Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గులాబీ బాస్ ‘మౌన’ ముద్ర… తమ్ముళ్లలోనూ అదే ‘నిద్ర’…!

April 10, 2026 by M S R

.

అవును.., ఇప్పటికే ఎంతోకొంత పుంజుకోవాల్సిన బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం హరీష్, కేటీయార్ ప్రెస్‌మీట్లు, విమర్శలు మినహాయిస్తే… మొత్తం పార్టీ శ్రేణుల్లో ఎనలేని నైరాశ్యం, అంతులేని నిర్లిప్తత కనిపిస్తున్నాయి… ప్రధాన ప్రతిపక్షమే ఇంత నిరుత్సాహంలో, నిశ్శబ్దంలో ఉండిపోవడం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కలిసొస్తోంది ఒకరకంగా… రాజకీయంగా… పరిపాలనపరంగా…

ఇప్పుడు ఈ ప్రస్తావన దేనికీ అంటే..? పాతికేళ్ల క్రితం తెలంగాణ కోసమే అంటూ కేసీయార్ పార్టీ పురుడు పోసుకుంది… ఏప్రిల్ 27న… తరువాత అనేకానేక పరిణామాలు, విజయాలు, పరాజయాలు, వెనుకంజలు, ఉత్సవాలు పక్కన పెడితే… పార్టీ వార్షికోత్సవం ఎప్పుడూ బాగా జరపడం అలవాటు… ప్లీనరీయో, ఓ భారీ సభో నిర్వహిస్తారు… కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నాలు చేస్తారు…

Ads

భారీ సభల నిర్వహణలో కేసీయార్‌ టీమ్ పర్‌ఫెక్ట్… అంత సాధనసంపత్తి ఉంది, జనాన్ని సమీకరించగలరు, కేసీయార్ ప్రసంగం హైలైట్‌గా సాగేది… కానీ ఇప్పుడు… మరో పక్షం రోజుల్లో వార్షికోత్సవం కదా, ప్లీనరీ ఉంటుందా, ఏదేని సభ ప్లాన్ చేశారా, అసలు నామమాత్రంగానైనా ఆ తెలంగాణ భవన్‌లోనే మమ అనిపిస్తారా..? ఏదీ కార్యకర్తలకు క్లారిటీ లేదు… అంత నిర్లిప్తతలో పడిపోయింది పార్టీ…

ప్రజలకు దూరంగా.,. ప్రజాసమస్యలకు దూరంగా… ప్రతిపక్షనేతగా బాధ్యతలకు దూరంగా… ప్రజాజీవితం తాలూకు నైతికవర్తనకు దూరంగా… ప్రపంచానికే దూరంగా.., స్వీయబందిఖానాలో బతుకుతున్న కేసీయార్ మౌనముద్ర అనివార్యంగా మొత్తం పార్టీ శ్రేణులనూ ‘నిద్ర’గా ఆవరిస్తున్నది… కేవలం అబద్ధాలు, వక్రబాష్యాలు, రేవంత్ రెడ్డిపై వెగటు రోత వ్యాఖ్యల వీడియోల సోషల్ మీడియా యాక్టివిటీ తప్ప కేడర్‌లో ఉత్సాహమే లేదు…

ఏమాటకామాట… కవితను ఆ కుటుంబం, ఆ పార్టీ ఒకరకంగా బహిష్కరించడం పార్టీకి మోరల్‌గా ఓ సెట్‌బ్యాక్… పింక్ బ్యాచ్ పైకి అంగీకరించకపోయినా, లోలోపల వాళ్లకూ తెలుసు… ఇక్కడ మరోమాట… కేటీయార్, హరీష్ రావు రొటీన్ ప్రెస్‌మీట్లు, ఆరోపణలు సహా ఇతరత్రా ఏ యాక్టివిటీ లేదు, ఇంకెవరూ మాట్లాడటానికి వీల్లేదు… పైగా ఇప్పుడు కేటీయార్‌ను దాటేసి హరీష్ రావు పార్టీ మీద బ్రహ్మాండమైన గ్రిప్ సంపాదించేసుకున్నాడు… ఓరకమైన ‘వారసత్వ’ పోటీ సాగుతోంది…

సరే, అవన్నీ అంతర్గతమే కదా అనుకుందాం… పాలమూరు- రంగారెడ్డితో ఇక ప్రభుత్వంపై దాడి చేస్తా, నిద్రలేకుండా చేస్తా, తాటతీస్తా బాపతు హూంకరింపులు చేసిన కేసీయార్ మళ్లీ పత్తా లేకుండా పోయాడు… తను బయటికి వస్తున్నదే లేదు… అనర్హత వేటు పడకుండా, నిర్ణీత వ్యవధిలోపు ఓసారి అసెంబ్లీకి అలా రావడం, ఇలా వెళ్లిపోవడం తప్ప, అసలు తను ప్రజల్లోకే రావడం లేదు…

జుబ్లీహిల్స్ ఉపఎన్నిక, పంచాయతీ- మున్సిపల్ ఎన్నికల్లో పేలవమైన ఫలితాలు కూడా పార్టీ కేడర్‌ను మరింత నైరాశ్యంలోకి నెట్టేశాయి… అసలు కేసీయార్ ఆ ఎన్నికల్లో తన పార్టీని బలపరచాలని కూడా ప్రజలకు పిలుపు ఇవ్వలేదు… అంతగా పార్టీ నుంచి డిటాచ్ అయిపోయాడు… ప్రజలపై ఇదేం కక్షసాధింపో మరి..!

గత ఏడాది పార్టీ రజతోత్సవాల సందర్భంగా ఎల్కతుర్తి సభను కూడా పార్టీ బాగానే నిర్వహించింది… ఇక ఇదే ‘యాక్షన్’ కొనసాగుతుందనీ, అసెంబ్లీ- పార్లమెంటు ఎన్నికల ఘోర పరాజయాల స్తబ్ధత నుంచి పార్టీ బయట పడుతుందనీ ఆశించిన కేడర్‌కు పదే పదే నిరాశే… ఇంతకీ ఈసారి వార్షికోత్సవం ఉంటుందా నాయకా..? ఈ ప్రశ్నకు ప్రస్తుతానికి పార్టీ ముఖ్యులకే జవాబు తెలియదు… ఎవరికీ క్లారిటీ లేదు…

నల్గొండ సభలో అనుకుంటా… కేసీయారే స్వయంగా కాళేశ్వరం రిపేర్లు గనుక ప్రభుత్వం చేయించకపోతే, అక్కడే కుర్చీ వేసుకుని కూర్చుంటా అని గర్జించాడు… రెండేళ్లయింది… ఈరోజుకూ మళ్లీ కాళేశ్వరం మీద, తస్కిన మేడిగడ్డ బరాజు మీద మాట్లాడింది లేదు…

సారొస్తారొస్తారు… అని కేడర్ పాడుకోవడమే తప్ప, సార్ వచ్చిందే లేదు… ఇంకెప్పుడొస్తారు సారూ అని లోలోపల మొత్తుకోవడమే కేడర్ పని ఇప్పుడు… అసలు ఆయనే బయటికి రావడం లేదు, మనమెందుకు అంగీలు చింపుకోవడం అనే భావన ముఖ్య నేతల్లోనూ అలుముకుంటోంది క్రమేపీ… (జీవన్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడం కూడా కేటీయార్ పనే… అదేదో ఫామ్‌హౌజ్‌కు తీసుకొచ్చి, కేసీయార్‌తోనే కండువా కప్పించొచ్చు కదా… ఆ వార్తకు మరింత ప్రాధాన్యం దక్కి ఉండేది…)

ప్రతిపక్షం బలంగా ఉండాలి, జనంలో ఉండాలి, ప్రభుత్వ నిర్వాకాలను ఎత్తిచూపాలి, పోరాడాలి, అప్పుడే అధికార పార్టీ, ప్రభుత్వం ‘గాడిలో’ ఉంటాయి… అది ప్రతిపక్షం బాధ్యత… ప్రజలు బీఆర్ఎస్‌కు అప్పగించిన బాధ్యత… దాన్ని మరిచి… ప్రజల మీద అలిగి ‘మౌనవ్రతం’లోనే ఉంటే… రేప్పొద్దున జనంలోకి వచ్చినా సరే, అదే జనం ‘‘మేం సమస్యల్లో ఉన్నప్పుడు ఎక్కడ పోయావు’’ అని ప్రశ్నించి, వాళ్లూ ‘మౌనవ్రతాన్ని’ ఆశ్రయిస్తే నష్టం ఎవరికి..?!

పార్టీలు, నాయకులు ప్రజల్లో ఉన్నప్పుడే బలం… కేసీయార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రోజుల తరబడీ మాయం అయిపోయేవాడు… కానీ రేవంత్ రెడ్డి జనంలో ఉంటున్నాడు… ప్రభుత్వం కూడా ప్రస్తుతం 99 రోజులపాటు ప్రజల్లోకి వెళ్తోంది… దాని పేరు ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’…

విమర్శో, ప్రశంసో, పార్టీ- నాయకుడు జనంలో ఉండాలి... రేవంత్ చేస్తున్నదీ అదే - కేసీయార్ విస్మరించిందీ అదే...

kcr(AI generated graphic image)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పిల్లి కళ్ల పిల్ల మోనాలిసా ప్రేమపెళ్లి కథలో ట్విస్ట్… మొగుడిపై పోక్సో…
  • రేపు పోలింగ్ అనగా… ఓ ఉపఎన్నిక రద్దు… ఓ చిత్రమైన కేసు…
  • కొత్త కొత్త నాయికలతో రాజేంద్ర ప్రసాద్ రొమాన్స్… ఈమె ఎవరో తెలుసా…
  • ధ్వజమెత్తిన సందీప్ వంగా… ‘ధురంధర్ 2’ విమర్శకులకు చెంపపెట్టు…!
  • గులాబీ బాస్ ‘మౌన’ ముద్ర… తమ్ముళ్లలోనూ అదే ‘నిద్ర’…!
  • అడివి శేషుకు దీటుగా… అక్కడక్కడా దాటేసి… మెప్పించిన మృణాల్…
  • ఐపీఎల్ 2026… పదునైన ఆట మాత్రమే కాదు… అనేక ఎమోషన్స్ కూడా…
  • పాతతరం చీప్ మిసైళ్లతో అమెరికాకు చుక్కలు… నేలరాలిన విమానాలు…
  • మరిచిపోలేని మహామనీషి… మనం మరో పీవీని చూడగలమా..? నెవ్వర్..!!
  • చందమామ మీదకు వెళ్లడం కాదు… క్షేమంగా తిరిగి రావడమే పే-ద్ద ఘనత…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions