Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బీఆర్ఎస్‌లో హరీష్‌రావు ఒంటరి అయిపోతున్నాడా..? ఏమవుతోంది..?

April 11, 2026 by M S R

.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిస్థితులు అన్నీ అలా కలిసొస్తున్నాయి… ఆల్రెడీ కవిత బయటికి రావడం నైతికంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌కు ఒక దెబ్బ… దానికితోడు ఫామ్ హౌజ్ వదలని అధినేత వైఖరి మరో దెబ్బ… తాజాగా మరో చర్చ… పార్టీ కీలకనేత హరీష్ రావును కూడా ఒంటరిని చేస్తున్నారా..? అదే నిజమైతే పార్టీకి కోలుకోలేని దెబ్బ అవుతుంది… ట్రబుల్ షూటర్ తనే ట్రబుల్స్‌లో పడిపోతున్నాడా..?

కవిత బీఆర్ఎస్ నుంచి బయటికి రావడం, కొత్త పార్టీ పెట్టడం రేవంత్ రెడ్డికే ఫాయిదా… బీఆర్ఎస్ వోట్లు చీలిపోవడమే కాదు, ఆమె సభల్లో బీఆర్ఎస్‌ను టార్గెట్ చేసి కొడుతుంటే బీఆర్ఎస్ నుంచి ఎదురుదాడి కూడా కష్టమే… సొంత పార్టీలోని అసమ్మతి నాయకుల్లో పొంగులేటి సమ్మక్క పనుల దగ్గర నుంచి నాదర్‌గుల్ భూముల దాకా ఫుల్ డిఫెన్స్‌లో పడిపోయాడు… మరోవైపు బొగ్గు గనుల యవ్వారంలో భట్టి ఇరకాటంలో పడిపోయాడు…

Ads

kavitha

బీజేపీ విషయానికి వస్తే… ఎన్నికల నిధుల గల్లంతు మీద తెలంగాణ బీజేపీలో ముసలం బయల్దేరింది… వాళ్లలోవాళ్లే తన్నుకుంటున్నారు హైకమాండ్‌కు లేఖలు రాసుకుంటూ… ఈ స్థితిలో హరీష్ రావు వ్యవహారం కూడా రేవంత్ రెడ్డికి అనుకూలంగా మారుతోందా..?  ఎందుకంటే..?

brs

నిన్నామొన్నా జీవన్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడం దగ్గర నుంచి… కేసీయార్‌తో మధ్యాహ్నభోజనం దాకా… ఎక్కడా హరీష్ రావు లేడు… ఎందుకు..? ఏదో జరుగుతోంది పార్టీలో..!! హరీష్ రావు స్థానం ఏమిటీ అంటారా పార్టీలో..? తను నెంబర్ టూ కేటీయార్‌కు సమానంగా..! కానీ తనను పార్టీలోనే ఒంటరిని చేస్తున్న ఛాయలు కనిపిస్తున్నాయి…

ktr

గతంలో కేసీయార్ తనను దూరం పెట్టిన తీరు చూశాం… ఈమధ్య హరీష్ రావు కేటీయార్‌ను మించి ఎన్నోరెట్లు యాక్టివ్‌గా దూసుకుపోతున్నాడు… క్రమేపీ పార్టీ తన చెప్పుచేతుల్లోకి వస్తోంది… ఇదెప్పుడైనా తన నెత్తుటి వారసత్వానికి ప్రమాదమే అని సందేహిస్తున్నాడా కేసీయార్..? అందుకెే మెల్లిమెల్లిగా తనకు కత్తెర స్టార్ట్ అవుతోందా..? పార్టీ కేడర్‌లోనే ఈ సందేహాలు అలుముకుంటున్నాయి…

