.
చీకటి పడగానే ట్రంపు హూంకరింపులు… తెల్లారేసరికి శాంతి వచనాలు… తాటతీస్తా అని ఓసారి, సర్లె, గడువు పెడుతున్నా అని మరోసారి… గడువు పొడిగింపు అని ఇంకోసారి… నిజం ఏమిటంటే..? తను యుద్ధం కొనసాగించే మూడ్‌లో లేడు… సరికదా, ఇందులో నుంచి ఎంత త్వరగా బయటపడాలా అని ఆలోచిస్తున్నాడు…
స్వదేశంలో భారీగా ట్రంపు విధానాల పట్ల నిరసన ప్రదర్శనలు… మోయలేనంత ఖర్చు… ఊహించని రీతిలో ఇరాన్ ఎదురుదాడి… పైగా తన యుద్ధవిమానాలను సైతం కోల్పోతున్న దురవస్థ… సో, చాన్నాళ్లు యుద్దంలో ఉండలేడు… కానీ శాంతి ప్రయత్నాలకు మధ్యవర్తులు ఎవరు..?
Ads
నాటోను తిట్టిపోశాడు, మిత్రదేశాలను ఛీఫో అన్నాడు… టారిఫ్‌లు, బెదిరింపులు, రష్యా ఆయిల్ కొనుగోలు నిషేధాలు వంటి వేషాలేసి, ఇక మోడీని అడగడానికి మొహం చెల్లడం లేదు… అప్పుడు కనిపించింది పాకిస్థాన్… ఆ దేశం అమెరికా ఏది చెబితే అది చేస్తుంది… పైగా సిగ్గూశరం వంటివేమీ ఉండవు ఆ నేతలకు… ట్రంప్ ఆఫీసు నుంచి వచ్చే ఆదేశాలను బట్టి పాకిస్థాన్ యాక్షన్ చేస్తుంది…

ట్రంప్ ఆఫీసు నుంచి వచ్చిన ‘డ్రాఫ్ట్’ను, హెడింగును యథాతథంగా ఉంచేసి, అలాగే ఎక్స్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు పాకిస్థాన్ ప్రధాని… తనకు అంతకు మించి తెలియదు… తరువాత ఎవరో చెప్పేసరికి నాలుక కర్చుకుని దాన్ని డిలిట్ చేశాడు, ఆలోపు జగమంతా ఈ నిర్వాకం వ్యాపించింది… సిగ్గుపోయింది… ఇదీ తన రేంజ్…
(మొన్నామధ్య ఓ వార్త క్లిప్పింగ్ చదివాం గుర్తుందా..? రిపోర్టర్ ‘రెండు ఫోటోలు వేయండి, యాడ్స్ వస్తాయి’ అని మెసేజ్ రాస్తే, దాన్నే హెడింగు పెట్టేసిన సబ్ ఎడిటర్ నిర్వాకం గుర్తొస్తోంది పాకిస్థాన్ ప్రధాని తీరు చూస్తే… అలాంటోడు ఏకంగా ఇరాన్ వార్ విషయంలో కలగజేసుకుని రాజీ కుదురుస్తాడా..?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్దానికి సంబంధించి ఇజ్రాయిల్ తప్ప మరొకరు తోడు లేరు… ఇరాన్‌తో ఇజ్రాయిల్ వైరం, తెగింపు, అవసరం లేరు… నేను అనవసరంగా ఇరుక్కున్నాననే ఫీలింగు ట్రంపుది ఇప్పుడు… నిజానికి ఇరాన్‌కు కూడా ఎలాగోలా ఈ యుద్ధం నుంచి బయటపడాలనే ఉంది… ఐతే అది పాకిస్థాన్‌ను నమ్మదు… కానీ అవసరం..!
ఇదీ అసలు సిట్యుయేషన్ అయితే…. ఇండియాలోని ‘‘‘పాకిస్థానీ ప్రేమికులు’’ మాత్రం ‘మోడీకి చేతనైతలేదా..? యుద్దం ఆపమని ట్రంపుకి చెప్పు…’ అని విమర్శలు… నిన్నటిదాకా అమెరికాకు దాసోహం అంటున్నాడు మోడీ అని వెక్కిరించిన గొంతులే అవన్నీ… అవును, ఈ ప్రతిపక్షాలూ పాకిస్థాన్ ప్రధాని టైపే కదా..!!
Share this Article