.
ఏదో భారీ తేడా కొడుతోంది హరీష్ భాయ్…! నీ పేరంటేనే బీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్… నువ్వే భారీ ట్రబుల్స్‌లో ఇరుక్కుని, నువ్వు నమ్మిన నీ మామ పార్టీలో కత్తెరకు గురవుతున్నట్టు ఏదో భారీ తేడా కొడుతోంది హరీష్ భాయ్… ఉన్నయ్, కారణాలున్నయ్… కొన్నాళ్లుగా నీకు పార్టీపరంగా కత్తెర పడుతున్నట్టు సూచనలున్నయ్…
ఇప్పుడేమో… నీ మామ రీఎంట్రీ పేరిట, జైత్రయాత్ర పేరిట, జనగర్జన పేరిట, దండయాత్ర పేరిట నిర్వహించదలిచిన జగిత్యాల సభకు… అదీ వార్షిక ప్లీనరీలను కూడా బలిపెట్టి మరీ నిర్వహిస్తున్న ఈ సభకు నిన్ను అవాయిడ్ చేయడం ఏమిటి..? నిన్ను కావాలని దూరంగా పంపించడం ఏమిటి..? బీఆర్ఎస్ చరిత్రలో హరీష్ రావు లేని ముఖ్య సభ, కార్యక్రమం జరిగిందా..? ఇదే తొలిసారి… కానీ ఎందుకు..?
Ads
ఏదో పేరుకు పైపైన కవరింగుగా ఏదో చెబుతున్నారు… కాళేశ్వరం కేసు గురించి చర్చించేందుకు ఢిల్లీ వెళ్లాడు అని..! అదీ కేసీయార్ ఆదేశాలతోనట… అక్కడొస్తున్నది అసలు సందేహం… ఎందుకంటే..? పింక్ క్యాంప్ కవరింగ్ క్యాంపులో కాళేశ్వరమే కాదు… పార్టీ ఫిరాయింపుల కేసు చర్చకు కూడానట… అంత అర్జెంటుగా ఏ కోర్టు రమ్మన్నది, ఏ లాయర్ రమ్మన్నాడు తనను..!! అదీ దిగ్రేట్ తెలంగాణ తాజా ఆశాకిరణం జీవన్ రెడ్డి సభను వదిలేసి..!!

- కాళేశ్వరం కేసుపై ఎల్లుండి హైకోర్టు తీర్పు… మరి ఈరోజే అర్జెంటుగా వెళ్లి న్యాయవాదులతో చర్చించేది ఏముంటుంది..?
- ఎల్లుండి గనుక నెగెటివ్ తీర్పు వస్తే, సుప్రీంకోర్టుకు వెళ్లడానికి చాలా టైమ్ ఉంటుంది, మరి అర్జెంటుగా ఈరోజే వెళ్లి చర్చించేది ఏముంటుంది..?
- తనతోపాటు మాజీ ఎంపీ వినోద్, ప్రస్తుత ఎంపీ వద్దిరాజును కూడా పంపించాడట కేసీయార్… దేేనికి..? ఏమిటి డౌటనుమానం..? బీజేపీతో టచ్‌లోకి వెళ్తున్నాడనా..? తన కత్తెర ప్రోగ్రాం హరీష్‌కు అర్థమై పోయింది కనుకా..?

ఐనా ఢిల్లీలో ఇప్పుడు బీజేపీ పార్టీ కొత్త అధ్యక్షుడు సహా మోడీ, అమిత్ షా అందరూ బెంగాల్‌లో తిష్ట వేశారు, అక్క అంతు చూడటానికి… నీతో ఎవరు మాట్లాడటానికి ఎవరున్నారు అక్కడ..!? మరెందుకు వెళ్తున్నట్టు…?
- జగిత్యాల సభ బీఆర్ఎస్ సభ కాదు, అది జీవన్ రెడ్డి సభ… కొప్పుల ఈశ్వర్ తదితరులతో తను ఆర్గనైజ్ చేసుకుంటున్నాడు… తను హరీష్ జోక్యం వద్దన్నాడా..? అందుకే ఫార్మల్‌గా జీవన్‌రెడ్డిని ఆహ్వానించడానికి కేటీయార్ జగిత్యాల వెళ్లినప్పుడు కేటీయార్ తనను అవాయిడ్ చేశాడా కావాలనే…
- ఇప్పుడు కూడా హరీష్ రావు జోక్యం లేని సభ కావాలని జీవన్ రెడ్డి కోరుకున్నాడా..? ఆల్రెడీ కత్తెర పెట్టబడుతున్నాడు కాబట్టి కేసీయార్ దానికి వోకే చెప్పాడా..? అంటే హరీష్ రావు ఎగ్జిట్ డోర్లు ఓపెన్ అయ్యాయా..?
- దొరతనంలో నావాడు, పరాయివాడు అని ఏమీ ఉండదు… ఎప్పటికప్పుడు ఎవరు అవసరమో అంతే… కేటీయార్ వారసత్వానికి ప్రధాన అడ్డంకులుగా పరిగణించబడే కవిత, హరీష్ రావులను కేసీయార్ కావాలనే తొలగిస్తున్నాడా..?
- కేటీయార్ వారసత్వ మార్గంలో బుష్ క్లియరెన్స్, జంగిల్ క్లియరెన్స్ సాగుతోందా..? హరీష్ రావుకు ఎగ్జిట్ గేట్ చూపించడమేనా ఇది… అందుకే కిక్కుమనకుండా ఢిల్లీ ఫ్లయిట్ ఎక్కడా…?

సొంత బిడ్డ కవిత… మద్యం స్కాంలో క్లీన్ చిట్ వచ్చింది… ఎంతైనా సొంత నెత్తురు, తనకు హరీష్ రావు పడటం లేదు… సో, హరీష్ రావును తరిమేసి, కవితను చేరదీసి…. కేసీయార్ ఏదో కొత్త చాణక్యం ఆలోచిస్తున్నాడా..?
జనం లేదు, జనంలోకి వచ్చేది లేదు, జనం సమస్యల్లేవు, పట్టింపు లేదు… ఇదుగో ఇలా… మగ వారసత్వం, అడ్డంకుల్లేకుండా ప్రధాన కేరక్టర్లను కత్తిరించే పనిలో పడ్డాడా ఫామ్ హౌజ్ దొరవారు..!! కాలమే జవాబు చెప్పాలి… లేదా హరీష్ రావు చెప్పాలి..!!
….. చివరగా… ఒక భాషలో చెప్పాలంటే… హరీష్ రావు హెచ్చించబడటం లేదు, తగ్గించబడుతుండెను… ప్రజా ఆశీర్వాదానికి దిష్టిగా తీయబడుతున్నాడా..?
Share this Article