.
ఇది క్రికెట్, అందులోనూ టీ20 బాపతు… ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు… అవును, పంత్, శ్రేయాస్ గురించీ అంతే… ప్రస్తుతం ఈ ఇద్దరి కెరీర్, పర్‌ఫామెన్స్ మంచి చర్చనీయాంశంగా మారింది… ఒకప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు వీరిద్దరూ పిల్లర్ల వంటి వారు. ఢిల్లీ జట్టులో రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ కలిసి ఎన్నో మ్యాచులు గెలిపించారు.
కానీ 2026 ఐపీఎల్ నాటికి కాలం మారింది, వీరి దారులు పూర్తిగా వేరయ్యాయి. వేలంలో అత్యధిక ధర పలికిన ఈ ఇద్దరు (ఒకరు 27 కోట్లు, మరొకరు 26.75 కోట్లు) ‘హెవీ వెయిట్స్’ మధ్య ఇప్పుడు ఆసక్తికరమైన పోరు నడుస్తోంది.
Ads
అయ్యర్: మైదానంలో సక్సెస్.. తెర వెనుక పాలిటిక్స్! శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ (PBKS) కెప్టెన్‌గా తన విశ్వరూపం చూపిస్తున్నాడు. 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పంజాబ్‌ను పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాడు.
-
డబుల్ సక్సెస్…: అయ్యర్ కేవలం బ్యాటర్‌గానే కాకుండా (67 సగటు), కెప్టెన్‌గా కూడా 100% సక్సెస్ అయ్యాడు. జట్టును ఎలా నడిపించాలో, బౌలర్లను ఎలా మార్చాలో అతనికి తెలిసినట్లు మరెవరికీ తెలియడం లేదు.
-
టీమ్ ఇండియా వివాదం…: ఐపీఎల్‌లో ఇంతలా రాణిస్తున్నా, అయ్యర్‌కు టీమ్ ఇండియాలో చోటు దక్కకపోవడం వెనుక పెద్ద చర్చ నడుస్తోంది. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో ఉన్న విభేదాలే దీనికి కారణమని ఇండస్ట్రీలో టాక్. గంభీర్ అతన్ని సహించలేకపోతున్నాడని, అందుకే ఐసీసీ టోర్నీల్లో అయ్యర్‌ను పక్కన పెడుతున్నారనే వాదనకు ఇప్పుడు మరింత బలం చేకూరుతోంది.
పంత్: వ్యక్తిగతంగా ఓకే.. కానీ కెప్టెన్‌గా విఫలం? మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ రిషబ్ పంత్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.
-
బ్యాటింగ్ అదరగొడుతున్నా…: నెంబర్ 3లో దిగి 173 స్ట్రైక్ రేట్‌తో పంత్ తన వ్యక్తిగత ఫామ్‌ను నిరూపించుకుంటున్నాడు. 27 కోట్ల ధర పలికినందుకు బ్యాటర్‌గా న్యాయం చేస్తున్నాడు.
-
కెప్టెన్సీలో పూర్: కానీ జట్టును విజయ తీరాలకు చేర్చడంలో పంత్ కెప్టెన్సీ విఫలమవుతోంది. కీలక సమయాల్లో అతను తీసుకునే నిర్ణయాలు బెడిసికొడుతున్నాయి. ఫలితంగా లక్నో జట్టు లాస్ట్ 4 (7వ స్థానం) లో కొట్టుమిట్టాడుతోంది. పంత్ కేవలం హిట్టర్ గానే మిగిలిపోతున్నాడా, కెప్టెన్ గా పనికిరాడా అన్న విమర్శలు మొదలయ్యాయి.
ఢిల్లీలో కలిసి ప్రయాణం మొదలుపెట్టిన ఈ ఇద్దరిలో ఒకరు (అయ్యర్) గ్రౌండ్‌లో రాజ్యాధికారం చెలాయిస్తూ, బయట మాత్రం సెలక్టర్ల వివక్షకు గురవుతుంటే… మరొకరు (పంత్) వ్యక్తిగతంగా మెరుస్తూ కెప్టెన్‌గా తన పరువు కాపాడుకోవడానికి పోరాడుతున్నారు…
రేపటి మ్యాచ్‌లో నెంబర్ 1 (అయ్యర్) వర్సెస్ లాస్ట్ 4 (పంత్) తలపడబోతున్నారు. ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి!
Share this Article