Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యుగాంతం..! విశ్వ వినాశనం దిశలో అమెరికా- రష్యా ప్రాక్సీ వార్..!!

March 28, 2026 by M S R

.

Pardha Saradhi Potluri ….హార్మోజ్ జలసంధి అనేది అత్యంత కీలకమైన చమురు, గ్యాస్ రవాణా మార్గం!
20% గ్లోబల్ ఆయిల్ మరియు గ్యాస్ సప్లై హార్ముజ్ నుండే జరుగుతుంది!
అయితే పశ్చిమ ఆసియా ని యూరోపు తో, మిగతా ఆసియా దేశాలని కలుపుతూ సముద్రం కింద ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ ఉన్నాయి!

అమెరికాతో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ ఓడిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు ఇరాన్ సముద్రపు అడుగున ఉండే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ని కట్ చేస్తుంది! ఈ మేరకు ఇప్పటికే ఇరాన్ హేచ్చరిక జారీ చేసింది!
ఒక్క హార్ముజ్ స్ట్రెయిట్ లోనే కాదు ఎర్ర సముద్రం కింద ఉన్న కేబుల్స్ ని కూడా కట్ చేస్తానని ఇరాన్ హేచ్చరించింది! రెడ్ సీ అనేది ఎమెన్ తిరుగుబాటు గ్రూపు అయిన హుతీ అధీనంలో ఉన్న సంగతి తెలిసిందే!

Ads

రష్యన్ టెలిగ్రామ్ ఛానెల్ కధనం ప్రకారం… ఇరాన్ తో పాటు ఇరాన్ ప్రాక్సీ అయిన హుతీ గ్రూపు సముద్రపు అడుగున ఉన్న ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ని కట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది!
జస్ట్ అమెరికన్ ప్యారా ట్రూపు దళాలు ఇరాన్ నేలపై అడుగుపెట్టగానే ఇంటర్నెట్ కేబుల్స్ ని కట్ చేసి అమెరికన్స్ కి స్వాగతం పలకాలని ప్లాన్!
అండర్ సీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కట్ అయితే ఏమవుతుంది?

1.యూరోపుకి ఆసియా దేశాల మధ్య ఇంటర్నెట్ ట్రాఫిక్ అనేది 90% డాటా కట్ అయిపోతుంది!
2.గ్లోబల్ ఇంటర్నెట్ విషయానికి వస్తే 17% డాటా కట్ అవుతుంది.
3.గల్ఫ్ ప్రాంతంలో హై స్పీడ్ ఇంటర్నెట్ తో పాటు మల్టీ బిలియన్ డాలర్ల AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి విఘాతం కలుగుతుంది
4.ఇరాన్ ప్రధాన లక్ష్యం అమెరికన్ టెక్ కంపెనీలు.

5.UAE లో ఉన్న మైక్రోసాఫ్ట్ AI 15.2 బిలియన్ డాలర్ల పెట్టుబడితో కొనసాగుతున్నది. కానీ కేబుల్స్ కట్ అయితే తీవ్రంగా నష్టపోతుంది!
6.సౌదీ అరేబియాలో అమెజాన్ క్లౌడ్ సెంటర్ మీద దాడి చేసి నష్టపరిచింది ఇరాన్ ఇప్పటికే! కానీ కేబుల్స్ కట్ అయితే నష్టం తీవ్రంగా ఉంటుంది!
7.దమ్మామ్ లో ఉన్న 10 బిలియన్ డాలర్ల గూగుల్ AI సెంటర్ కి మిగతా ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి.

  • So…! పుతిన్ ప్రతీకారం తీర్చుకుంటున్నాడు అని నేను వ్రాస్తున్న వ్యాసాలకి అర్ధం ఉంది.
    నెల రోజుల క్రితం గుజరాత్ లోని నయారా చమురు శుద్ధి కర్మాగారానికి మైక్రోసాఫ్ట్ తన సేవలని నిలిపివేసింది కేవలం 49% శాతం వాటా రష్యాకి ఉన్నందున! అఫ్కోర్స్ భారత ప్రభుత్వ అభ్యర్ధన మేరకు మళ్ళీ తన సర్వీస్ ని పునరిద్దరించింది మైక్రోసాఫ్ట్!


అమెరికా, ఇజ్రాయేల్ ఇరాన్ తో చేస్తున్న యుద్ధం కేవలం మూడు దేశాల మధ్య జరుగుతున్నదానిగా చూడకూడదు!
రష్యా ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న యుద్దాన్ని రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంగా చూడకూడదు!
రష్యా Vs యూరోపు, అమెరికా గా చూడాలి! ఉక్రెయిన్ అనేది ఒక పావు మాత్రమే!
అమెరికా, ఇజ్రాయేల్ Vs ఇరాన్ ల మధ్య జరుగుతున్న యుద్ధం ని అమెరికా Vs రష్యా, చైనా ల మధ్య యుద్ధంగా చూడాలి! ఇక్కడ ఇరాన్ ఒక పావు.



వారం రోజుల కిందట భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఒక మాట అన్నారు…
“ జియో పాలిటిక్స్ అర్ధం చేసుకోవడం చాలా కష్టమైన విషయం. ఎందుకు ఎప్పుడు ఏ దేశం ఎటువైపు మళ్ళుతుందో తెలుసుకునే లోపు జరగాల్సినది జరిగిపోతున్నది ”
అమెరికా గ్రీన్ లాండ్స్ దేశం తనదే అని ప్రకటించగానే యూరోపు అమెరికా కి వ్యతిరేకమైంది!
ఆఫ్రికా దేశం అయిన ఉగాండ ఇజ్రాయేల్ వైపు జరుగుతున్నది.

సోమాలి లాండ్ అనేది చాలా చిన్న స్వయం ప్రకటిత దేశం కానీ ఇజ్రాయేల్ సైనిక స్థావరం పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది. అంతకుముందు సోమాలి లాండ్ ని ఒక సార్వభౌమ దేశంగా ఇజ్రాయేల్ గుర్తించింది. సోమాలి లాండ్ ఎర్ర సముద్రం ఎదురుగా ఉండే హుతీ అదీనంలో ఉన్న ఎమెన్ కి ఎదురుగా ఉంది.
మనకు తెలియకుండానే లాంఛనంగా మూడో ప్రపంచ యుద్ధం మొదలయింది!

జస్ట్! అమెరికన్ దళాలు ఇరాన్ మీద అడుగు పెట్టడం ఇరాన్, హుతీ అండర్ సీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కట్ చేయడంతో నాటో దేశాలు అమెరికాతో వచ్చి చేరతాయి.
రష్యా అమెరికన్ కమ్యూనికేషన్ సాటిలైట్స్ ని పేల్చడంతో అధికారికంగా మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది!

భారత్ పాత్ర ఎలా ఉండబోతున్నది?
గుడ్ ఓల్డ్ పాలసీ!
మొదటి ప్రపంచ యుద్ధం మొదలై ముగిసినా, రెండో ప్రపంచ యుద్ధం మొదలైనా అమెరికా అన్ని దేశాలకి మందులు, ఆహారం, ఆయుధాలు సప్లై చేస్తూ లాభపడ్డది!

జపాన్ అమెరికాలోని పెరల్ హార్బర్ మీద దాడి చేయడంతో అమెరికా కూడా రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొనాల్సి వచ్చింది అని చరిత్ర! కానీ జపాన్ పెరల్ హార్బర్ మీద దాడి చేసింది కామికాజ్ విమానాలతో. పెరల్ హార్బర్ లో ఉన్న అమెరికన్ యుద్ధ నౌకలు దెబ్బతిన్నాయి కానీ అవి మునిగిపోయెంతలా కాదు!
మరి ఎలా మునిగిపోయాయి?
అండర్ వాటర్ టార్పేడోస్ వల్ల. అవి అమెరికావే!

So! ప్రపంచ యుద్ధం మొదలైతే భారత్ ఎటువైపూ ఉండక తటస్థంగా ఉంటుంది!
ఇప్పటికే చమురు, గాస్ రవాణా వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటుంటే ఇంటర్నెట్ ఔటేజ్ రూపంలో మరో ఉపద్రవం సిద్ధంగా ఉంది!
సముద్రం అడుగున ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ని మళ్ళీ వేయడానికి నెలల సమయం పడుతుంది అదీ యుద్ధం ఆగిపోయాక మాత్రమే!

హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లుగా ఇరాన్ ప్రకటించింది అంటే అసలుకే ఎటువంటి రవాణా జరగదు అన్నమాట!
మరో వైపు ఎర్ర సముద్రం నుండి కూడా రవాణా ఆగిపోవచ్చు రేపటి నుండి! హుతీ లు కూడా ఇరాన్ తో కలిసి పోరాడాలని నిర్ణయించారు!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆట ఆడితే, ఆడిస్తే కోట్లు జలజలా రాలాలె… మేం అస్సలు ఆడం పో…
  • యుగాంతం..! విశ్వ వినాశనం దిశలో అమెరికా- రష్యా ప్రాక్సీ వార్..!!
  • మీరు క్రికెట్ ప్రేమికులా..? ఐతే తప్పకుండా ఓసారి చదవాల్సిందే…
  • ‘కోడి మెడ’..! ఒవైసీ చేతికి చిక్కుతుందా..? బెంగాల్ ముఖచిత్రమేంటి..?!
  • పాపం కమలహాసన్..! త్యాగమో, వైరాగ్యమో, సన్యాసమో… హిట్ వికెట్..!
  • సదరు ప్రవచనకర్తకు అస్సలు నచ్చని 2 వార్తలు..! అవేమిటంటే..?!
  • సారా కొంటేనే రేషన్ పంపిణీ… వ్యభిచారానికి చట్టబద్ధత… ఇంకా..?
  • ఐటీ హబ్ మాత్రమే కాదు… ‘మంచి’రేవులకు భక్తి పర్యాటక వైభోగం…
  • జగదానంద కారకా… జయ జానకీ ప్రాణనాయకా… శుభ స్వాగతం…
  • ‘కొరుకుడుపడని’ రోత… మారితే మల్లెమాల కాదు… జబర్దస్త్ అసలే కాదు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions