Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ట్రంపు పుణ్యాన పులిరాజాకు మళ్లీ ఎయిడ్స్ ముప్పు..?!

April 1, 2026 by M S R

.

యుద్ధం అక్కడ… ఇక్కడ పడకగదిపై ప్రభావం! …యుద్ధం కేవలం సరిహద్దులకే పరిమితం కాదు, అది సామాన్యుడి వ్యక్తిగత జీవితాన్ని కూడా తాకుతుందని చెప్పడానికి ఈ వార్త ఒక తాజా ఉదాహరణ… పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల భారత్‌లో గర్భనిరోధక సాధనాల (Condoms) తయారీ తీవ్రంగా దెబ్బతింటోంది… ఈ వార్త చదవగానే గుర్తొచ్చింది అప్పట్లో బాగా హిట్టయిన ఓ యాడ్ స్లోగన్ ‘‘పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా..?’’

అప్పట్లో ఎయిడ్స్ మీద, అరక్షిత శృంగారం మీద చైతన్య ప్రచారం కోసం ఉద్దేశించిన పబ్లిక్ యాడ్ అది… కండోమ్స్ ఉచిత సరఫరా… పేరు నిరోధ్… తరువాత హెచ్ఐవీ కాస్త తగ్గినా, మళ్లీ ఈమధ్య పెరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి… అఫ్‌కోర్స్, మేలైన చికిత్స పద్ధతులు కూడా వచ్చాయి… కానీ ట్రంపు చమురు దేశాల్లో పెట్టిన తంపు పుణ్యమాని, కండోమ్స్ కొరతకు దారితీసి… మళ్లీ అరక్షిత శృంగారం పెరిగి… కుటుంబ నియంత్రణ డిస్టర్బ్ కావడమే కాదు, ఎయిడ్స్ ముప్పు పెరుగుతుందనేది తాజా ఆందోళన…

Ads

 ఎందుకు ఈ కొరత? … కాండమ్ తయారీలో ఉపయోగించే అతి ముఖ్యమైన ముడి పదార్థాల సరఫరాకు ఆటంకం కలగడమే దీనికి ప్రధాన కారణం…

  • సిలికాన్ ఆయిల్ (Polydimethylsiloxane – PDMS)…: కాండమ్స్‌కు లూబ్రికెంట్‌గా పనిచేసే ఈ నూనె ధరలు ఆకాశాన్ని తాకాయి…

  • అమ్మోనియా (Ammonia)…: సహజ రబ్బరు (Latex) పాలు పాడవకుండా ఉండటానికి, ప్రోటీన్లను తొలగించడానికి అమ్మోనియా తప్పనిసరి…. భారత్ తన అవసరాల్లో 86% అమ్మోనియాను సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్‌ల నుంచే దిగుమతి చేసుకుంటుంది… యుద్ధం వల్ల సరఫరా చెయిన్ (Supply Chain) దెబ్బతిని వీటి ధరలు విపరీతంగా పెరిగాయి…

  • ప్యాకేజింగ్ మెటీరియల్…: అల్యూమినియం ఫాయిల్, పాలీ వినైల్ క్లోరైడ్ ఫాయిల్ వంటి ప్యాకేజింగ్ వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగాయి…


 సామాన్యుడిపై ప్రభావం ఎంత? … తయారీ కంపెనీలు (HLL Lifecare, Mankind Pharma, Cupid Ltd) ఇప్పటికే ఉత్పత్తి భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి… దీనివల్ల కలిగే నష్టాలు ఇలా ఉండవచ్చు…

  1. ధరల పెరుగుదల…: అమ్మోనియా ధరలు ఇప్పటికే 40-50% పెరిగాయి… దీనివల్ల మార్కెట్లో కాండమ్స్ ధరలు కూడా పెరగనున్నాయి…

  2. అనారోగ్య ముప్పు…: కాండమ్స్ ధరలు పెరిగితే లేదా కొరత ఏర్పడితే లైంగిక వ్యాధులు (STIs) పెరిగే ప్రమాదం ఉంది….

  3. జనాభా నియంత్రణపై దెబ్బ…: పేద, మధ్యతరగతి వర్గాలకు గర్భనిరోధక సాధనాలు అందుబాటులో లేకపోతే అవాంఛిత గర్భధారణలు పెరిగి, జనాభా నియంత్రణపై ప్రభావం పడుతుంది…

condoms


 స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ (Strait of Hormuz) – అసలు చిక్కు ఇక్కడే… భారతదేశానికి వచ్చే ముడి పదార్థాల రవాణా ప్రధానంగా ఈ సముద్ర మార్గం గుండానే జరుగుతుంది… యుద్ధం కారణంగా ఈ మార్గంలో నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో రవాణా ఛార్జీలు పెరిగి, సరుకు సకాలంలో చేరడం లేదు… ఒక చిన్న ముడి పదార్థం సరఫరా ఆగిపోతే, అది దేశ సామాజిక ఆరోగ్య వ్యవస్థపై ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో ఈ ఉదాహరణ తెలియజేస్తోంది… యుద్ధం ఆగిపోకపోతే, రాబోయే రోజుల్లో ఇదీ ఓ పెద్ద ఆందోళనకారకం కాబోతోంది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం, ఇటలీ గుండె పగిలింది… ఎందుకో తెలుసా..?
  • ట్రంపు పుణ్యాన పులిరాజాకు మళ్లీ ఎయిడ్స్ ముప్పు..?!
  • హైదరాబాదీ రాజసం..! ఎవరు ఈ రియా పిళ్లై..? ఎందుకు మళ్లీ వార్తల్లోకి..!?
  • పొదుపు వేరు- పిసినారితనం వేరు… శృతిమించితే పెళ్లామే వదిలేస్తుంది…
  • జమీల్ జమాలి అలియాస్ నబీల్ డబోల్… ఇంతకీ ఎవరితను..?!
  • ఓ లయబులిటీ..! KCR వదిలించుకుంటే కాంగ్రెస్ నెత్తిన మోస్తోంది..!!
  • మన సుబ్రహ్మణ్యానికి మలయాళీలు చూపిన అరుదైన గౌరవం..!!
  • ఇదీ ఓ పులిట్జర్ ఫోటో కథే… మనసుతో చదవండి… అర్థమవుతుంది…
  • మీకెవరికీ తెలియని వేటూరి… పాటూరి కాదు, సహృదయ బాటూరి…
  • విద్వేష బిల్లుపైనా అదే పింక్ విషం..! సుప్రీం చెప్పిందేమిటో తెలుసా…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions