, అదంతే… అదేలాగా, 2023లో పోలీస్ కస్టడీలోనే, కెమెరాల ముందు కాల్చి చంపబడ్డాడు Atiq Ahmed. దేశం మొత్తం చూస్తుండగానే — మరో కథ ముగిసింది.

ఎట్టకేలకు అంతిమ న్యాయం జరిగిందా లేదా అన్నది డిబేటబుల్ కావచ్చు… కానీ ఒక భావన మాత్రం మిగులుతుంది — పాపం ఎంతో కాలం దాక్కోలేదు, ఆ పాపం అనుభవించేరోజు దాకా అంతా సజావుగానే సాగిపోతుంది… కానీ ఓ టైమ్ వస్తుంది… అప్పుడు కాలం కాటేస్తుంది… అజ్ఞాత తీర్పరులు శిక్షలు అమలు చేస్తారు… చేసిన పనుల నీడ మాత్రం ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది…

Dhurandhar 2 ఇలాంటి నిజ జీవిత కథలనే ఆధారంగా తీసుకుంది… మనలో ఉన్న ఆ భావన — “ఎప్పుడో ఒక రోజు అలాంటోళ్ల కథలకు సరైన ముగింపు రావాలి కదా” — దాన్నే తెరపై చూపించింది. సరిగ్గా సినిమాలో చూపించినట్టుగా, అదే జరిగిందా అనే ప్రశ్నకు జవాబు ఉండదు… అవసరం లేదు కూడా…!! కానీ ఆ తీర్పు నచ్చింది కాబట్టే కోట్ల మంది ఆ సినిమా చూసి చప్పట్లు కొడుతున్నారు, ఆమోదిస్తూ, అభినందిస్తూ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • IPL … అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాదు… ఇండియన్ పైసా లీగ్…
  • దురంధర్-3 కాదు…! ఆదిత్య ధర్ దృష్టి మరో పే-ద్ద ప్రాజెక్టు మీద..!!
  • సిద్దిపేట మాత్రమే కాదు..! సిరిసిల్ల, గజ్వెల్ కూడా *అన్ బ్రేకబుల్* కావు..!!
  • ఒక హైజాకర్… ఒక గ్యాంగ్‌స్టర్… వేర్వేరు కథలు… ఒకటే అంతిమతీర్పు…
  • క్షమాపణకు ‘దురంధర్ స్టార్’ రెడీ… ఇక్కడితో ముగించాలని వేడికోలు…
  • … ఇప్పుడైతే ఆ పాట మీద పెద్ద గొడవ అయ్యేదేమో… అసలే మోహన్‌బాబు…
  • మల్టీ నేషనల్ కంపెనీలకన్నా మనవాళ్లు తక్కువేమీ కాదు… చదవండి…
  • ఓహ్… స్టార్‌టీవీ Vs జీటీవీ… ఇంత కథ ఉందా..? స్టార్ ఫుల్‌ఫామ్ తెలుసా..?!
  • ఏడుపుగొట్టు కేరక్టర్లను వదిలేయండి… దురంధర్ సక్సెస్ ఏంటో తెలుసా..?!
  • వావ్, షేన్ వార్న్..! సంపద సృష్టించడం అంటే, ఇదుగో ఇదీ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions