Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఐప్యాక్..! వ్యూహకర్తలు కారు… పక్కా స్కామర్లు… కోట్లకుకోట్ల దందాలు..!!

April 15, 2026 by M S R

.

పోల్ స్ట్రాటజిస్టులు, అనగా ఎన్నికల వ్యూహకర్తలు పేరిట ఐప్యాక్ ప్రశాంత్ కిషోర్ చేసిన అరాచకం అంతా ఇంతా కాదు ఈ దేశ ప్రజాస్వామిక, ఎన్నికల వ్యవస్థకు..! డబుల్ గేమ్స్ కూడా..! పెద్ద పెద్ద పార్టీలు వందల కోట్లు ఖర్చు పెట్టి, నానా అరాచకాన్ని ఎంకరేజ్ చేశారు… తీరా చూస్తే అదే ప్రశాంత్ కిషోర్ అడ్డగోలుగా తన సొంత రాష్ట్రంలో ‘డిజాస్టర్’ అయిపోయాడు… అయితే తను రూపొందించిన ఆ దందా అనేక కోట్ల స్కాంల దాకా వెళ్లిపోయింది…

ఓ తాజా వార్త చదువుదాం… ఐ-పాక్ డైరెక్టర్ వినేష్ చందేల్ అరెస్ట్: వెలుగులోకి రూ. 50 కోట్ల మనీలాండరింగ్ నెట్‌వర్క్!

Ads

దేశంలోని ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐ-పాక్ (I-PAC) డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడు వినేష్ చందేల్ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేయడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది… పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న చందేల్, బెంగాల్, మేఘాలయలో టీఎంసీ (TMC) తరపున కీలకంగా వ్యవహరించారు…

కోల్ స్మగ్లింగ్ (బొగ్గు అక్రమ రవాణా) కేసులో భాగంగా సాగుతున్న మనీలాండరింగ్ దర్యాప్తులో ఈ అరెస్ట్ చోటు చేసుకుంది. ఐ-పాక్ ద్వారా సుమారు రూ. 50 కోట్ల అక్రమ సొమ్మును లాండరింగ్ చేసినట్లు ఈడీ ఆరోపిస్తోంది. (ఈడీ దాడుల సందర్భంగా సాక్షాత్తూ ఓ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పోలీసు ఉన్నతాధికారులతో వెళ్లి, ఐప్యాక్ ఆఫీసు నుంచి ఫైళ్లు ఎత్తుకురావడం ఈ దేశ చరిత్రలోనే అనూహ్య, విస్మయకర సంఘటన…)

ఈడీ మోపిన ప్రధాన ఆరోపణలు ఇవే… వినేష్ చందేల్ కస్టడీ కోరుతూ ఈడీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులోని కీలక అంశాలు….

  1. 50-50 ఫార్ములా (నగదు & చెక్కు)…: రాజకీయ పార్టీల నుండి వచ్చే నిధులను ఐ-పాక్ రెండుగా విభజించేదని ఈడీ పేర్కొంది. సగం మొత్తాన్ని బ్యాంకింగ్ ఛానల్స్ (చెక్కులు) ద్వారా, మిగిలిన సగం మొత్తాన్ని లెక్కల్లో చూపని నగదు రూపంలో తీసుకునేవారని ఆరోపించింది. ఈ ‘బ్లాక్ మనీ’ని ఎన్నికల ఖర్చులకు, ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేసే పనులకు వాడినట్లు ఆధారాలు దొరికాయని తెలిపింది.

  2. నకిలీ రుణాలు (Shell Loans)..: 2019-21 ఆర్థిక సంవత్సరాల్లో ‘రామసేతు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ అనే సంస్థ నుండి ఐ-పాక్ రూ. 13.50 కోట్ల వడ్డీ లేని రుణాలను తీసుకున్నట్లు చూపింది. అయితే, ఆ సంస్థ అసలు బ్యాంక్ కానీ, ఎన్‌బీఎఫ్‌సీ (NBFC) కానీ కాదు. ఎలాంటి తనఖా లేకుండా, ఒప్పందం లేకుండా జరిగిన ఈ లావాదేవీ కేవలం నల్లధనాన్ని వైట్ మనీగా మార్చుకోవడానికి చేసిన ‘షమ్’ (Sham) లావాదేవీ అని ఈడీ స్పష్టం చేసింది.

  3. బొగస్ ఇన్‌వాయిస్‌లు…: ఎలాంటి సేవలు అందించకుండానే థర్డ్ పార్టీ సంస్థల నుండి నిధులు పొందేందుకు ఐ-పాక్ నకిలీ బిల్లులు సృష్టించిందని, తద్వారా నేరపూరిత సొమ్మును చట్టబద్ధమైన ఆదాయంగా చూపించిందని దర్యాప్తులో తేలింది.

  4. హవాలా లావాదేవీలు…: డబ్బును తరలించడానికి ఐ-పాక్ హవాలా మార్గాలను ఎంచుకుందని, దీనికి సంబంధించి కీలక వ్యక్తుల వాంగ్మూలాలను రికార్డు చేశామని ఈడీ తెలిపింది. బ్యాంకింగ్ వ్యవస్థను కాదని సమాంతర ఆర్థిక వ్యవస్థను వీరు నడిపారని ఆరోపించింది.

  5. ఆధారాల ధ్వంసం…: జనవరిలో సోదాలు జరిగిన తర్వాత, చందేల్ తన ఉద్యోగుల ఈమెయిల్స్,  కీలకమైన ఆర్థిక డేటాను డిలీట్ చేయించినట్లు ఈడీ కోర్టుకు వివరించింది. అంతేకాకుండా, ఆయన తరచుగా విదేశాలకు వెళ్తుంటారని, వదిలేస్తే పరారయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.


చందేల్ తరపు న్యాయవాదుల వాదన…. వినేష్ చందేల్ తరపున సీనియర్ అడ్వకేట్ వికాస్ పహ్వా వాదిస్తూ, ఈ అరెస్ట్ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆరోపించారు.

  • రాజకీయ కక్ష సాధింపు…: త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నారని వాదించారు (తమిళనాడులో ఐ-పాక్ డీఎంకేతో పని చేస్తోంది)…

  • చట్టపరమైన అభ్యంతరం…: అకౌంటింగ్‌లో లోపాలు ఉంటే అది ఆదాయపు పన్ను శాఖ (IT Act) పరిధిలోకి వస్తుందని, పీఎంఎల్ఏ (PMLA) కిందకు రాదని పేర్కొన్నారు. ఈడీ కేవలం కస్టడీ కోసమే సెక్షన్ 420, 120బి వంటి సెక్షన్లను అక్రమంగా చేర్చిందని వాదించారు.

ప్రస్తుత పరిస్థితి….: పాటియాలా హౌస్ కోర్టు వినేష్ చందేల్‌కు 10 రోజుల ఈడీ కస్టడీ విధించింది. రాబోయే ఎన్నికల వేళ ఈ దర్యాప్తు ఎలాంటి మలుపులు తిరుగుతుందోనన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది…. (ఐప్యాక్ గతంలో జగన్ పార్టీకి కూడా పనిచేసిన సంగతి తెలిసిందే...)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అంజలి కడమ్..! హఠాత్తుగా తెరమరుగు… ఈరోజుకూ అజ్ఞాతమే…!!
  • ఐప్యాక్..! వ్యూహకర్తలు కారు… పక్కా స్కామర్లు… కోట్లకుకోట్ల దందాలు..!!
  • పూలు విసిరితే బాంబు అనుకుని… దళపతి భయంతో పరుగో పరుగు…
  • బీఆర్ఎస్ సైద్ధాంతిక శూన్యం..! కీలక బిల్లులపై ‘అనివార్య నిశ్శబ్దం..!
  • “మోదీ సరికొత్త గణితం..! 3 బిల్లులు – దేశ రాజకీయాల ‘గేమ్ ఛేంజర్’ ప్రణాళిక..!”
  • బీహార్ రాజకీయాల్లో మార్పు..? ఎవరు ఈ సామ్రాట్ చౌదరి..?!
  • తెలంగాణకు కేసీయార్ తీరని చారిత్రక ద్రోహం… ఇవిగో ఆనవాళ్లు…
  • ధో రో కో … ముక్కుతూ మూలుగుతూ… మ్యాచులకు దూరమవుతూ…
  • సినిమా ప్రసార హక్కులు … టీవీ చానల్స్ మధ్య పోటీ …
  • జంధ్యాల హీరోయిన్… సినిమాల్ని పక్కకు తోసేసి, అమెరికా వెళ్లి…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions