.
టీసీఎస్ నాసిక్ బీపీఓ ఆఫీసులో లైంగిక వేధింపులు, మతమార్పిళ్ల కేసు సంచలనం సృష్టిస్తోంది కదా… ప్రధాన పాత్రధారి నిదా ఖాన్ దొరికితే కథ వేరేరకంగా ఉండొచ్చు అంటున్నారు… ఎందుకంటే..? నిందితుల మెయిళ్లు, లేడీ-డి కమ్యూనికేషన్లు తవ్వుతున్న సిట్ ఏకంగా ఆమె ఉగ్రవాద సంస్థలతో లింక్స్ ఉన్నట్టు తాజాగా సందేహిస్తున్నారు…
జాగ్రత్తగా పరిశీలించండి… నొయిడాలో కార్మికవేతనాలకు సంబంధించి హఠాత్తుగా పాకిస్థానీ హ్యాండ్లర్స్ అప్పటికప్పుడు బాట్ అకౌంట్లు క్రియేట్ చేసి, అల్లర్లను ఎగదోశాయి… అన్నీ పాకిస్థాన్ బేస్డ్ వీపీఎన్ ద్వారా ఆపరేట్ అవుతున్నవే… 350 మందిని అరెస్టు చేశారు… అందులో చాలామంది గతంలో సీఏఏ, ఎన్ఆర్‌సి అల్లర్లలో ఉన్నవాళ్లే… ఎన్ఐఏ రంగంలోకి దిగింది…
Ads
ఆమధ్య ఎర్రకోట దగ్గర కారు పేలిన కేసు గుర్తుందా..? మేడమ్ సర్జన్ అని పిలవబడే డాక్టర్ షాహీన్ ప్రధాన సూత్రధారి… ఆమె టీమ్‌లో డాక్టర్లు… లిక్విడ్ ఎక్స్‌ప్లోజివ్” (Liquid Explosive) లేదా “వైట్ పౌడర్ థ్రెట్“ అని పిలిచే అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థం తయారు చేశారు… వారు తయారు చేసినది TATP (Triacetone Triperoxide) అనే పదార్థం ఆధునిక వెర్షన్… ఇది సాధారణ మెటల్ డిటెక్టర్లకు లేదా ఎక్స్-రే మిషన్లకు దొరకదు…
పెయింట్ థిన్నర్లు, బ్లీచింగ్ ఏజెంట్స్ వంటి రోజూ వాడే కెమికల్స్‌తో దీనిని తయారు చేయవచ్చు… డాక్టర్ షాహీన్ వైద్య నేపథ్యం (Medical Background) ఉండటంతో, కెమికల్ కాంబినేషన్స్‌ను సరిగ్గా కలపడంలో ఆమె కీలక పాత్ర పోషించింది… జమ్మూ కాశ్మీర్, ఢిల్లీలో జరిగిన దర్యాప్తులో వారు ఈ పేలుడు పదార్థాన్ని పర్ఫ్యూమ్ బాటిల్స్‌లో నింపినట్లు పోలీసులు గుర్తించారు… వీటిని ఎవరైనా బాటిల్ మూత తెరిచినా లేదా ఒత్తినా వెంటనే పేలిపోయేలా డిజైన్ చేశారు… ఇది ఇండియాలో వెలుగు చూసిన అత్యంత ప్రమాదకరమైన కొత్త టెక్నాలజీ.
షాహీన్ పేలుడు పదార్థాలకు కొన్ని విషపూరితమైన బ్యాక్టీరియా లేదా రసాయనాలను కలిపి ‘బయో–వెపన్‘ (Biological Weapon) లాగా మార్చే ప్రయత్నం చేస్తోందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి… అన్నీ ఒకదానితో ఒకటి లింక్డ్… ఆ లింక్ పేరు సాదియా అజహర్…
సాదియా అజహర్ ఎవరో తెలుసా..? కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహమ్మద్ అధినేత మసూద్ అజహర్ తెలుసు కదా, తన సోదరి ఈమె… అప్పట్లో కాందహార్ విమానం హైజాక్ కేసులో ప్రధాన సూత్రధారి, ఈ మసూద్‌ను విడిపించిన యూసుఫ్ అజహర్ భార్య ఈ సాదియా… అతను ఆపరేషన్ సింధూర్ దాడుల్లో ఉగ్రభవనాలు పేలిపోయి, వాటిల్లో పడి మరణించాడు… ఆ కోపంతో సాదియా సొంతంగా జమాత్ ఉల్ మోమినాత్ అనే టెర్రర్ ఆర్గనైజేషన్ స్థాపించింది…

అదుగో దానికి ఇండియా హెడ్… పైన మనం చెప్పుకున్న మేడమ్ సర్జన్ డాక్టర్ షాహీన్… ఆమెతో ఈ టీసీఎస్ నిదా ఖాన్‌కు లింక్స్… ఎంత పెద్ద నెట్‌వర్క్ బయటపడుతున్నదో అర్థమవుతోంది కదా… మరో విషయం తెలుసా..? ఈమధ్య విజయవాడలో ఓ ఉగ్రకుట్ర బ్రేకయింది, సయిదా బేగం అనే అరెస్టయింది… ఆమె కూడా ఈ నెట్‌వర్క్‌లో భాగస్వామి… వీళ్లు ఇంకా ఎన్ని కార్పొరేట్ ఆఫీసుల్లో ఎందరిని ఉగ్రవాదంవైపు మరల్చారో తేలాల్సి ఉంది…
సాదియా అజహర్ కనీసం 5 వేల మందిని రిక్రూట్ చేసుకోవాలనే ప్లాన్ అట… ప్రత్యేకించి విద్యాధికుల నుంచి… టెర్రరిజం తన మోడస్ ఆపరెండీని మార్చుకుంది… మరింత వేగంగా విస్తరిస్తోంది… బహుపరాక్… అందులో లవ్ జిహాద్, కార్పొరేట్ జిహాద్ వంటి చాలా మోడల్స్ ప్రయోగిస్తున్నారు..!! “మల్టీ–లేయర్డ్ కార్పొరేట్ టెర్రర్ మోడల్“… టెర్రరిజం ఇప్పుడు గన్ పట్టుకుని సరిహద్దులు దాటి రావడం లేదు; అది ID కార్డ్ వేసుకుని, కార్పొరేట్ ఏసీ ఆఫీసుల్లో కూర్చుంటోంది…

Share this Article