Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హైదరాబాదీ రాజసం..! ఎవరు ఈ రియా పిళ్లై..? ఎందుకు మళ్లీ వార్తల్లోకి..!?

April 1, 2026 by M S R

.

టెన్నిస్ కోర్టులో ‘పేస్’… జీవితంలో ‘కేస్’… ఎవరీ రియా పిళ్ళై..? హైదరాబాద్‌తో ఆమెకున్న విడదీయరాని బంధం ఏమిటి..? నిన్న లియాండర్ పేస్ బీజేపీలో చేరాడు, సరిగ్గా ఎన్నికలకు ముందు… ఈ నేపథ్యంతో తన వ్యక్తిగత జీవితం, తన మాజీ భార్య జీవితం హఠాత్తుగా వార్తల్లోకి, ప్రచారంలోకి వచ్చింది…

భారత టెన్నిస్ చరిత్రలో లియాండర్ పేస్ పేరు ఒక సంచలనం… కోర్టులో ఆయన రాకెట్ పడితే ప్రత్యర్థులు వణకాల్సిందే… కానీ, ఈ టెన్నిస్ దిగ్గజం వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడూ ఒక మిస్టరీలా, వివాదాలకు నిలయంగానే సాగింది… ముఖ్యంగా మోడల్ రియా పిళ్ళైతో ఆయన సాగించిన ప్రయాణం, ఆ తర్వాత జరిగిన గృహ హింస వివాదాలు అప్పట్లో హెడ్ లైన్స్‌లో నిలిచాయి… అయితే, రియా పిళ్ళై కేవలం ఒక మాజీ మోడల్ మాత్రమే కాదు… ఆమె వెనుక ఒక గొప్ప రాజరికపు చరిత్ర ఉంది, దానికి మన తెలంగాణ (హైదరాబాద్) మట్టితో గట్టి సంబంధం ఉంది…

Ads

ఎవరీ రియా పిళ్ళై? … 1965లో లండన్‌లో జన్మించిన రియా పిళ్ళై, 80, 90వ దశకాల్లో భారత ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలిన అగ్రశ్రేణి మోడల్… ఆమె కేవలం గ్లామర్ ప్రపంచానికే పరిమితం కాలేదు, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నది… అయితే, ఆమె జీవితంలోకి ముగ్గురు వ్యక్తులు వచ్చారు… మొదట మైఖేల్ వాజ్, ఆ తర్వాత బాలీవుడ్ ‘సంజూ బాబా’ సంజయ్ దత్... సంజయ్ దత్‌తో విడాకుల తర్వాత లియాండర్ పేస్‌తో ఆమె సహజీవనం, పెళ్లి, ఓ కూతురు, ఆపై గొడవలు కోర్టు మెట్ల వరకు వెళ్లాయి…

భారతీయ రాజకుటుంబానికి చెందినది కావడం, మోడల్‌గా సుదీర్ఘ విజయవంతమైన కెరీర్‌ను కలిగి ఉండటం వల్ల ఆమె జీవితం రాజసంగా, వైభవంగా గడిచింది…  1965లో లండన్‌లో వ్యాపారవేత్త రేమండ్ పిళ్ళై, వైద్యురాలు ధుర్-ఎ-షాహ్వర్ ధనరాజ్‌గిర్ దంపతులకు జన్మించింది… రేమండ్ పిళ్ళై ఒక మలయాళీ హిందూ తండ్రికి, ఆంగ్లో-ఇండియన్ తల్లికి జన్మించాడు, క్రైస్తవుడిగా పెరిగాడు… భిన్న సంస్కృతుల సంగమం…

తెలంగాణతో లింక్: ధన్‌రాజ్ గిర్ వారసత్వం! …. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, రియా పిళ్ళై నరనరాల్లోనూ రాజసం ఉట్టిపడుతుంది… ఆమె తల్లి ధుర్-ఎ-షాహ్వర్ ధనరాజ్‌గిర్... ఈ పేరు వింటేనే పాత హైదరాబాద్ వైభవం గుర్తుకొస్తుంది… రియా పిళ్ళై తాతగారు మరెవరో కాదు.. హైదరాబాద్ నిజాం కాలంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి, మహారాజా నరసింహరాజ్ ధనరాజ్‌గిర్ జ్ఞాన్ బహదూర్…

ధన్‌రాజ్ గిర్ ఎవరు? …. ధన్‌రాజ్ గిర్ కుటుంబం హైదరాబాద్‌లోని అగ్రశ్రేణి హిందూ ప్రభువుల కుటుంబాలలో ఒకటి… వీరు నిజాం నవాబులకు అత్యంత సన్నిహితులు… నిజాం ప్రభువుల నుంచి ‘జ్ఞాన్ బహదూర్’ అనే బిరుదును పొందిన పండిత, ధనవంతుల వంశం వీరిది… ఇప్పటికీ ముంబైలోని కొలాబాలో ఉన్న అత్యంత విలాసవంతమైన ‘ధన్‌రాజ్ మహల్’ ఈ కుటుంబానికి చెందినదే… ఒకప్పుడు ఇది భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ నివాసాలలో ఒకటిగా ఉండేది…

అంటే, రియా పిళ్ళై మన హైదరాబాద్ రాజకుటుంబ వారసురాలు... ఆమెలోని ఆ రాజసం, దర్పం అందుకే కనిపిస్తాయి…

రాజకీయాల్లో పేస్.. వ్యాపారంలో రియా… ఒకవైపు లియాండర్ పేస్ 2021 లో టీఎంసీతో చేరి, గోవాలో ఆ పార్టీ తరఫున ప్రచారం కూడా చేశాడు… కానీ అక్కడ కుదురుకోలేదు, బయటికి వచ్చాడు, నిన్న బీజేపీలో చేరాడు…  మరోవైపు రియా పిళ్ళై తన పెళ్లిళ్ల వివాదాల నుంచి బయటపడి తనదైన శైలిలో రాణిస్తున్నది… 2016లోనే ఆమె ‘ది టెంపుల్ హౌస్ బై రియా పిళ్ళై’ అనే సేంద్రీయ వస్త్రాల బ్రాండ్‌ను ప్రారంభించింది… ఆర్గానిక్ కాటన్, జనపనారతో చేసిన ఆధునిక దుస్తులను రూపొందిస్తూ వ్యాపారవేత్తగా కొనసాగుతోంది…

ఏది ఏమైనా, ఒక టెన్నిస్ దిగ్గజం, ఒక రాజరికపు వారసురాలి కథ ఎన్నో మలుపులతో ఒక సినిమా స్క్రిప్ట్‌ను తలపిస్తుంది… ముఖ్యంగా హైదరాబాద్ గడ్డపై పుట్టిన ధన్‌రాజ్ గిర్ వారసత్వాన్ని రియా పిళ్ళై ఇప్పటికీ తన వ్యక్తిత్వంలో మోస్తూనే ఉన్నది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హైదరాబాదీ రాజసం..! ఎవరు ఈ రియా పిళ్లై..? ఎందుకు మళ్లీ వార్తల్లోకి..!?
  • పొదుపు వేరు- పిసినారితనం వేరు… శృతిమించితే పెళ్లామే వదిలేస్తుంది…
  • జమీల్ జమాలి అలియాస్ నబీల్ డబోల్… ఇంతకీ ఎవరితను..?!
  • ఓ లయబులిటీ..! KCR వదిలించుకుంటే కాంగ్రెస్ నెత్తిన మోస్తోంది..!!
  • మన సుబ్రహ్మణ్యానికి మలయాళీలు చూపిన అరుదైన గౌరవం..!!
  • ఇదీ ఓ పులిట్జర్ ఫోటో కథే… మనసుతో చదవండి… అర్థమవుతుంది…
  • మీకెవరికీ తెలియని వేటూరి… పాటూరి కాదు, సహృదయ బాటూరి…
  • విద్వేష బిల్లుపైనా అదే పింక్ విషం..! సుప్రీం చెప్పిందేమిటో తెలుసా…!!
  • జనగణనలో ‘సహజీవనాని’కీ గుర్తింపు… కానీ అది పెళ్లి సర్టిఫికెట్ కాదు…
  • పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ బజ్వాకు ఏమైంది..? తల ఎందుకు పగిలింది..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions