.
మొన్ననే కదా… ఆహా, ఫస్ట్ మ్యాచులోనే, ఫస్ట్ ఓవర్‌లోనే… ఎవరికీ చేతకాని రీతిలోల… ఏకంగా మూడు వికెట్లు తీశాడు ఫ్రఫుల్ హింగ్… రిజర్వ్ బెంచ్ మీద ఉన్న తనను పికప్ చేసి, ప్రోత్సహించి, సానపట్టిన కోచ్ గ్రేట్… అసలు ప్రఫుల్ కథ తెలుసా..? అని బోలెడు కథనాలు రాసి, అకస్మాత్తుగా ఆకాశానికెత్తాం… ఆహా, ఫస్ట్ బాల్‌తోనే వైభవ్‌ను ఔట్ చేస్తానని చెప్పి మరీ కొట్టాడు తెలుసా అనీ రాసుకున్నాం.., డెబ్యూ మ్యాచులోనే 4 వికెట్లు తీశాడని మురిసిపోయాం… ఇక కావ్య మారన్ జట్టుకు తిరుగులేదు, ఓ ఆణిముత్యం దొరికినట్టే అనీ సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నాం…
సీన్ కట్ చేస్తే… సెకండ్ మ్యాచ్… నిన్న చెన్నై జట్టుతో… తేలిపోయాడు… కళ్లు తేలేశాడు… 4 ఓవర్లలో ఏకంగా 60 పరుగులు ధారాళంగా ఇచ్చేశాడు… ఫస్ట్ బాల్‌నే సంజూ శాంసన్ శిక్షించాడు… సెకండ్ ఓవర్‌లో ప్రఫుల్ మరీ 24 పరుగులు ఇచ్చాడు… నాలుగో ఓవర్‌లో చివరకు తీసింది ఒక్క వికెట్… అదీ లోయర్ ఆర్డర్‌లో ఓవర్టన్ వికెట్… సో, బాల్‌తో ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు… నియంత్రణ లేదు… వరుస వైఫల్యాల చెన్నై బ్యాటర్లు కాబట్టి సరిపోయింది, ఏ పంజాబ్ జట్టో అయితే మరింత ఉతికి ఆరేసేది…
Ads
మరో బౌలర్ సాకిబ్… తను కూడా రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచులో 4 వికెట్లు తీశాడు, ప్రఫుల్‌కన్నా మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు… ఇక ఈ ఇద్దరూ దున్నేస్తారు అని రాసేశాం కదా… సీన్ కట్ చేస్తే… నిన్న చెన్నై జట్టు మీద సాధించింది కేవలం ఒక వికెట్… కాకపోతే ప్రఫుల్‌కన్నా చాలా బెటర్ ఎకానమీ…
ఫస్ట్ మ్యాచుకు, సెకండ్ మ్యాచుకు నడుమ ఎంత తేడా చూడండి… అనుభవం అనుభవమే… ఇదే మ్యాచులో మలింగ 3 వికెట్లు, నితిశ్ కుమార్ రెడ్డి కీలకమైన రెండు వికెట్లు తీశారు… అందుకే చెప్పేది అద్భుతాలు పదే పదే రిపీట్ కావడం కష్టం… ఇది టీ20… అనేక కారణాలు పర్‌ఫామెన్స్‌ను ప్రభావితం చేస్తాయి… ఒక వైభవ్ సూర్యవంశీ కావచ్చు, ఒక ప్రఫుల్ హింగ్ కావచ్చు… మనం హఠాత్తుగా ఆకాశానికెత్తుతాం… వాళ్లు మబ్బుల్లో ఉంటారు… కాలం వేగంగానే నేల మీదకు తోస్తుంది… మనం ఇక వాళ్లను పట్టించుకోం… కన్సిస్టెన్సీ మాత్రమే క్రికెట్‌లో ఉనికిని కాపాడేది… పరిస్థితులు కూడా…
నిన్నటి మరో మ్యాచ్ చూడండి… పటిష్టంగా కనిపిస్తున్న బెంగుళూరు జట్టు మీద ఢిల్లీ కేపిటల్స్ భలే గెలిచింది… ఆగీ ఆగీ చివరలో ఓడిస్తాడు అనే నలుపు ముద్ర ఉన్న మిల్లర్, పరుగులు మరీ కష్టంగా వస్తున్న పిచ్ మీద, చివరి ఓవర్‌లో రెండు సిక్సులు, ఓ ఫోర్ కొట్టి గెలిపించాడు… ఢిల్లీ ఇప్పుడు టాప్ 4 జట్లకు మంచి పోటీఇస్తోంది… సో, ఎవరికి ఎప్పుడు టైమ్ కలిసొస్తుందో చెప్పలేం… అంతే…!!
Share this Article