Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏదో ఒకరోజు… తప్పకుండా వస్తుంది… అప్పుడు ‘గుర్తింపు’ తథ్యం…

March 29, 2026 by M S R

.

Mohammed Rafee…. గుర్తింపు కోసం ఎదురు చూసే నటులకు రాకేష్ బేడి గొప్ప ఇన్-స్పిరేషన్
ఎవరికి ఎప్పుడు గుర్తింపు వస్తుందో చెప్పలేం! ఎవరి టర్నింగ్ పాయింట్ ఎలా ఉంటుందో ఊహించలేం! రాకేష్ బేడిని ఉదాహరణగా తీసుకోండి! అతని జీవితమే నేటి నటులకు ఒక గొప్ప ఇన్-స్పిరేషన్.

దురంధర్ పార్ట్ 1, పార్ట్ 2లో అతను పాక్ రాజకీయ నాయకుడు జమీల్ జమాలి విలన్ పాత్ర పోషించాడు. హీరో రణవీర్ సింగ్ కు మామ పాత్ర! హీరోయిన్ సారా అర్జున్ తండ్రి పాత్ర! నవ్విస్తూనే సినిమాకు సీరియస్ నెస్ ఇచ్చే కీలక పాత్ర! అందులో జీవించాడు రాకేష్ బేడి!

Ads

“ఈ ఒక్క పాత్ర చాలు నేను మరణించినా తనను ప్రపంచం గుర్తు పెట్టుకుంటుంది. థాంక్స్ టు డైరెక్టర్ ఆదిత్య ధర్” అని తృప్తిగా వ్యాఖ్యానించాడు రాకేష్ బేడి!

రాకేష్ బేడి వయసు 71. గత 50 ఏళ్లుగా నటిస్తున్నాడు! కానీ, అతన్ని గుర్తు పెట్టుకునే పాత్ర దురంధర్ ద్వారా ఇప్పుడు వచ్చింది! ఇన్నాళ్లు ఎన్ని స్ట్రగుల్స్! 600 పైగా సినిమాలు చేశాడు. ఎన్నో సీరియల్స్ నటించాడు! రంగస్థలంపై ఎన్నో నాటకాలు ప్రదర్శించాడు! ఇక తన జీవితం ఇలా సింపుల్ గా ఒక చిన్న సైజు పాత్రల నటుడు అనే స్టాంప్ కే పరిమితం అనుకున్నాడు! అందులోనే దొరికిన ప్రతి పాత్రను చేస్తూ వచ్చాడు!

కానీ, దురంధర్ తన 71వ ఏట నటనా జీవితాన్ని మేలి మలుపు తిప్పింది! అతని కెరీర్ లో ఇది అద్భుతంగా గుర్తింపు తెచ్చింది. అందుకే పెద్దలు అంటుంటారు… ఎప్పుడు ఎవ్వరికి ఏ విధంగా గుర్తింపు వస్తుందో ఎవ్వరం చెప్పలేం! ప్రయత్నిస్తూ ఉండాలి! నిరుత్సాహ పడకూడదు! ఎప్పుడైనా మారొచ్చు!

1970లో నటుడుగా ప్రవేశించిన రాకేష్ బేడి బాలీవుడ్ సినిమాల్లో ఎన్నో రకాల కామెడీ పాత్రలు పోషించాడు! కానీ గుర్తింపు లేదు! బ్రేక్ కూడా లేదు! కానీ గత ఏడాది స్పై థ్రిల్లర్ దురంధర్, ఈ ఏడాది సీక్వెల్ ది రివెంజ్ దురంధర్ మాత్రమే అతడ్ని గొప్ప నటుడుగా నిలబెట్టాయి!

“ఒకరు గుర్తించడం కాదు, తాను పోషించిన వేలాది పాత్రల్లో ఇన్నాళ్లకు తనకు సంతృప్తి ఇచ్చిన పాత్ర జమీల్ జమాలి” అని రాకేష్ చెబుతున్నారు. ఢిల్లీకి చెందిన రాకేష్ పూణే ఫిల్మ్ ఇన్-స్టిట్యూట్ లో శిక్షణ పొంది ముంబయికి మకాం మార్చి రంగస్థలం, టివి, సినిమాల్లో నటుడుగా స్థిరపడ్డారు! “గత 50 ఏళ్లుగా బతకడానికి వివిధ పాత్రల్లో నటించాను. ఇప్పుడు జనం గుర్తించారు. ఇక జనం కోసం, జనాదరణ కోసం నటిస్తాను” అంటున్నారు తృప్తిగా రాకేష్ బేడి!

అవును మన తెలుగు చిత్ర పరిశ్రమలో, టివి, రంగస్థల రంగాల్లో అద్భుతమైన నటులు వున్నారు! సరైన పాత్రలు లభించడం లేదని నిరాశ నిస్పృహల్లో వున్నారు! వారందరికీ రాకేష్ బేడి ఇన్-స్పిరేషన్ కావాలి! ఎప్పుడు ఎవరి జీవితం టర్న్ అవుతుందో ఎవ్వరం చెప్పలేం! వయసు నంబర్ మాత్రమే! ఆశగా అనుకున్న రంగంలో అడుగులు వేయడమే! వెలుగు పైవాడు ఇస్తాడు అంతే! – డా. మహ్మద్ రఫీ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏదో ఒకరోజు… తప్పకుండా వస్తుంది… అప్పుడు ‘గుర్తింపు’ తథ్యం…
  • జాతి రథసారథులు… టాప్-100 వ్యక్తుల జాబితా, పరిచయాలు…
  • నో కేసీయార్… నో జగన్… టాప్-25 జాబితాలో రేవంత్ రెడ్డి…
  • స్వామి పర్వర్షన్‌‌కు తోడుగా కిష్వర్ పైత్యం… మోడీని గోకుతున్నారు…
  • శిఖరాగ్రం నుండి శూన్యం వరకు… రేమండ్స్ విజయపథ్ ‘డెస్టినీ’…
  • శెట్టి గ్యాంగ్ కకావికలు… డబుల్ హేపీతో రష్మిక పకపకలు…
  • బ్రహ్మర్షి విశ్వామిత్ర … ఆకట్టుకోని ఎన్టీయార్ సొంత సినిమా…
  • మీడియా వార్ కాదు… ఇగో వార్… టీవీ5 Vs ఎన్టీవీ… నాయుడు Vs చౌదరి…
  • ఆట ఆడితే, ఆడిస్తే కోట్లు జలజలా రాలాలె… మేం అస్సలు ఆడం పో…
  • యుగాంతం..! విశ్వ వినాశనం దిశలో అమెరికా- రష్యా ప్రాక్సీ వార్..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions