Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ నలుగురూ ఎవరు..? అందరూ ‘వాళ్లేనా’..? మరి ఇతరుల మాట..?!

April 13, 2026 by M S R

.

ఏపీ మీడియాలో నాలుగు రాజ్యసభ సభ్యత్వాలకు సంబంధించి ఆసక్తికరమైన విశ్లేషణలు కనిపిస్తున్నాయి… త్వరలో నాలుగు ఖాళీ కాబోతున్న నేపథ్యంలో… ఎలాగూ జగన్ పార్టీకి ఏ చాన్సూ లేదు, నాలుగూ కూటమికే దక్కుతాయి… కానీ ఆ నలుగురూ ఎవరు..? సాధారణంగా రాజ్యసభకు ఎవరిని పంపించాలనే విషయంలో ఒక్కో పార్టీకి ఒక్కో ప్రయారిటీ… (ప్రస్తుతం వైసిపి నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వాని, టిడిపి నుంచి సానా సతీష్ పదవీ కాలం వచ్చే జూన్ 21తో ముగియనుంది…)

ఆర్థికబలం, సామాజికవర్గబలం, పార్టీలో ప్రముఖస్థానం వంటి చాలా సమీకరణాలు ఉంటాయి… పార్టీల అధినేతల ఇష్టం… ఇలాంటి విషయాల్లో చంద్రబాబు గతంలో సామాజికవర్గాల, అంటే కులాల సమతూకం చూపేవాడు… బ్యాలెన్స్ చేసేవాడు… కానీ ఈసారి వినిపిస్తున్న పేర్లను బట్టి మొత్తం అగ్రవర్ణలేనా..? అందులోనూ ఆ సామాజికవర్గానికేనా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి…

Ads

ఈ నాలుగులో రెండు టీడీపీకి, జనసేన- బీజేపీలకు చెరొకటి పంచుకుంటారట… సరే, అది కూటమి ప్రాధాన్యతలను బట్టి జరిగే నిర్ణయం… టీడీపీ విషయానికి వస్తే భారత్ బయోటెక్ సంస్థ అధినేత యెల్లా కృష్ణ, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, కిలారు రాజేష్ పేర్లు వినిపిస్తుంటే జనసేన నుంచి ధనిక వ్యాపారి లింగమనేని రమేష్ పేరు వినిపిస్తున్నదట… అలాగే సానా సతీష్‌కు ఎక్స్‌టెన్షన్ ఇవ్వవచ్చునని మరో ఊహాగానం…

వీరిలో సానా సతీష్ తప్ప అందరూ ఒకే సామాజికవర్గం… సో, ఈ పేర్లే ఖరారు కావడం రాజకీయ సమీకరణాల్లో కష్టం కావచ్చు… ఏమో… మినరల్ వాటర్ బాటిల్ ధరకు కరోనా వేక్సిన్ ఇస్తానని చెప్పి యెల్లా కృష్ణ చివరకు ఏ రేట్లకు అమ్మి ఎంత సంపాదించాడో తెలుసు కదా, అదీ తన క్రెడిబులిటీ… కాకపోతే మోడీకి సాఫ్ట్ కార్నర్, చంద్రబాబుకు సన్నిహితుడే… పార్టీకి కూడా ఆర్థికంగా సహకరిస్తుంటాడట… ఇక గల్లా జయదేవ్ జగన్ బాధితుడు… సేమ్, యెల్లా కృష్ణలాగే ఆర్థికబలం మరో ప్లస్ పాయింట్… 2024లో లోకసభకు పోటీచేయాలని పార్టీ కోరినా ఎందుకు వెనుకాడినట్టు చెబుతారు…

ఇక కిలారు రాజేష్ కూడా సేమ్ సామాజికవర్గం… సానా సతీష్- తను ఇద్దరూ లోకేష్ రథానికి చక్రాలు… ప్రస్తుత ప్రభుత్వంలో వాళ్ల మాటే చెల్లుబాటు… కిలారు, యల్లా, గల్లా… ముగ్గురూ సేమ్… అది రాజకీయంగా సమర్థన కష్టం.,. ఒకవేళ సానాకు ఎక్స్‌టెన్షన్ ఇచ్చినా అందరూ అగ్రవర్ణాలే… ఆ సమర్థన కూడా కష్టమే… మరోవైపు లింగమనేనికి జనసేన కోటాలో ఇచ్చినా సరే, తనదీ అదే సామాజికవర్గం… టీడీపీకి, జనసేనకు ఇద్దరికీ ఇష్టుడే…

బాష్యం విద్యాసంస్థల చీఫ్ రామకృష్ణ పేరు కూడా ప్రచారంలోకి వస్తోంది కానీ తనూ సేమ్ సామాజికవర్గం… సరే, ఇక బీజేపీ విషయానికొస్తే.., తమిళ రాజకీయాల్లో అన్నాడీఎంకే పళనిస్వామి డిమాండ్ల మేరకు బీజేపీ ఆ పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు అన్నా మలైని దూరంగా పెడుతోంది… ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు…

తనకు ఏపీ నుంచి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి, జాతీయ రాజకీయాల్లో వాడుకోవాలని, తద్వారా కొన్నాళ్లు తమిళ రాజకీయాలకు దూరంగా ఉంచాలని భావిస్తున్నట్టుగా ప్రచారం… అన్నా మలైకి అవకాశం ఇస్తే, అది బీజేపీ కోణంలో సరైన నిర్ణయమే అవుతుంది… (పైగా ఈ నాలుగులో ఒకటీ బీసీకి ఇచ్చి, కేస్ట్ బ్యాలెన్స్‌ను ఎంతోకొంత చూపించొచ్చు)…

అఫ్‌కోర్స్, ఇంకా చాలా టైమ్ ఉంది… ప్రస్తుతానికి ప్రచారంలోకి వచ్చే పేర్లు ఇవి… అంతిమ నిర్ణయాలకు ముందు చాలా ఈక్వేషన్లు వడబోయాల్సి ఉంటుంది… ఏమో టీటీడీ ట్రస్టు బోర్డ్ చైర్మన్ పదవి నుంచి టీవీ5 నాయుడిని గనుక తప్పించాలని భావిస్తే… తను కూడా ఈ రేసులోకి రావచ్చు, కానీ సేమ్ కేస్ట్… ఏమో, ఏబీఎన్ రాధాకృష్ణకు కూడా రాజ్యసభ మీద ఆసక్తి ఉందంటారు, తనూ సేమ్…

  • సో, చంద్రబాబు… కాదు, కాదు, లోకేష్ ఏ నిర్ణయాలు తీసుకుంటాడనేదే ఇప్పుడు అందరికీ ఆసక్తిదాయకం..!! ఎందుకంటే..? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అవకాశాల మాటేమిటనే ప్రశ్న బలంగా ముందుకొస్తుంది కాబట్టి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ నలుగురూ ఎవరు..? అందరూ ‘వాళ్లేనా’..? మరి ఇతరుల మాట..?!
  • జగిత్యాల జైత్రయాత్ర నాడు… నేడు జీవన్‌రెడ్డి గడీ ప్రవేశయాత్ర…
  • ‘మీడియా ఫ్యామిలీ’ అనగానేమి..? మంగ్లి జర్నలిస్టా..? సినీ సెలబ్రిటీయా..?
  • టీఆర్ఎస్..! ఈ టైటిల్ ఓనర్ ఎవరు..? రూల్స్ ఏం చెబుతున్నయ్..!!
  • ముఖపుస్తకం కాదు… ఇది అక్షరాలా బాపు మార్క్ పెళ్లిపుస్తకం…
  • గుడి సంప్రదాయమే ‘సుప్రీం’… పాటించాల్సిందే… ధర్మో రక్షతి రక్షితః
  • మీ దుంపతెగ… 90 ఏళ్లు… స్టిల్ హెల్తీ… మీరే చంపేశారేమిట్రా…
  • ఇండియన్ సినిమాపాట @ ఆశా భోస్లే..! వైవిధ్యానికి ఐకన్ ఆమె..!!
  • విష్ణుప్రియ డబ్బు కక్కుర్తి… కానీ అది నేరమా..? అంత ఘోరమా..?
  • ఓహ్… నటుడు ప్రకాష్‌రాజ్‌లో ఈ కోణం కూడా ఉందా..? ఆశ్చర్యమే…!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions