Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కేసీయార్ గడీలోకి జీవన్‌రెడ్డి..!? ఓ మానసిక విశ్లేషణ ఇదుగో..!!

April 9, 2026 by M S R

.

జీవన్ రెడ్డి… జగిత్యాలలో పేరున్న లీడర్… కానీ పార్టీలోకి కొత్తతరం, అందులోనూ తన పాత ప్రత్యరర్థి చేరికను జీర్ణించుకోలేక… కాంగ్రెస్ పార్టీని తూలనాడుతూ… రేవంత్ రెడ్డిని నిందిస్తూ… తనను తొక్కేస్తున్నారని ఆరోపిస్తూ.., ఇప్పుడు బీఆర్ఎస్ పార్ఠీలో చేరతాడట… వయస్సు 73 ఏళ్లు… అనేక ఏళ్లుగా కాంగ్రెస్ కమిటెడ్ నాయకుడని పేరుంది తనకు…

తనను బీఆర్ఎస్‌లోకి చేర్చుకోవడానికి ప్రయత్నాలు సాగుతున్న నేపథ్యంలో కొన్ని నిజాలు చెప్పుకుందాం… బీఆర్ఎస్ (పాత టీఆర్ఎస్) చాలామందిని చేర్చుకుంది, సహించలేక వదిలించుకుంది… అంతెందుకు, ‘పుట్టు టీఆర్ఎస్’ ఈటలను ఎంత అవమానకరంగా బయటికి పంపించిందో చూశాం… ఒక విజయశాంతి, ఒక నరేంద్ర, ఒక కేశవరావు… జాబితాలో ఎందరో…

Ads

మరిప్పుడు జీవన్‌రెడ్డిని ఎందుకు చేర్చుకుంటారు…? ఓ ప్రహసనం..! కాంగ్రెస్ పార్టీని డిమోరల్ చేస్తామనే ఓ భ్రమ… ఆ నిజం జీవన్‌రెడ్డికి అర్థం కాలేదు… కేసీయార్ గడీలోకి వెళ్లాక నాలుగు రోజులకు అర్థమవుతుంది… అసలు నేను ఎటు వచ్చాను, ఎందుకు వచ్చాను, ఏమిటిలా అయిపోయాను అనే మథనంతో..!

తను ఉన్నదే కాంగ్రెస్ పార్టీలో… అది ఓ సముద్రం అనేక మంది వస్తుంటారు, పోతుంటారు… అంతేతప్ప, ఏ స్థానమూ ఎవరికీ అడ్డా కాదు, కోట కాదు, ఎవరూ కొత్తగా ప్రవేశించలేని  రాచరిక దుర్గం కూడా కాదు… జీవన్‌రెడ్డికీ తెలుసు, ఎటొచ్చీ తన ‘కోట’లోకి ఎవరైనా కొత్తగా వస్తేనే సర్దుకోలేక, రాజపడలేక, వశపడక, ఇక బయటపడిపోవడం…

అంతెందుకు, ఇదే జీవన్ రెడ్డి కూడా ‘పుట్టు కాంగ్రెస్’ ఏమీ కాదు… మొదట్లో టీడీపీ, తరువాత నాదెండ్ల టీడీపీ… మొదట్లో రాజకీయేతరం, ప్రొనక్సల్స్ పోకడ.., తరువాత ప్యూర్ పొలిటిషియన్… ఇదే కేసీయార్ మీద పోటీ చేశాడు వైఎస్ పీరియడ్‌లో… ఈయన అర్థంతరంగా రాజీనామాలు చేసేసి, గెలిపించాల్సిన తీట తెలంగాణ సమాజానిదే అన్నట్టు వదిలేయడం, కేసీయార్‌ను ఓడిస్తే తెలంగాణ ఉద్యమం బలహీనపడుతుందనే భావనతో వైఎస్ జీవన్‌రెడ్డిని, సాధనసంపత్తిని బరిలోకి దింపడం… అదొక కుట్ర… అందులో జీవన్‌రెడ్డి భాగస్వామి… ఇప్పుడు డెస్టినీ ఏమిటంటే..? అదే కేసీయార్ పార్టీలోకి తను చేరిపోవడం… అదీ ఈ వయస్సులో… విధి వైచిత్రి…

జీవన్ రెడ్డి

టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ అలియాస్ కేసీయార్ పార్టీ… ఇందులో కేటీయార్, కేసీయార్, హరీష్ రావు తప్ప ఇంకెవరైనా సరే, ఎంత పెద్ద తోపులైనా సరే..,. వాళ్ల మాటకు చిల్లిగవ్వ విలువ ఉండదు పార్టీలో… ఇది రియాలిటీ… ఎక్కువ మాట్లాడితే తెల్లవారేసరికి తను పార్టీలోనే ఉండడు… జీవన్ రెడ్డి కూడా గమనిస్తున్నదే ఇదంతా… ఐనాసరే, కేసీయార్‌కు జై అంటాడట…

  • ఓ కీలకమైన చేదు నిజాన్ని చెప్పుకుందాం… జనం జీవన్ రెడ్డి అంటే అపారమైన, అఖండమైన ఆదరణ ఏమీ చూపించడం లేదు… ఆరోజులు ఎప్పుడో పోయాయి… జనం కొత్త రక్తాన్ని, కొత్త నాయకత్వాన్ని ఆహ్వానిస్తున్నారు… కానీ ఆ నిజం తనకే అర్థం కావడం లేదు…
  • ఒకసారి ఎమ్మెల్యేగా ఓటమి… తరువాత ఎమ్మెల్సీగా పార్టీ చాన్స్ ఇచ్చింది… చిన్న ఎన్నిక, గెలిచాడు… తరువాత ఎమ్మెల్యేగా మళ్లీ ఓటమి… కొన్నిరోజులకే ఎంపీగా మరో ఓటమి… చివరకు రీసెంట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి…

 (తను బీఆర్ఎస్‌లో చేరుతున్నాడు గానీ, తన ప్రత్యర్థి సంజయ్ కూడా అదే బీఆర్ఎస్‌కు కావల్సినవాడు, బేసిక్‌గా తను బీఆర్ఎస్ పార్టీయే… కేసీయార్ సామాజికవర్గమే… నిజానికి జీవన్‌రెడ్డే పరాయివాడు…) (బీజేపీలో చేరతాడు అని కొందరు రాసుకొచ్చారు, కానీ ధర్మపురి అరవింద్ తననెందుకు రానిస్తాడు..? పైగా జీవన్‌రెడ్డి భావజాలం బీజేపీలో అస్సలు ఇమడదు కూడా… ఈటలలాగే పొగ, సెగ ఎదుర్కోవాల్సి ఉంటుంది…)

  • ఐనాసరే, ఇంకా తనను జనం ఆదరిస్తున్నారని, తనకు తిరుగులేదనీ నాయకులు భావించే మానసిక ధోరణిని ఏమంటారు..? కాస్త ఆరా తీస్తే… ఆసక్తికరమైన విశ్లేషణలు కనిపించాయి…


జీవన్ రెడ్డి

1. డెల్యూషన్ ఆఫ్ గ్రాండియోసిటీ (Delusion of Grandiosity)…: ఇది చాలా బలమైన పదం… ఒక వ్యక్తి తన సామర్థ్యాన్ని, ప్రాముఖ్యతను వాస్తవికతకు విరుద్ధంగా అతిగా ఊహించుకోవడాన్ని ఇలా అంటారు… వాస్తవ పరిస్థితులు తమను తిరస్కరిస్తున్నా దాన్ని గుర్తించలేకపోవడం దీని ప్రధాన లక్షణం…

2. కాగ్నిటివ్ డిసోనెన్స్ (Cognitive Dissonance – భ్రమను కాపాడుకోవడం)…: ఒక వ్యక్తి నమ్మే విషయానికి (నేను ఇంకా పవర్ ఫుల్), వాస్తవానికి (జనం తిరస్కరిస్తున్నారు) మధ్య వైరుధ్యం ఏర్పడినప్పుడు, ఆ వ్యక్తి ఆ వైరుధ్యాన్ని తట్టుకోలేక ‘వాస్తవాన్ని’ తిరస్కరిస్తాడు… బలంగానే ఉన్నాననే భ్రమలోనే జీవించడానికి ప్రయత్నిస్తాడు…

3. హూబ్రిస్ సిండ్రోమ్ (Hubris Syndrome)…: అధికారంలో ఉన్న వ్యక్తులు, లేదా ఒకప్పుడు అధికారం అనుభవించిన వారు తమ శక్తి పట్ల అతి విశ్వాసాన్ని, అహంకారాన్ని ప్రదర్శించడాన్ని ‘హూబ్రిస్’ అంటారు… ఇది కాలక్రమేణా వస్తుంది…

సారాంశంలో చెప్పాలంటే, దీనిని సామాన్య భాషలో “అతి ఆత్మవిశ్వాసం వల్ల కలిగే వాస్తవ విస్మృతి” అని చెప్పవచ్చు…  రాజకీయాల్లో 'ఎగ్జిట్ ప్లాన్' (Exit Plan) ఎప్పుడు తీసుకోవాలో తెలియకపోవడం వల్ల చాలా మంది హేమాహేమీలు తమ ఇమేజ్‌ను తామే డ్యామేజ్ చేసుకుంటారు...

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • విజయ్ పార్టీకి రథసారథి… తను తమిళ ప్రశాంత్ కిషోర్… కింగ్ మేకర్…
  • మహానగరంలో మాయగాడు… 39 ఏళ్లుగా మిస్టరీ వీడని ‘నగల చోరీ’…
  • అసలు సినిమా కథకన్నా… కోట- బాబూమోహన్ కామెడీయే హైలైట్…
  • కేసీయార్ గడీలోకి జీవన్‌రెడ్డి..!? ఓ మానసిక విశ్లేషణ ఇదుగో..!!
  • ఎరుపు లోలాకు కులికెను కులికెను… ఆమె గుర్తుందా మీకు..?!
  • ఆ పాట చరణాల సొగసు చూడతరమా…? వేటూరి మేథోమథనం కథ..!!
  • మళ్లీ ఇజ్జత్ తీసుకున్న పాకిస్థాన్… ఈసారి ఏకంగా దాని ప్రధాని వంతు…
  • నోటి తుత్తర ఎంత ప్రమాదకరమో చెప్పే సినిమా… మధురానగరిలో…
  • దేవనపల్లి కవిత..! టీఆర్ఎస్ కాదు… తెలంగాణ జాగృతి పార్టీయే..!!
  • అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితి తొట్టెలో పడినట్టు…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions