.
( గోపు విజయకుమార్ రెడ్డి ) …. సుయిజ్ నుండి హార్ముజ్ వరకు: ఒకే చరిత్ర.. కొత్త పాత్రధారులు … బ్రిటన్ ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించింది. కానీ 1956లో జరిగిన ఒక సంఘటన ఆ సామ్రాజ్య పతనానికి నాంది పలికింది. ఇప్పుడు అమెరికా కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోందా? అనేదే ఇక్కడ ప్రధాన ప్రశ్న.
1. బ్రిటన్ ‘సుయిజ్ మూమెంట్’ అంటే ఏమిటి? …
Ads
-
సంఘటన…: 1956లో ఈజిప్ట్ తన దేశంలోని సుయిజ్ కాలువను తన సొంతం చేసుకుంది… దీనిపై కోపంతో బ్రిటన్, ఫ్రాన్స్ యుద్ధానికి వెళ్లాయి…
-
అమెరికా షాక్…: బ్రిటన్ మిత్రదేశమైన అమెరికా, ఈ యుద్ధానికి మద్దతు ఇవ్వలేదు… సరి కదా, “వెనక్కి తగ్గండి, లేదంటే మీ కరెన్సీని పడగొడతాం” అని బెదిరించింది…
-
ఫలితం…: ప్రపంచానికి ఒక విషయం అర్థమైపోయింది— ఇక బ్రిటన్ బాస్ కాదు, అమెరికానే కొత్త బాస్. దీనినే చరిత్రలో “Suez Moment” అంటారు… రవి అస్తమించని అతిపెద్ద సామ్రాజ్యం కూలిపోయింది…
2. 2026లో హార్ముజ్ జలసంధి ఎందుకు కీలకం? …
ప్రస్తుతం ప్రపంచంలోని చమురు (Oil) రవాణాలో దాదాపు 20- 30% హార్ముజ్ జలసంధి గుండానే జరుగుతుంది…
-
ఇరాన్ పట్టు…: అమెరికా దగ్గర భారీ ఆయుధాలు ఉండవచ్చు, కానీ భౌగోళికంగా అక్కడ పట్టున్నది ఇరాన్‌కు… ఏ నౌక వెళ్లాలి, ఏది వెళ్లకూడదు అనేది ఇరాన్ నిర్ణయించే స్థాయికి చేరింది…
-
అమెరికా హామీకి బీటలు…: “సముద్ర మార్గాలు మా బాధ్యత” అని ఇన్నాళ్లూ అమెరికా చెప్పింది… కానీ ఇప్పుడు అక్కడ ఇరాన్ లేదా ఇతర శక్తులను అమెరికా అడ్డుకోలేకపోతే, ప్రపంచ దేశాలు అమెరికా శక్తిని నమ్మడం మానేస్తాయి…
- అమెరికా వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళం ఉండొచ్చు గాక… కానీ ప్రస్తుతం హార్ముజ్ గుండా ఎవరు వెళ్లాలి, ఎవరు వెళ్లకూడదు అన్నది ప్రాక్టికల్‌గా నిర్ణయిస్తున్నది ఇరాన్…
3. నాటికీ, నేటికీ పోలికలు
1956 లో ఏమైంది..? బ్రిటన్ ఆధిపత్యం పతనం… సుయిజ్ కాలువపై పట్టు పోయింది… అప్పటి మిత్రుడు అమెరికాయే వ్యతిరేకించింది, ఫలితంగా పౌండ్ పతనం… తరువాత అమెరికా, డాలర్ సూపర్ పవర్ అయ్యింది…
2026 లో ఏం జరుగుతోంది..? హార్ముజ్ మీద పట్టు పోతోంది… ప్రస్తుత మిత్రదేశాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి యుద్ధాన్ని… వాణిజ్య భద్రత, డాలర్ ఒడిదొడుకులు మొదలు… ఫలితంగా బహుళ ధృవప్రపంచం రావచ్చు… అమెరికా పెత్తనానికి బీటలు…
4. భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? …. ఒకప్పుడు బ్రిటన్ స్థానాన్ని అమెరికా భర్తీ చేసింది… కానీ ఇప్పుడు అమెరికా బలహీనపడితే, ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఒక్క దేశం సిద్ధంగా లేదు…
-
చైనా…: వ్యాపారంలో నంబర్ వన్ అవ్వాలని చూస్తోంది…
-
రష్యా…: సైనిక పరంగా తన పట్టు నిలుపుకుంటోంది….
-
భారత్…: అతిపెద్ద మార్కెట్‌గా ఎదుగుతోంది….
ముగింపు…. “మేక్ అమెరికా గ్రేట్ అగైన్” అని ట్రంప్ అంటుంటే, ప్రపంచం మాత్రం “ముందు మారిన పరిస్థితులకు అనుగుణంగా అమెరికా ఆలోచించాలి” (Make America Think Again) అని కోరుకుంటోంది… ఒకే దేశం ప్రపంచాన్ని ఏలే రోజులు పోయి, ప్రాంతీయ శక్తులు బలపడే కాలం మొదలైంది… జియో పాలిటిక్స్ అంటే అంతే… ఎవరి పతనాన్ని, ఎవరి పెత్తనాన్ని ఎవరూ ముందుగా ఊహించలేరు..!!
Share this Article