Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

B-Grade Reply… దురంధర్‌కు కౌంటర్ కొట్టబోయి పాకిస్థానీలు నవ్వులపాలు..!!

April 19, 2026 by M S R

.

దురంధర్ సినిమా మీద పాకిస్థానీల ఏడుపు… అంతకుమించి ఇండియాలోని పాకిస్థానీ ప్రేమికుల ఏడుపు… మరీ అంతకన్నా ఎక్కువగా ఇండియాలోని ‘యాంటీ ఇండియన్ల’ ఏడుపు అంతా ఇంతా కాదు… చూస్తూనే ఉన్నాం కదా… పాకిస్థానీలు అయితే ఉడుక్కుంటున్నారు… ఏదో ఓ కౌంటర్ ఇద్దామని ప్రయత్నం.,. కానీ అందులోనూ నాసిరకమే…

అంటే… అవతలి వాళ్ళకి ‘కాపీ’ కొట్టడం, కౌంటర్ కొట్టడం కూడా సరిగ్గా రాకపోతే వచ్చే కామెడీ మామూలుగా ఉండదు కదా! రణవీర్ సింగ్, ఆదిత్య ధర్ ల ‘దురంధర్’ సినిమా రేపిన ప్రకంపనలకి తట్టుకోలేక, పాకిస్థాన్ వాళ్లు ఏదో ‘కౌంటర్’ ఇవ్వాలని ట్రై చేసి చివరకు నెటిజన్లకి ఫుల్ మీల్స్ లాంటి వినోదాన్ని పంచారు…

Ads

‘జహన్నమ్ బా-రాస్తా జన్నత్’ అనే సిరీస్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ ఓసారి గమనిద్దాం… మన దగ్గర బడ్జెట్ కోట్లలో ఉంటే, అక్కడ మాత్రం ‘గల్లీ డ్రామా’ లెవల్లో ఉంది… ఆ సెట్ డిజైన్లు, ఆ గ్రాఫిక్స్ చూస్తుంటే… పాపం వాళ్ల ప్రయత్నాన్ని చూసి జాలి పడాలో లేక నవ్వుకోవాలో అర్థం కావడం లేదు…

  • షారుఖ్ ఖాన్ ‘నాన్న’గారి విన్యాసాలు…: ఓం శాంతి ఓం లో షారుఖ్ తండ్రిగా నటించిన జావేద్ షేక్, ఇందులో మన అజిత్ దోవల్‌ని పోలిన ‘ప్రీతమ్ జైపాల్’ అనే పాత్రలో నటించాడు… మనకు ఆయన్ని చూస్తే ఒక గౌరవం, సాఫ్ట్ ఫీలింగ్ ఉంటుంది… కానీ ఇందులో ఆయన్ని ‘మాస్టర్ మైండ్ విలన్’గా చూపిస్తుంటే నెటిజన్లు, “అంకుల్… మీకు ఇది అవసరమా?” అంటూ ట్రోల్ చేస్తున్నారు…

  • లాజిక్ లేని కథ…: కరాచీలో అల్లర్లు సృష్టించడానికి ఇండియా ప్లాన్ చేస్తోందట! ఆ స్క్రిప్ట్ రాసిన వాడికి, డైరెక్ట్ చేసిన వాడికి ఆస్కార్ ఇవ్వకపోయినా, కనీసం ఒక ‘కామెడీ అవార్డు’ అయినా ఇవ్వాలని నెటిజన్ల కోరిక…


నెటిజన్ల పంచ్‌లు – కొన్ని శాంపిల్స్

“పాపం.. కాపీ కొట్టడానికి కూడా కనీసం ఒక రేంజ్ ఉండాలి కదా రాజా!”

“ఇది స్పై థ్రిల్లర్ కాదు.. ఇదొక కామెడీ సర్కస్. థాంక్యూ పాకిస్థాన్ మాకు ఇంత మంచి వినోదాన్ని ఫ్రీగా యూట్యూబ్ లో ఇస్తున్నందుకు!”

“ఆ సెట్లు చూస్తుంటే మా ఊరి గణేష్ పందిరి సెట్టింగ్ గుర్తొస్తోంది. పీక్ ప్రొడక్షన్ వాల్యూస్ అంటే ఇవేనేమో!”


అసలు తేడా ఇదీ! 

దురంధర్‌లో హీరో రణవీర్ సింగ్ రచ్చ ఓ రేంజులో ఉంటుంది… వాళ్ల జహన్నమ్‌లో హీరో జావేద్ షేక్ టీవీ ఆర్టిస్టుకు తక్కువ, రీల్స్ ఆర్టిస్టుకు ఎక్కువ… బడ్జెట్ అక్కడక్కడా అప్పు తెచ్చి, ఓ షార్ట్ ఫిలిమ్ తీసినట్టు… దురంధర్ చూస్తుంటే గూస్ బంప్స్… జహన్నమ్ చూస్తుంటే పొట్ట చెక్కలయ్యే నవ్వు… జాలితో… ఒకటి ఇంటర్నేషన్ లెవల్, మరొకటి ఇంటర్నల్ కామెడీ లెవల్…

మొత్తానికి దురంధర్ దెబ్బకి పాకిస్థాన్ వాళ్ళు ఇచ్చిన రిప్లై, వాళ్లకే రివర్స్ కొట్టి ‘బి-గ్రేడ్’ కామెడీగా మిగిలిపోయింది… ఆ వీడియో క్లిప్స్ చూస్తే మీ రోజంతా నవ్వులతో గడిచిపోవడం గ్యారెంటీ!



Pakistani reply to Dhurandhar 😭😭
Wtff budget. pic.twitter.com/puH51U8UGV

— Wellu (@Wellutwt) April 15, 2026



Secretary of RAW and Director of RAW are discussing how Indian govt is forcing them to destabilize Pakistan through terrorism

Secretary of RAW says that without destabilizing Pakistan, India might fall apart

This is a Pakistani show answer to Dhurandhar pic.twitter.com/v0iYTRR63K

— Tushar ॐ♫₹ (@Tushar_KN) April 17, 2026



Operation sindoor mentioned 😂 pic.twitter.com/CZutn8qyT1

— Wellu (@Wellutwt) April 15, 2026



సోర్స్ & సౌజన్యం … dnaindia

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • B-Grade Reply… దురంధర్‌కు కౌంటర్ కొట్టబోయి పాకిస్థానీలు నవ్వులపాలు..!!
  • … ఇంతకీ హీరో శోభన్ బాబు చేసింది నేరమా..? న్యాయమా..?
  • సినిమా తీసేవాడికి చూసేవాడు లోకువ… బ్యాడ్ బాయ్ నాగశౌర్య…
  • పాపం ప్రతాప్… పాపం ప్రేక్షకుడు… టైటిల్ జస్టిఫికేషన్ ఎవరికి..?!
  • రాహుల్ గాంధీ పోటీ చేయలేడా ఇక…? పౌరసత్వానికే ముప్పుందా..?
  • ఈ ఇద్దరు… మొన్న బ్లాక్ బస్టర్స్… నిన్న ఫ్లాప్ షో…
  • ఐపీఎల్ 2026 : పాత దోస్తులు – కొత్త శత్రువులు… పంత్ & శ్రేయాస్…
  • వైఎస్ మార్క్ లిబరల్..! కొత్త రేవంత్ రెడ్డి కనిపిస్తున్నాడు ఈమధ్య..!!
  • ఇప్పుడైతే శోభన మోహన్‌బాబును మూడు చెరువుల నీళ్లు తాగించేది..!!
  • ది మిస్ ఫిట్..! ఆంటోనీ రాజు మంత్రి పదవి ఊడబీకిన ‘అండర్ వేర్’…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions