Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ది మిస్ ఫిట్..! ఆంటోనీ రాజు మంత్రి పదవి ఊడబీకిన ‘అండర్ వేర్’…

April 18, 2026 by M S R

.

 టైటిల్: ది మిస్ ఫిట్ (The Misfit) …. టాగ్ లైన్: ఒక లోదుస్తువు… వ్యవస్థనే మార్చేసింది! లేదా… ఓ అండర్ వేర్ … ఊడిన మంత్రి పదవి…

సీన్ 1: ది అరెస్ట్ (ఓపెనింగ్) … విమానాశ్రయంలో ఒక విదేశీయుడు (ఆండ్రూ సాల్వటోర్) అనుమానాస్పదంగా తిరుగుతుంటాడు. తనిఖీల్లో కేరళ పోలీసులకు దిమ్మతిరిగే షాక్! అతను వేసుకున్న అండర్‌వేర్ లోపల జేబులు కుట్టి, అందులో మత్తుపదార్థాలు దాచాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు, ఆ అండర్‌వేర్‌ను ప్రధాన సాక్ష్యంగా (Material Object) కోర్టులో పెడతారు. కింది కోర్టు అతనికి శిక్ష వేస్తుంది.

Ads

సీన్ 2: ది మాస్టర్ ప్లాన్ (ట్విస్ట్) … ఇక్కడే మన హీరో/విలన్ ఎంట్రీ. యువ న్యాయవాది ఆంటోనీ రాజు ఈ కేసును టేకప్ చేస్తాడు. నిందితుడు విదేశీయుడు కాబట్టి ఎలాగైనా బయటపడేయాలి. కేసు స్ట్రాంగ్‌గా ఉంది, సాక్ష్యం కళ్ళముందే ఉంది. అప్పుడే ఆయన మైండ్‌లో ఒక ‘క్రిమినల్ ఐడియా’ మెరుస్తుంది. “నేరాన్ని మార్చలేం.. కానీ నేరానికి వాడిన సాక్ష్యాన్ని మార్చొచ్చు” అని ఫిక్స్ అవుతాడు.

సీన్ 3: ది హేస్ట్‌ (కోర్టులో దొంగతనం) … కోర్టులో సాక్ష్యాలను భద్రపరిచే గదిని ‘తొట్టిపాళ్యం’ అంటారు. మన వకీల్ సాబ్ ఆంటోనీ రాజు తన పలుకుబడితో, అక్కడి క్లర్కును లోబరుచుకుంటాడు. ఒక అర్ధరాత్రి రహస్యంగా అసలు అండర్‌వేర్‌ను బయటకు తీసి, సరిగ్గా అలాగే కనిపించేలా మరో చిన్న సైజు అండర్‌వేర్‌గా తిరిగి కుట్టేసి అక్కడ పెడతారు. అది చిన్న పిల్లలకు సరిపోయేంత చిన్నది!

సీన్ 4: ది డ్రామా (కోర్టు సీన్) … హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఆంటోనీ రాజు లేచి వాదన మొదలుపెడతాడు: “మై లార్డ్, పోలీసులు నా క్లయింట్‌ను ఇరికించారు. ఆ అండర్‌వేర్ నా క్లయింట్‌ది అసలే కాదు!” అంటాడు. జడ్జి గారు ఆ సాక్ష్యాన్ని నిందితుడికి వేసి చూపించమంటారు. కట్ చేస్తే… నిందితుడు దాన్ని వేసుకోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ అది అస్సలు ఎక్కదు. కోర్టులో అందరూ నవ్వుతారు. “చూశారా మై లార్డ్.. సరిపోని బట్టలో సరుకు ఎలా దొరుకుతుంది?” అని వాదిస్తాడు. సాక్ష్యం సరిపోలేదు కాబట్టి నిందితుడు ఫ్రీ!

సీన్ 5: ది రివెంజ్ (ఇంటర్వెల్ బాంగ్) … ఆస్ట్రేలియన్ హ్యాపీగా దేశం దాటిపోతాడు. కానీ, ఆ కేసును పట్టుకున్న పోలీస్ ఆఫీసర్‌కు ఇది అవమానంగా అనిపిస్తుంది. “నా కళ్లముందే సాక్ష్యం ఎలా మారింది?” అని రగిలిపోతాడు. రిటైర్ అయినా సరే వదలకుండా పోరాటం మొదలుపెడతాడు.

సీన్ 6: ది రైజ్ ఆఫ్ విలన్ …. సంవత్సరాలు గడుస్తాయి. ఆ లాయర్ ఇప్పుడు కేవలం లాయర్ మాత్రమే కాదు, పెద్ద రాజకీయ నాయకుడు. ఏకంగా రాష్ట్రానికి మంత్రి అవుతాడు. పాత కేసు ఫైళ్లన్నీ దుమ్ము కొట్టుకుపోయి ఉంటాయని అతను ధీమాగా ఉంటాడు.

క్లైమాక్స్: ది జడ్జిమెంట్ … దుమ్ము పట్టిన ఫైళ్లు కదులుతాయి. ఫోరెన్సిక్ రిపోర్టులు వస్తాయి. ఆ అండర్‌వేర్ కత్తిరించి, తిరిగి చిన్న సైజుకు కుట్టినట్లు తేలుతుంది. అది న్యాయవ్యవస్థను వెక్కిరించినట్లుగా సుప్రీంకోర్టు వరకు వెళ్తుంది. “న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ తప్పించుకోలేదు” అంటూ కోర్టు విచారణకు ఆదేశిస్తుంది. చివరికి మంత్రి పదవికి రాజీనామా చేసి, 30 ఏళ్ల క్రితం చేసిన ‘చిన్న తప్పు’కి ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది.


సినిమా ముగింపు: వ్యవస్థతో ఆడుకుంటే, ఆ వ్యవస్థే తిరిగి ఎలా కాటేస్తుందో చూపిస్తూ సినిమా ఎండ్ అవుతుంది! ఒక అండర్‌వేర్ ఒక మంత్రి కెరీర్‌ను ఎలా ముంచేసిందో చెప్పే ఈ కథ నిజంగానే ఒక సెన్సేషనల్ స్క్రిప్ట్ కదా! ఇది రియల్ స్టోరీయే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఐపీఎల్ 2026 : పాత దోస్తులు – కొత్త శత్రువులు… పంత్ & శ్రేయాస్…
  • వైఎస్ మార్క్ లిబరల్..! కొత్త రేవంత్ రెడ్డి కనిపిస్తున్నాడు ఈమధ్య..!!
  • ఇప్పుడైతే శోభన మోహన్‌బాబును మూడు చెరువుల నీళ్లు తాగించేది..!!
  • ది మిస్ ఫిట్..! ఆంటోనీ రాజు మంత్రి పదవి ఊడబీకిన ‘అండర్ వేర్’…
  • బీహార్ ‘సామ్రాట్’ చౌదరి – అబ్బో, నువ్వు మామూలోడివి కాదు బాసూ…
  • సౌత్ వాయిస్..! రేవంత్ రెడ్డి మార్క్ పొలిటికల్ అడుగులు…!!
  • ఏలియన్స్ గుట్టు తెలిసిన సైంటిస్టులు మాయం..! ఎవరి పని..?!
  • అసలు ప్రశ్న అలాగే ఉండిపోయింది..! ఎన్ని పెంచాలి, ఎలా పెంచాలి..!!
  • అట్టడుగున ఆ నాలుగు జట్లు..! ఏవీ ఆ పాత మెరుపులు..?
  • ప్రకాష్ ఆంటోనీ రాజ్ మళ్లీ కూశాడు… ఈసారి రాముడిపై మరింత వెటకారంగా…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions