Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కామాఖ్య మానస పూజ- దేవధని ఉత్సవాలు..! పెద్ద బలులు బంద్ !!

August 4, 2026 by M S R

.

ప్రస్తుతం గౌహతిలోని కామాఖ్య శక్తిపీఠంలో దున్నపోతుల బలి పూజ జరగడం లేదు… ఈమధ్య మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది ఈ పూజల కోసం వెళ్తున్నారు కదా, అందుకోసం ఈ క్లారిటీ… ఈనెల 17 వరకూ అంతే…

ప్రముఖ జ్యోతిష్కుడు, వామాచార పూజలు నిర్వర్తించే వేణుస్వామి ఇస్తున్న మరింత స్పష్టత ఏమిటంటే..? గుడిని మొత్తం మూసేసే అంబుబాచీ సమయంలో ఏ బలిపూజలూ ఉండవు… జూన్‌లో ఆ మూడు రోజులు అయిపోయాయి, ఆ మేళా అయిపోయింది… ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే..?

Ads

ప్రతి సంవత్సరం నిర్వహించబడే అత్యంత విలక్షణమైన, ఆధ్యాత్మిక పండుగే “మానస పూజ, దేవధ్వని (Deodhani) మేళా ఇప్పుడు జరుగుతోంది… “ధియోధని” అనేది వాస్తవానికి అస్సామీ సంప్రదాయంలో “దేవధ్వని” (లేదా దియోధని / Deodhani) ఉత్సవాన్ని సూచిస్తుంది… 17వ తేదీ వరకు ఈ ఉత్సవాలు…

deodhani

ఈ పండుగ రోజుల్లో నాగుల దేవత అయిన మా మానస దేవికి ఆలయంలోని నత్‌మందిర్ (మధ్య భాగం) లో ప్రత్యేక మానస పూజలు నిర్వహిస్తారు… దేవధ్వని (Deodhani) నృత్యం అనేది ఓ సంప్రదాయిక, మార్మిక, ఆధ్యాత్మిక నృత్యం… ఈ ఉత్సవంలో పాల్గొనే నృత్యకారులను ‘దేవదాస్’ లేదా ‘దియోధా’ అంటారు… వీరు పూజల సమయంలో దైవిక శక్తులు ఆవహించినట్లుగా (పూనకం వచ్చినట్లు) తీవ్రమైన ఆధ్యాత్మిక స్థితిలోకి (Trance) వెళ్తారు…

kamakhya

పూనకంలో ఉన్న వీరు చేతిలో కత్తులు, డాలు లేదా కర్రలు పట్టుకుని, డప్పులు, తాళాల శబ్దాలకు అనుగుణంగా ఉధృతంగా నృత్యం చేస్తారు. కొన్నిసార్లు పదునైన కత్తి అంచులపై కూడా నిలబడి నృత్యం చేయడం వీరి ప్రత్యేకత.  గిరిజన, తాంత్రిక సంప్రదాయాల కలయికతో జరిగే ఈ పండుగను చూడటానికి దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు కామాఖ్య దేవాలయానికి తరలివస్తారు…

ఈ ఉత్సవం తరువాత నీలాంచల్  (కామాఖ్య కొలువైన గుట్ట) మీద ఉండే ప్రతి ఇంట్లో మేకను బలి ఇస్తారు… 17 వరకు కూడా చిన్న చిన్న గుళ్లల్లో మేకలు, ఇతర బలిపూజలు జరుగుతాయి, ప్రధాన దేవాలయంలోనూ ఈ బలిపూజలు జరుగుతాయి, కానీ దున్నపోతు బలి మాత్రం నిలిపివేస్తారు… 17 తరువాత యథావిధిగా అన్ని పూజలూ ఉంటాయి’’

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • K I L L …! యండమూరి విశ్లేషణ- సమీక్ష … భిన్నం – ఆసక్తికరం !
  • ఎలపరం ! కాలేజీ ప్రాంగణాలు ఇక సినిమా ఫంక్షన్లకు అద్దె వేదికలు !!
  • ప్రతి మెహిందీ కథా ఇంతే ! వెలుతురు ఎరుగని చీకటి తడి అంగడి !
  • నిజం- ఓటీటీ భ్రమలు బద్ధలయ్యాకే… తెలుగు సినిమా బతుకుతోంది !
  • సంక్షోభమూ ఓ అవకాశమే ! రేవంత్ రెడ్డి వాడుకోగలిగితే భలే చాన్స్ !!
  • Save Vijayawada – ముందు బెజవాడను బతికించండి, తరువాతే మెట్రో !!
  • ఇస్రో ఇకపై రాకెట్లు తయారుచేయదట… మరి ఏం చేస్తుంది ? 
  • నిజం ఏదో చెప్పాల్సిన మీడియానే… నిజం కోసం వెతకాల్సి వస్తే ?
  • ఆరబోత – వాన పాట – అదీ ఓ కుర్ర హీరో … అప్పట్లో సౌందర్య సైతం !!
  • అనసూయా జాగ్రత్త ! కర్మ ఎవరినీ వదలదు ! పది రెట్లు తిరిగి ఇస్తుంది !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions