.
శాంటియాగో మార్టిన్… దేశంలోని ఎక్కడెక్కడి పార్టీలకో నిధులిస్తుంటాడు… ఈసారి భార్య, అల్లుడు, కొడుకులను వేర్వేరు పార్టీల తరఫున ఎన్నికల్లో ప్రవేశపెట్టాడు… భారత ఎన్నికల సంఘం ఎన్నికల బాండ్ల వివరాలు ప్రకటిస్తే… పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకన్నా మార్టినే అత్యధిక నిధులిచ్చాడు… ఇక్కడ వైసీపీ దగ్గర నుంచి అక్కడెక్కడో టీఎంసీ దాకా… అసలు ఎవరు ఇతను..?
లాటరీ కింగ్… 1988లో చిన్న సంస్థ ఈ మార్టిన్ గ్రూప్ … తమిళనాడులోని కోయంబత్తూరులో లాటరీ టికెట్లు అమ్ముకునే చిన్న దుకాణం… కానీ ఇప్పుడు వేల కోట్ల గ్రూప్… లాటరీ మాత్రమే కాదు, కన్‌స్ట్రక్షన్, ప్రాపర్టీ డెవలప్‌మెంట్, హాస్పిటాలిటీ, టెక్స్‌టైల్స్, ఫ్యాబ్రిక్స్, ఎడ్యుకేషన్, పవర్, మీడియా, ఎంటర్‌టెయిన్ మెంట్… వాట్ నాట్..? అన్నింట్లోనూ ఉంది… ఇది తమిళ మేఘా అనుకొండి…
Ads
ధారాళంగా, ఓ ప్రవాహంలా వచ్చిపడుతున్న డబ్బు… అనేక అక్రమాలు, అవకతవకలు… ప్రత్యేకించి మనీలాండరింగ్ తన మీద ఉన్న ఆరోపణలు… లెఫ్ట్, రైట్, రీజనల్ పార్టీలన్నీ మార్టిన్ సొమ్ము తిన్నవే… మచ్చుకు కొన్ని చూద్దాం…
2007లో, సీపీఎం సారథ్యంలోని కేరళ లెఫ్ట్ ప్రభుత్వం ఈ గ్రూప్ నుంచి వచ్చిన 20 మిలియన్ల విరాళాన్ని తిరిగి ఇచ్చేసింది… కారణం, అప్పటికే ఈ గ్రూప్ చట్టవిరుద్ధమైన లాటరీ కార్యకలాపాల మీద ఆరోపణలు వెల్లువెత్తడమే…
2019 లో కేంద్ర హోం శాఖ ఈ గ్రూప్ మోసపూరిత కార్యకలాపాలపై అలర్ట్‌గా ఉండాలని అన్ని రాష్ట్రాలకు హెచ్చరిక జారీ చేసింది… పన్ను ఎగవేతలే కాదు, లాటరీలు నిషేధించబడిన రాష్ట్రాల్లో లాటరీలను విక్రయించడం, ₹1,000 కోట్లకు పైగా లెక్కల్లో చూపని ఆదాయాన్ని కలిగి ఉండటం వంటి ఆరోపణల నేపథ్యంలో ఈ హెచ్చరికల జారీ…
ఫ్యూచర్ గేమింగ్, మార్టిన్ గ్రూప్ అనుబంధ కంపెనీల బ్యాంకు ఖాతాల నుండి 2019లో ₹250 కోట్లు, 2022లో ₹409.92 కోట్లు , మార్చి 2022లో ₹411 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది… 2022లో, చెన్నై క్రైమ్ బ్రాంచ్ కంపెనీ క్యాంపసుల నుండి లెక్కల్లో చూపని ₹7.2 కోట్ల నగదు స్వాధీనం… దర్యాప్తు…
2023లో, సిక్కింలో జరిగిన ఒక లాటరీ మోసం కేసులో ఈడీ 2.5 బిలియన్ ఆస్తులను జప్తు చేసింది… నవంబర్ 2024లో, తమిళనాడు, హర్యానా, పంజాబ్, పశ్చిమ బెంగాల్‌లలో జరిపిన సోదాల సందర్భంగా మార్టిన్ గ్రూప్ కార్పొరేట్ కార్యాలయం నుండి ₹8.8 కోట్ల నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది…,
గ్రూపులోని ప్రధాన సంస్థ ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యకలాపాలలో అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపించి, అవీ ప్లస్ మనీలాండరింగ్ దర్యాప్తులకు సంబంధించి ₹600 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేసింది…
ఎన్నికల బాండ్లు … కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటన ప్లస్ మీడియా వార్తల ప్రకారం… ఏప్రిల్ 2019, జనవరి 2024 మధ్య మార్టిన్ గ్రూప్ ₹1,368 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది… ఇందులో టీఎంసీ 542 కోట్లు, అంటే 39.6 శాతం… డీఎంకే 503 కోట్లు, అంటే 36.7 శాతం… వైఎస్సార్సీపీ 154 కోట్లు, అంటే 11.2 శాతం… ఈ గ్రూపు అనుబంధ కంపెనీ ఫ్యూచర్ గేమింగ్ నుండి బీజేపీకి 100 కోట్లు…
డీఎంకే మాదే, టీఎంసీ మాదే… ఏపీతో ఏమాత్రం సంబంధం లేని వైసీపీ కూడా మాదే… చివరకు బీజేపీ కూడా మాదే… అదీ మార్టిన్ కథ… మన పార్టీల కథ… అక్రమార్కులతో అంటకాగడం ప్రతి పార్టీకి అలవాటే… ఎవరూ శుద్దపూస కాదు… ఇప్పుడు టీవీకేకు డబ్బులు, అన్నాడీఎంకేకు డబ్బులు… వావ్..!!
Share this Article