.
బూతు, రోత, వెగటు, వెకిలి, అశ్లీలం… ఈ ధోరణుల్లో ఏపీ పాలిటిక్స్‌లో ఏ పార్టీ తక్కువ కాదు… ఏక్‌సేఏక్… ఇళ్లల్లోని మహిళల్ని కూడా కించపరుస్తూ, వ్యక్తిత్వహననానికి పాల్పడటం ఆయా పార్టీల సోషల్ మీడియా గ్రూపులే కాదు, ఏకంగా లీడర్లే అలా తయారయ్యారు… ఎవడూ శుద్ధపూస కాదు… కానీ..?
చివరకు పదిమందికీ శకునాలు చెప్పే బల్లి చివరకు కుడితి తొట్టిలో పడ్డట్టు… తెల్లారిలేస్తే లక్ష నీతులు బోధించే ఆంధ్రజ్యోతి సైతం, అందులోనూ దాని ఓనరుడు సైతం ఏపీ పాలిటిక్స్ రోత ప్రభావానికి గురైన తీరు ఏమాత్రం బాగా లేదు… శనివారం వీకెండ్ కామెంట్లోని మాటలు అభ్యంతరకరమే… Your remarks are in very bad and uncivilised taste …
Ads
ఎంత తప్పు అంటే… మరుసటి రోజు ఆంధ్రజ్యోతిలోని ఎడిట్ వ్యాసం ‘కొత్త పలుకు’లో ఆ పలుకులని ప్రచురించలేదు … అంటే నాలుక కర్చుకున్నాడు… ఆ వ్యాఖ్యలు తప్పు అని తనకే అర్థం అయింది … తప్పు దొర్లింది అని విచారం వ్యక్తపరచి ఉంటే చాలా హుందాగా ఉండేది … ఆయన పలుకులు “కట్టుకున్న భార్యలను కూడా సొంత చెల్లెళ్ళు అని చెప్పి, వాళ్ళకు పెళ్లి సంబంధాలు చూడటానికి కూడా వెనుకాడని వెన్నెముక లేని బేచ్” …
నిజానికి రాధాకృష్ణ అన్నదాంట్లో తప్పేముంది అనేవాళ్ల వాదన, కూటమి క్యాంపుల సోషల్ ఎదురుదాడి ఏమిటంటే..? ‘‘వైసీపీ నేతలు ఏమైనా శుద్ధపూసలా..?’’ గతంలో వైసీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ డర్టీ క్యాంపెయిన్ ఉదాహరణల్ని ఏకరువు పెడుతున్నారు… ఎస్, వైసీపీ రోత ధోరణి కూడా చూసిందే… కానీ వాళ్లు చేశారు కాబట్టి రాధాకృష్ణ మాటలు సమర్థనీయం అవుతాయా..? అంటే రాధాకృష్ణను కూడా ఓ సోషల్ మీడియా కార్యకర్త, ఫ్యాన్ స్థాయికి దిగజారుస్తున్నారా వీళ్లు..? ఇదేం పోకడ..?
అన్నింటికన్నా మరీ దారుణం ఏమిటంటే..? రాధాకృష్ణ చానెల్ ఏబీఎన్, పత్రిక ఆంధ్రజ్యోతి కూడా ఇదే రీతిలో సమర్థనకు దిగడం… దిగువన ఓ క్లిప్పింగ్ చూడండి, ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ బ్యానర్ స్టోరీ ఇది…

నాడు భువనేశ్వరిని దూషించలేదా..? ఇది కౌరవ సభ అంటూ అంతటి చంద్రబాబు వెక్కి వెక్కి విలపించలేదా..? జగన్ సొంత చెల్లెలు షర్మిలను కూడా వదల్లేదు కదా… విజయమ్మను కూడా కించపరిచే పోస్టులు పెట్టారు కదా… పవన్ కల్యాణ్ మీద పెళ్లాలు పెళ్లాలు అంటూ అవమానించలేదా..? అంటూ బోలెడు ఉదాహరణలు రాసుకొచ్చారు ఆ కథనాల్లో, బాక్సులు కట్టి మరీ…
అవన్నీ నిజాలే… వైసీపీ రోత రాజకీయాన్ని ఎవరూ సమర్థించడం లేదు… కానీ అవి చూపించి, నేను చేసింది కూడా సరైనదే, యాగీ చేస్తున్నారేం అని దబాయించి సమర్థించుకుంటున్నట్టుగా ఉంది ఇది… మరి ఆ రోత ధోరణుల కార్యకర్తలకూ ఓ బాధ్యతాయుత మీడియా సంస్థ ఓనర్‌కూ తేడా లేదా..? పచ్చ చొక్కా ధరించి తిరుగు, నీ మీడియా నీ ఇష్టం… కానీ మరీ ఓ సగటు యెల్లో సోషల్ మీడియా యాక్టివిస్టు స్థాయికి దిగజారాలా..? ఏమాత్రం బాగోలేదు, అస్సలు నచ్చలేదు బాసూ…!!
Share this Article