ktr

జీవన్‌రెడ్డి నిజానికి ఇప్పుడు జగిత్యాలలో అఖండమైన బలం ఉన్నవాడేమీ కాదు, తనే ఓడిపోయి, లోకసభ ఎన్నికల్లో పదీపదిహేను వేల వోట్లను కూడా తన సెగ్మెంటులో కాంగ్రెస్‌కు ఇప్పించలేకపోయాడు… పైగా గతంలో వైఎస్ బాపతు సమైక్యవాద కుట్రలకు భాగస్వామి… అలాంటి నేత ఇప్పుడు ‘దేవుడు నన్ను పంపించాడు భాయ్’ అంటూ అంతులేనికథ సినిమాలో రజినీకాంత్ పాడిన ‘దేవుడే ఇచ్చాడు వీథి ఒకటి’ టైపు పాట పాడుతున్నట్టుగా వచ్చి కేసీయార్‌ను ఆలింగనం చేసుకున్న తీరు విధివిలాసమే…

కేసీయార్

తను జస్ట్, ఓ జగిత్యాల లీడర్ మాత్రమే… కానీ పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్‌లోకి వచ్చినప్పుడు ఈ ప్రాధాన్యం ఎందుకు కనబరచలేదు..? తను పీసీసీ మాజీ అధ్యక్షుడు, బీసీ లీడర్… ఈ తేడాను కూడా వివిధ పార్టీల కార్యకర్తలు గమనిస్తున్నారు… కేసీయార్ ప్రాధాన్యాల వివక్షనూ చూస్తున్నారు… అంతెందుకు..? గతంలో నరేంద్ర, విజయశాంతి, ఈటల వంటి నేతల్ని ఎంత అవమానకరంగా బయటికి తరిమేశారో కూడా జనానికి తెలుసు…

kcr

ఒకవైపు బీజేపీ- బీఆర్ఎస్ నడుమ పొత్తో, అవగాహనో, విలీనమో ఏదో ఒకటి జరిగే సూచనలు కనిపిస్తున్నాయి… ఫీల్డులో బీజేపీ బలం పెరుగుతోంది తప్ప బీఆర్ఎస్ ఎదుగుదల లేదు… ఒంటరిగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి పోతే మునిగిపోతామనే భయం ఉంది బీఆర్ఎస్‌లో… పైగా సీట్లు పెరగబోతున్నాయి… సీట్ల పునర్విభజన జరగనుంది… ఈ స్థితిలో… హరీష్ రావును ఎందుకు ఒంటరిని చేస్తున్నారనే ప్రశ్న తెలంగాణ రాజకీయాల్లో కీలకమే ప్రస్తుతం..!! బీఆర్ఎస్‌లో మరో కీలక పరిణామం ఏదైనా చోటు చేసుకోనుందా..?!

harish(AI generated graphic image)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇష్టసఖి త్రిష కాదు… తిరుచ్చి నుంచి బహుశా రాఘవ లారెన్స్…!
  • ప్రొఫెషనల్ ఆందోళనకారుల మ్యాపింగ్… ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ యాక్షన్…
  • జగమంత హాస్పిటల్ మాది… ఐసీయూ జీవితం మాది…
  • Konkona Sen … అమ్మతనానికి పెళ్లితే పనేంటి..? ప్రేమకు వయస్సుతో పనేంటి..?
  • ఈ దళపతి సీఎం జోసెఫ్ విజయ్ కాదు… రజినీకాంత్…
  • Drone Warfare … 5 లక్షల మందితో ‘డ్రోన్ ఆర్మీ’… ప్రత్యేక శిక్షణ…
  • నాటి ఆ స్వాతికిరణం గంగాధరం ఇప్పుడేం చేస్తున్నాడు..?
  • SCCL … సింగరేణి కుటుంబాలకు కోటి రూపాయల భరోసా…
  • ‘ఓటీటీలపై ఆశలు పెట్టుకుని సినిమాలు తీయకండి’… అల్లు ఉద్బోధ…
  • బాబును ఏమీ అనలేడు- పవన్‌ తప్పనలేడు- జగన్‌ను అనకుండా ఉండలేడు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions