Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అదే పాట – అదే సిరివెన్నెల- భానుమతి పాడితే నో – తనే పాడుకుంటే నంది

June 21, 2026 by M S R

Subramanyam Dogiparthi …. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని సమాజాన్ని, అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవఛ్ఛవాన్ని, మారదు లోకం మారదు కాలం . సాధారణంగా పాట ఒకరు వ్రాస్తారు . మరొకరు పాడతారు . ఇంకొకరు నటిస్తారు . కానీ ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే పాటను వ్రాసిన సిరివెన్నెల వారే పాడి సినిమాలో నటించారు కూడా .

1993 ఏప్రిల్‌లో వచ్చిన ఈ గాయం సినిమాలోని ఈ పాటకు ఇన్ని విశేషాలు ఉన్నాయి . ఈ పాట వ్రాసినందుకు ఉత్తమ సాహిత్యంగా ఆయనకు నంది అవార్డు కూడా వచ్చింది .

  • మరో విశేషం ఏమిటంటే ఈ పాట 1990 లో వచ్చిన అభిసారిక సినిమాలో భానుమతి పాడుతుంది . కానీ అప్పుడు రాని అవార్డు ఈ సినిమా సందర్భంగా రావటం .

ఈ గాయం సినిమా రాంగోపాల్ వర్మ కెరీర్లో మరో శివ అని కూడా చెప్పవచ్చు . ఎలా అయితే శివ నాగార్జునకు మంచి బ్రేక్ ఇచ్చిందో జగపతిబాబుకు అలాంటి బ్రేకే ఇచ్చింది . బహుశా ఈ సినిమాలోనే జగపతిబాబు మొదటిసారిగా తన డబ్బింగ్ తానే చెప్పుకున్నాడు . అతనికి కూడా ఉత్తమ నటుడిగా నంది అవార్డు వచ్చింది.

Ads

1990s లో రాజకీయాలు , అంతర్గత కుమ్ములాటలు , అసమ్మతి రాగాలు , శాంతిభద్రతలను అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చేందుకు కుయుక్తులు పన్నటం వంటి సన్నివేశాలతో కధను నేసాడు రాంగోపాల్ వర్మ . మణిరత్నం కూడా ఓ చేయి వేసాడు కధను నేయటంలో .

రాజకీయ నాయకులు , రౌడీ ముఠాలు , వారి ఆధిపత్య పోరు , పోలీసుల ప్రచ్ఛన్న హస్తం వంటి అంశాల చుట్టూ నడుస్తుంది . ఆ రోజుల్లో చాలా సినిమాల్లోలాగా కోట శ్రీనివాసరావు తెలంగాణా యాసతో అదరగొట్టేసారు . ఆయనకు కూడా ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డు వచ్చింది .

  • మరో విశేషం ఆయన స్వంత కుమారుడు ఆంజనేయ ప్రసాద్ సినిమాలో కూడా కుమారునిగా నటించటం .

కొంత షూటింగ్ బాంకాక్ లో జరిగింది . ఇండియాలో గేంగ్ వార్‌ని వదిలించుకుని బాంకాక్ చేరిన జగపతిబాబుని ఇండియా నుండి వెళ్ళిన విలన్లు కోట కుమారుడు , వాళ్ళ లాయర్ తనికెళ్ళ భరణి గెలుక్కుంటారు . తప్పక మరలా జగపతిబాబు ఇండియాకు వచ్చి గేంగ్ వార్ కొనసాగించి అందరినీ లేపేస్తాడు .

గేంగ్ లీడర్ గా కొనసాగటంతో సినిమా ముగుస్తుంది . 2010 లో గాయం-2 వచ్చినా సక్సెస్ కాలేదు .
చక్రవర్తి కుమారుడు శ్రీ సంగీత దర్శకత్వాన్ని నిర్వహించాడు . పాటలన్నీ సిరివెన్నెల వారే వ్రాసారు . నిగ్గదీసి అడుగు పాట లాంటిదే మరో సందేశాత్మక పాట కూడా ఉంది . సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని, సుఖాన మనలేని వికాసమెందుకని అడుగుతుంది అదిగో ఎగిరే భరత పతాకం .

రేవతి , జగపతిబాబు మీద డ్యూయెట్లు నా కోసమే చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు , అలుపన్నది ఉందా ఎగిరే అలకు చాలా రొమాంటిగ్గా చిత్రీకరించబడ్డాయి . ఊర్మిళ , ఉత్తేజ్ , తదితరుల మీద నైజాం పోరీ హుషారుగా సాగుతుంది . పోసాని మురళీకృష్ణ డైలాగులు బాగుంటాయి . యార్లగడ్డ సురేంద్ర నిర్మాత .

ప్రధాన పాత్రల్లో తనికెళ్ల భరణి , బెనర్జీ , జీవా , బాలయ్య , రామిరెడ్డి , శివకృష్ణ , గుమ్మడి  తదితరులు నటించారు . ఒక విశేషం ఏమిటంటే పోకిరి , విక్రమార్క వంటి సినిమాల ద్వారా పాపులరయిన అజయ్ 1993 లోనే వచ్చిన ఈ సినిమాలో కనిపిస్తాడు .

బెస్ట్ సపోర్టింగ్ రోల్ నంది అవార్డు ఊర్మిళకు , ఉత్తమ ఛాయాగ్రాహకుడు నంది అవార్డు రసూల్ కు , ఉత్తమ ఎడిటర్ నంది అవార్డు శంకర్ కు వచ్చాయి . ఈ సినిమా తమిళంలోకి డబ్ అయింది . రాంగోపాల్ వర్మకు పేరు వచ్చిన సినిమాలలో ఒకటయిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . ఆసక్తి కలవారు ట్రై చేయవచ్చు .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దొరతనం ! అవలక్షణులను తెలంగాణపై రుద్దిన క్షుద్రరాజకీయం !!
  • “వైభవ్ సూర్యవంశీ – ఓవర్ హైప్‌తో అసలు ఒరిజినాలిటీకే గండం?”
  • ఖర్మాఖ్య ! అదిరె అభి సినిమా బెదిరె ! ఫస్టాఫ్ టోటల్ వేస్ట్ !
  • Untold Stories – రామాయణ్‌లో ఈమె ఎవరో, పాత్ర ఏమిటో ఊహించండి ?!
  • రేవంత్ సరైన చర్చ రేపాడు ! ఇవిగో కొన్ని ఇంజినీరింగ్ చేదు వాస్తవాలు !!
  • అజింక్యా అంటేనే అజేయుడు – స్థితప్రజ్ఞుడు… కానీ సరైన వీడ్కోలు లేదు!!
  • ఓ ప్రేమ పెళ్లి ! అత్యంత సంక్లిష్ట- సుదీర్ఘ విడాకుల కేసుకు చివరకు తెర !!
  • మనం తలుచుకోవాల్సిన మరో పేరు జమునారాణి..! వెళ్లిపోయింది !!
  • అబ్సర్డ్ ! ఈ సీత చుట్టూ అకారణంగా నెగెటివిటీని రుద్దేది కాషాయమే !!
  • సుమంత్‌ను ఫ్లాప్ కెరీర్ వెంటాడుతూనే ఉంది – ఖర్మ థియరీ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions