.
Pardha Saradhi Upadrasta …. మహిళా రిజర్వేషన్ vs Delimitation అసలు కనెక్షన్ ఏమిటి?
చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఇదే.
“543 సీట్లలోనే 33% మహిళా రిజర్వేషన్ ఇప్పుడే ఎందుకు ఇవ్వకూడదు?”
ఇది ఒక లాజిక్ ఉన్న ప్రశ్నే. కానీ చట్టపరంగా, రాజ్యాంగ పరంగా విషయం కొంచెం వేరు.
అది తెలియాలి అంటే మహిళా రిజర్వేషన్ & Delimitation , లోతుగా అర్థం చేసుకోవాలి.
1) అసలు 543 సీట్లు ఎలా ఫిక్స్ అయ్యాయి?
లోక్‌సభ సీట్లు (543) అనేవి తాజా జనాభా ఆధారంగా నిర్ణయించబడినవి కావు. 1970లలో, ముఖ్యంగా జనాభా నియంత్రణ చర్యలు తీసుకున్న రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఉండేందుకు, seat redistribution ను ఫ్రీజ్ చేశారు. ఈ ఫ్రీజ్‌ను తరువాతి సవరణలతో 2026 వరకు కొనసాగించారు. దక్షిణ రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను కఠినంగా అమలు చేసినప్పుడు, ఉత్తర రాష్ట్రాల్లో జనాభా వేగంగా పెరిగింది. వెంటనే సీట్లు జనాభా ఆధారంగా పంచితే, జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోతాయి అందుకే ఈ ఫ్రీజ్ తీసుకువచ్చారు. అంటే 543 అనే నంబర్ 50 ఏళ్ల క్రితం fix చేశారు. తరువాత ఎన్నో మారాయి.
Ads
2) Delimitation అంటే ఏమిటి?
Delimitation అంటే నియోజకవర్గాలను జనాభా ఆధారంగా మళ్లీ సంఖ్యను, స్థానాలను రూపొందించడం. దీని వల్ల ప్రతి ఎంపీ ప్రాతినిధ్యం వహించే ప్రజల సంఖ్య సమానంగా ఉండేలా ప్రయత్నిస్తారు. అవసరమైతే మొత్తం సీట్ల సంఖ్య కూడా పెరగొచ్చు (ఉదాహరణకు 543 నుండి 800+ లేదా అంతకంటే ఎక్కువ). అదే సమయంలో SC/ST రిజర్వేషన్ సీట్లు కూడా కొత్తగా లెక్కించబడతాయి. ఈ ప్రక్రియ లేకపోతే, ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యం అసమానంగా మారుతుంది. వీటన్నిటికి మధ్య మహిళా రిజర్వేషన్లు అంటూ కొత్త లేయర్ వచ్చింది.
3) 2023 మహిళా రిజర్వేషన్ చట్టం ఎందుకు Delimitation కి లింక్?
2023 మహిళా రిజర్వేషన్ చట్టం స్పష్టంగా ఒక సీక్వెన్స్‌ను సూచిస్తుంది: ముందుగా జనాభా గణన (Census), తర్వాత Delimitation, ఆ తరువాత మాత్రమే మహిళలకు 33% రిజర్వేషన్ అమలు. దీని వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే ముందు కొత్త సీట్ల సంఖ్య నిర్ణయించాలి, రాష్ట్రాల వాటాను ఫిక్స్ చేయాలి, SC/ST కోటాలను సరిచేయాలి. ఈ మొత్తం స్ట్రక్చర్ సిద్ధమైన తర్వాతే మహిళా రిజర్వేషన్ ఇవ్వాలి. లేకపోతే పాత మ్యాప్ మీద కొత్త రిజర్వేషన్ అమలు చేసినట్లవుతుంది.
543 పాత నంబర్ అయినప్పుడు దాని మీద కొత్త రిజర్వేషన్లు ఇచ్చి ఏమి ప్రయోజనం ? దీనికి ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి. 2023 లో ఈ బిల్లును అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. అంటే ఆ రోజునే మహిళా రిజర్వేషన్లకు డిలిమిటేషన్ కు లింక్ ఉంది, దాన్ని ప్రతిపక్షాలు వొప్పుకున్నాయి కూడా.
4) “ఇప్పుడే 543లో ఇస్తే?” — సమస్యలు
ప్రస్తుత 543 సీట్లలోనే రిజర్వేషన్ అమలు చేస్తే అనేక అసమానతలు వస్తాయి. కొన్ని రాష్ట్రాల్లో ఒక ఎంపీ 15 లక్షల ప్రజలను ప్రాతినిధ్యం వహిస్తుంటే, మరికొన్ని రాష్ట్రాల్లో అదే సంఖ్య 30 లక్షల వరకు ఉంది. అంటే representation imbalance ఇప్పటికే ఉంది. ఉదాహరణకు తెలంగాణలోని మల్కాజిగిరి నియోజకవర్గం దేశంలో పెద్ద జనాభా ఉన్న నియోజకవర్గం. లెక్క ప్రకారం దాన్ని 2, 3 గా విడగొట్టి హద్దులు మార్చాలి. ఇలా దేశంలో ఎన్నో.
అలాగే రాష్ట్రాల మధ్య రాజకీయ సమతుల్యత దెబ్బతింటుంది . ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు తక్కువ సీట్లు, తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ ప్రభావం ఉంటుంది. SC/ST రిజర్వేషన్లలో కూడా అసమానతలు ఏర్పడతాయి. ఇవన్నీ కలిపి ఇది చట్టపరంగా కూడా సవాలు అయ్యే అవకాశం ఉంది. అసలు 2023 లోనే అంతా డిలిమిటేషన్ తరువాతే మహిళా రిజర్వేషన్లు అని ఒప్పుకున్నారు. ఇప్పుడు మీద మళ్ళీ 543 మీద మహిళా రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వరు అనే వాదన అసంబద్ధం .
ఏ కొత్త అయినా కొత్త లెక్క మీదనే వుండాలి.
5) ప్రభుత్వం ముందు రెండు ఆప్షన్లు
Option 1 — 2023 చట్టం ప్రకారం ముందుకు వెళ్లడం: ముందుగా 2027 తర్వాత జనాభా గణన పూర్తి చేయాలి, తర్వాత Delimitation చేసి కొత్త సీట్ల నిర్మాణం తీసుకురావాలి, ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి. ఇది ఎక్కువ సమయం తీసుకున్నా, చట్టపరంగా, నిర్మాణాత్మకంగా సురక్షితమైన మార్గం. కాకపోతే ఇది 2034 దాకా సాగుతుంది.
Option 2 — ఫాస్ట్ ట్రాక్ రాజకీయ మార్గం: ప్రభుత్వం 2034 దాకా ఆగటం ఎందుకు, ఇప్పుడే ఒక ప్రయత్నం చేద్దాం అని ఒక ప్రయత్నం మొదలు పెట్టింది. వెంటనే Delimitation చేసి, proportionate గా సీట్ల సంఖ్యను పెంచి (ఉదాహరణకు 815 వరకు), ఆ కొత్త నియోజకవర్గాల్లో 2011 జనాభా ప్రకారం మహిళలు , SC/STలకు రిజర్వేషన్లు అమలు చేయడం. ఇలాగైతే 2029 లోనే మహిళా రిజర్వేషన్లు అమలులోకి వస్తాయి.
ఒకసారి మళ్ళీ 2027 జనాభా లెక్కలు వచ్చాక ఆ 815 అలాగే ఉంచి కొత్త జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఇంటర్నల్ గా హద్దులు, రిజర్వేషన్లు, మళ్ళీ చిన్న చిన్న మార్పులు చేయవచ్చు. 2008 లో చేసింది అదే. 2008 లో సీట్లు పెంచలేదు. ఉన్న నియోజకవర్గ హద్దులు అటు ఇటూ మార్చారు. ఇలాంటి ఎక్సర్సైజ్ ఎప్పుడూ దశల వారీగా జరుగుతుంది.
6) Final clarity (no confusion)
543 సీట్లు అనేవి outdated representation structure. మహిళా రిజర్వేషన్ వంటి పెద్ద మార్పులు future population ఆధారంగా ఉండే కొత్త మ్యాప్‌పై అమలు చేయాలి. అందుకే Delimitation తర్వాత అమలు చేయడం balanced, legally safe, politically structured విధానం అవుతుంది. .
543 అనేది పాత మ్యాప్. రిజర్వేషన్ అనేది కొత్త మ్యాప్‌పై అమలు కావాలి. Delimitation లేకుండా మహిళా రిజర్వేషన్ ఇవ్వడం అంటే అసమాన ప్రజాస్వామ్యాన్ని నిర్మించడం. ఆలస్యం ఉన్నా నిర్మాణం బలంగా ఉండాలి , అదే దీని సారాంశం.
అందుకే 2023 చట్టంలో క్లియర్‌గా చెప్పారు. ముందు డిలిమిటేషన్, అప్పటికి అందుబాటులో ఉన్న తాజా జనాభా ప్రకారం రిజర్వేషన్లు. దీనిలో అనుమానాలు ఉండాల్సిన పని లేదు. ప్రతిపక్షాలు 2023 లోనే వాటి గురించి ఒప్పుకున్నాయి.
2029 లోనే అమలులోకి తెద్దాం అనే ప్రయత్నం మొన్న కేంద్రం చేసింది. ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి.
2034 లో అవుతాయి కానీ 2027 delimitation exercise ను ప్రతిపక్షాలు సరిగా జరగనిస్తాయా అనేది సందేహమే… అందుకే ముందు proportionate గా పెంచుదాం, తరువాత realignment చేద్దాం అనే ప్రయత్నం కేంద్రం మొన్న చేసింది… —– ఉపద్రష్ట పార్ధసారధి
Share this Article