.
ప్రకాష్ ఆంటోనీ రాజ్ అనబడు వ్యక్తి… క్రిస్టియన్ ఎథిస్ట్… ఎప్పటిలాగే హిందూ ధర్మం మీద, రామాయణం మీద, సీతారాముల మీద,… ఉత్తరాది నుంచి వచ్చిన వలస కూలీలంటూ… నానా చెత్త వ్యాఖ్యలూ చేశాడు… అదేదో సినిమాలో చెప్పినట్టు వాడు చెత్త నటుడు మాత్రమే కాదు, చెత్త మనిషి అనుకుందాం… మనిషి అనే పదం కూడా అక్కడ అవసరం లేదు…
ఎందుకంటే… తను పక్కా హిందూ ద్వేషి.,. తనని ఈ కోణంలో అభిమానించే వాళ్లూ కోకొల్లలు… రాజమౌళి వంటి నాస్తిక దర్శకులు కూడా తనకు అవకాశాలు ఇస్తూనే ఉంటారు, ఒకవైపు రాముడిని క్యాష్ చేసుకునే వారణాసి అనే సినిమాలతో…!
Ads
https://www.facebook.com/reel/953794980628427
అర్ధజ్ఞానమో, పావుజ్జానమో ఉన్నా సరే… కోవా బన్ అనే ప్రేమ చూపించినా సరే… ది గ్రేట్ ఏపీ డిప్యూటీ సీఎం, చంద్రబాబు అత్యంత అనుంగు సహచరుడు, సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కల్యాణ్ సోదరుడు, సో కాల్డ్ నాగబాబు ఈ ప్రకాష్ రాజ్ దుర్వాఖ్యలపై ఏదో స్పందించాడు…, రేయ్, నీలాంటి సంస్కార రహితుల జోలికి ఇక రాను అన్నట్టు ఏదో ట్వీటాడు… నిజానికి బండి సంజయ్ సహా ఏపీ, తెలంగాణ వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలెవ్వరికీ ఈమాత్రం స్పందన లేదు… అది వదిలేద్దాం…
సీన్ కట్ చేస్తే… ఇదే ప్రకాష్ రాజ్ ఏమన్నాడో తెలుసా..? తను అన్ని ధర్మాలనూ ప్రేమిస్తాడట… తను ఏదో సాహితీ కార్యక్రమంలో ప్రవచించిన తన మాటల్ని వక్రీకరిస్తున్నారట… హిందూ ధర్మాన్ని అస్సలు అవమానించలేదట, అవసరం లేదట… మతోన్మాదానికి ధర్మాన్ని అడ్డుపెట్టుకుని అసహ్యమైన రాజకీయం చేస్తున్నవారిని ప్రశ్నిస్తున్నాడట… వాళ్ల ఏడుపు, వాళ్ల కష్టం అర్థమవుతోందిట…
https://www.facebook.com/reel/942538735052082
తమిళనాడు ఎన్నికల్లో బాగా బిజీ అట… త్వరలో తప్పకుండా వస్తాడట, ఇలాగే వాగుతారా, మీ ఇష్టం, తరువాత సమాధానం చెబుతాను… నేను సారీ చెప్పేదేమీ లేదట.,. నాగబాబూ, ఇక జవాబు చెప్పు..? మీ సినిమా వాడే, మీరంతా నెత్తిన మోసినవారే… తెలంగాణ మీద ఏడ్చే ఓ తేజస్వి సూర్యా… మీవాడేనట ఈ కన్నడిగుడు… ఎందుకు కనిపించడు..!!
ప్రాంతీయ ఆకాంక్షల మీద ఏడ్వడం కాదు నాయనా… ఇదుగో వీళ్లకు కదా సమాధానం ఇవ్వాల్సింది..? కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం కదా, పట్టించుకోరు… మరి మీకేమైంది నాయనా…!! ధర్మాన్ని అడ్డుపెట్టుకుని మతోన్మాదాన్ని ప్రదర్శిస్తున్నారట… నిన్నే ప్రకాష్ రాజ్ తిట్టిపోస్తున్నది..!!
Share this Article