Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏలియన్స్ గుట్టు తెలిసిన సైంటిస్టులు మాయం..! ఎవరి పని..?!

April 18, 2026 by M S R

.

1966 … ఇండియా అణుశక్తి పితామహుడు హోమీ జహంగీర్ బాబా ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఆల్ఫ్స్ పర్వతాల్లో కూలిపోయింది… అది ప్రమాదం కాదు, కుట్ర, సీఐఏ చేసిన హత్య అని ఆరోపణలు… ఇండియా అణుబాంబు తయారు చేయకుండా అమెరికా తలపెట్టిన దారుణం… గత రెండు దశాబ్దాల్లో భారతదేశానికి చెందిన అనేకమంది అణు శాస్త్రవేత్తలు వింత పరిస్థితుల్లో మరణించారు…

  • కైగా (Kaiga) మరణాలు…: 2009లో కైగా అణు విద్యుత్ కేంద్రానికి చెందిన శాస్త్రవేత్త లోకనాథన్ మహాలింగం మృతదేహం కాళీ నదిలో లభ్యమైంది… అంతకుముందు కూడా అక్కడ పనిచేసే కొందరు విషప్రయోగానికి గురయ్యారు…

  • BARC శాస్త్రవేత్తలు…: గతేడాది కాలంలోనే BARC (భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్) కు చెందిన కొందరు యువ శాస్త్రవేత్తలు రైలు ప్రమాదాల్లో లేదా ఉరి వేసుకుని చనిపోయారు… వీటిని కేవలం ‘ఆత్మహత్యలు’గా కొట్టిపారేయడంపై విమర్శలు ఉన్నాయి…

అణు దేశాల్లో అంతటా ఇదే తీరు (ముఖ్యంగా ఇరాన్)… మొహసిన్ ఫక్రిజాదే…: ఇరాన్ అణు పితామహుడిగా పిలవబడే ఈయనను 2020లో రిమోట్ కంట్రోల్ మెషీన్ గన్‌తో నడిరోడ్డుపై కాల్చి చంపారు… ఇజ్రా ల్ గూఢచారి సంస్థ ‘మొసాద్’ దీని వెనుక ఉందని ప్రపంచమంతా నమ్ముతుంది…

Ads

  • ఇరాక్ సైంటిస్టులు: 2003 యుద్ధం తర్వాత ఇరాక్‌కు చెందిన దాదాపు 500 మంది అణు శాస్త్రవేత్తలు హత్యకు గురయ్యారు లేదా అదృశ్యమయ్యారు…


ఎందుకు ఇలా జరుగుతోంది? … నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఒక దేశం సైనిక లేదా అణు శక్తిని దెబ్బతీయాలంటే… ఆ దేశంపై యుద్ధం చేయడం కంటే, ఆ టెక్నాలజీని సృష్టించే ‘మెదళ్లను’ (Brain power) నిర్వీర్యం చేయడం సులభం…

……. పారడాక్స్ ఏమిటంటే..? ఏ దేశమూ అణ్వాయుధ దేశం కావద్దని, అడ్డంకులు, ఆంక్షలు పెట్టడమే కాదు, ఇదుగో ఇలాంటి కుట్రల్ని సీఐఏ ద్వారా సంధిస్తుందని అమెరికాపై ఆరోపణలు కదా… ఇప్పుడు అదే అమెరికా సైంటిస్టులు మిస్టరీ మరణాలకు గురవుతున్నారు… అమెరికా జోలికి వెళ్లి, ఆ సైంటిస్టులను హతమార్చే దమ్ము ప్రపంచంలో ఎవరికి ఉంది..? ఇదీ ఇప్పుడు చర్చ…

అమెరికాలో ‘సైంటిస్ట్’ల మిస్టరీ: ఇది యాదృచ్ఛికమా.. లేక ఏదైనా చీకటి కుట్రనా? ప్రపంచానికి పెద్దన్నగా వెలుగొందే అమెరికాలో ప్రస్తుతం ఒక వింత భయం గూడుకట్టుకుంది… ప్రయోగశాలల్లో నిశితంగా పరిశోధనలు చేయాల్సిన మేధావులు… వరుసగా ప్రాణాలు కోల్పోవడం లేదా ఆచూకీ లేకుండా మాయమవ్వడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తోంది… 2023 నుంచి ఇప్పటివరకు దాదాపు 10 మంది ఉన్నత స్థాయి శాస్త్రవేత్తలు అనుమానాస్పద స్థితిలో మాయమయ్యారు…

1. మాయమైన స్పేస్ మాస్టర్: విలియం నీల్ మెక్ కాస్లాండ్… ఈ జాబితాలో అత్యంత కలకలం రేపుతున్న పేరు మేజర్ జనరల్ విలియం నీల్ మెక్ కాస్లాండ్… పెంటగాన్‌లో అంతరిక్ష పరిశోధనల్లో కీలక పాత్ర పోషించిన ఈయన, ఈ ఏడాది ఫిబ్రవరిలో తన ఇంట్లో ఫోన్, కళ్లజోడు, వాచీ అన్నీ వదిలేసి మరీ మాయమయ్యారు…

  • మిస్టరీ ఏమిటంటే…: ఈయనకు 1947 నాటి ప్రసిద్ధ ‘రోస్వెల్ UFO క్రాష్’ రహస్యాలు తెలుసని ఒక ప్రచారం ఉంది… వికీలీక్స్ హ్యాకింగ్‌లో కూడా ఈయన పేరు బయటపడటం ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది…

2. 30 అడుగుల దూరంలోనే మాయం: మోనికా రెజా … జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (JPL) డైరెక్టర్‌గా పనిచేసిన మోనికా రెజా కథ మరింత విస్తుగొలుపుతుంది… గతేడాది జూన్‌లో తన స్నేహితుడి కంటే కేవలం 30 అడుగుల దూరంలో నడుస్తున్న ఆమె, క్షణాల్లో అదృశ్యమయ్యారు… ఇప్పటికీ ఆమె ఆచూకీ దొరకలేదు…

3. తుపాకీ గుళ్లకు బలి … కేవలం అదృశ్యాలే కాదు, దారుణ హత్యలు కూడా వెలుగులోకి వచ్చాయి…

  • సునో లోరిరో…: ఎంబీటీ ప్రొఫెసర్, ఫ్యూజన్ ఎనర్జీ పరిశోధకుడు… డిసెంబర్‌లో తన నివాసంలోనే కాల్చి చంపబడ్డారు…

  • కార్ల్ గ్రిల్మెయిర్…: కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త… ఈ ఏడాది ఫిబ్రవరిలో తన ఇంటి ముందే గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో మరణించారు…


సైంటిస్టులు

ఇది కుట్రనా? ఏలియన్స్ రహస్యాలు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారా? ఈ మరణాల వెనుక ఉన్న అసలు కారణం ఏమిటన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న… దీనిపై ప్రధానంగా రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి…

కుట్ర కోణం…: అమెరికా వద్ద ఉన్న గ్రహాంతరవాసుల రహస్యాలు, అణు టెక్నాలజీ బయటకు రాకుండా ఎవరో కావాలనే వీరిని అడ్డు తొలగించుకుంటున్నారని ఒక వర్గం గట్టిగా నమ్ముతోంది…

UFO రహస్యాలు…: రోస్వెల్ ఘటన, ఏలియన్స్ గురించి కీలక సమాచారం తెలిసిన వారు మాయమవ్వడం ‘బ్లాక్ బడ్జెట్’ ప్రోగ్రామ్స్ లేదా రహస్య సంస్థల ప్రమేయం ఉందేమో అన్న అనుమానాలను కలిగిస్తోంది…

అంతర్గత ప్రక్షాళన…: ప్రభుత్వంలో ఉండే రహస్య సమాచారం బయటకు వెళ్లకుండా ‘డీప్ స్టేట్’ (Deep State) ఏమైనా చర్యలు తీసుకుంటోందా అనే వాదన కూడా ఉంది…

  • అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం దీనిపై స్పందిస్తూ ‘ఇది కాకతాళీయమా? లేక కుట్రనా? అనేది త్వరలోనే తేలుస్తాం’ అని ప్రకటించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు… వైట్ హౌస్ ఇచ్చే నివేదిక కోసం ఇప్పుడు ప్రపంచమంతా ఎదురుచూస్తోంది…

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ది మిస్ ఫిట్..! ఆంటోనీ రాజు మంత్రి పదవి ఊడబీకిన ‘అండర్ వేర్’…
  • బీహార్ ‘సామ్రాట్’ చౌదరి – అబ్బో, నువ్వు మామూలోడివి కాదు బాసూ…
  • సౌత్ వాయిస్..! రేవంత్ రెడ్డి మార్క్ పొలిటికల్ అడుగులు…!!
  • ఏలియన్స్ గుట్టు తెలిసిన సైంటిస్టులు మాయం..! ఎవరి పని..?!
  • అసలు ప్రశ్న అలాగే ఉండిపోయింది..! ఎన్ని పెంచాలి, ఎలా పెంచాలి..!!
  • అట్టడుగున ఆ నాలుగు జట్లు..! ఏవీ ఆ పాత మెరుపులు..?
  • ప్రకాష్ ఆంటోనీ రాజ్ మళ్లీ కూశాడు… ఈసారి రాముడిపై మరింత వెటకారంగా…
  • నో బొట్టు, నో మణికట్టు పట్టీలు, నో సిందూరం… లెన్స్‌కార్ట్ వివాదం ఏమిటంటే..?
  • పెద్ద నెట్‌వర్క్..! భీతిగొలిపే మల్టీ లేయర్ కార్పొరేట్ టెర్రర్ మోడల్..!!
  • IPL 2026…! ఈ సీజన్‌లో ఎందుకు అంబానీ టీమ్ ఫ్లాప్ గేమ్..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions