.
Pardha Saradhi Upadrasta …. పశ్చిమ దేశాలు ఇన్సూరెన్స్ నిలిపేస్తే… భారత్ తనదైన సిస్టమ్‌తో కౌంటర్ ఇచ్చింది! ప్రపంచంలో జియోపాలిటికల్ టెన్షన్స్ పెరిగినప్పుడు, మొదటగా దెబ్బతినేది నౌకా వాణిజ్యం. . చాలా వరకు గ్లోబల్ సముద్ర మార్గ ఇన్సూరెన్స్ మార్కెట్ పశ్చిమ దేశాల చేతుల్లో ఉండటంతో, వారు రిస్క్ ఎక్కువగా ఉందని చెప్పి కవరేజ్ తగ్గించడం లేదా ప్రీమియంలను భారీగా పెంచడం ప్రారంభించారు. ఈ పరిస్థితిలో భారత్ తీసుకున్న స్ట్రాటజిక్ నిర్ణయం Bharat Maritime Insurance Pool (BMIP)
BMIP అంటే ఏమిటి? ఇది ఒక సార్వభౌమ మద్దతు ఉన్న (Government-backed) సముద్ర మార్గ ఇన్సూరెన్స్ వ్యవస్థ. భారత ప్రభుత్వం సుమారు ₹12,980 కోట్ల గ్యారంటీతో ఈ పూల్‌ను ఏర్పాటు చేసింది. అంటే ఎలాంటి క్లెయిమ్ వచ్చినా, చివరికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది., బయట దేశాల నిర్ణయాలు మన వాణిజ్యాన్ని ప్రభావితం చేయవు.
Ads
ఎందుకు ఇది అత్యవసరం? గ్లోబల్ షిప్పింగ్ ఇన్సూరెన్స్‌లో ప్రధానంగా పశ్చిమ కంపెనీలు ఆధిపత్యం కలిగి ఉన్నాయి. ఉదాహరణకు… యుద్ధ పరిస్థితులు వచ్చినప్పుడు, ఆంక్షలు విధించినప్పుడు, రిస్క్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాణిజ్యం చేసినప్పుడు ఈ కంపెనీలు మొదటగా War Risk Insurance తీసేస్తాయి లేదా ప్రీమియంలను 2x– 5x వరకు పెంచేస్తాయి
దీంతో ఏమవుతుంది? నౌకలు ప్రయాణం చేయలేవు, కార్గో నిలిచిపోతుంది, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది
BMIP కవరేజ్ లో ఏముంటుంది? BMIP పూర్తి స్థాయి 360° మెరైన్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది:
✔️ Hull & Machinery – నౌక , యంత్రాల రక్షణ
✔️ Cargo Insurance – సరుకు రక్షణ
✔️ Protection & Indemnity (P&I) – థర్డ్ పార్టీ లయబిలిటీస్
✔️ War Risk Insurance – యుద్ధ పరిస్థితుల్లో కూడా కవరేజ్
ముఖ్యంగా యుద్ధ Risk కవరేజ్ ఉండటం ఈ స్కీమ్‌లో గేమ్ ఛేంజర్.
సార్వభౌమ గ్యారంటీ అంటే ఏమిటి?
ఇది BMIPలో అత్యంత శక్తివంతమైన అంశం. ఇది ప్రైవేట్ ఇన్సూరర్ కాదు, ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది
అంటే, సాంక్షన్లు వచ్చినా కవరేజ్ కొనసాగుతుంది, విదేశీ ఒత్తిడి పనిచేయదు, క్లెయిమ్స్ ఖచ్చితంగా సెటిల్ అవుతాయి
భారత్‌కు లాభం ఏమిటి? ట్రేడ్ కంటిన్యూయిటీ – ఎలాంటి గ్లోబల్ క్రైసిస్ వచ్చినా ఎగుమతులు/దిగుమతులు ఆగవు
స్ట్రాటజిక్ ఇండిపెండెన్స్ – పశ్చిమ దేశాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది
కాస్ట్ కంట్రోల్ – ప్రీమియంలు స్థిరంగా ఉంటాయి
జియోపాలిటికల్ లీవరేజ్ – భారత్ తన నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోగలదు. ఇప్పుడు కొన్ని నిర్ణయాలు గ్లోబల్ ఆంక్షల మీద ఆధారపడి తీసుకోవలసి వస్తోంది.
ఇది కేవలం ఇన్సూరెన్స్ స్కీమ్ కాదు, ఇది Atmanirbhar Bharat లో ఒక కీలక అడుగు. ఫైనాన్స్, ట్రేడ్, షిప్పింగ్—all sectors లో స్వయం సమృద్ధి
“Global rules follow చేయడం కాదు rules shape చేయడం ప్రారంభించింది భారత్…”
ఒక లైన్‌లో….: Insurance weapon గా ఉపయోగించినప్పుడు, భారత్ తన సొంత shield నిర్మించుకుంది. — ఉపద్రష్ట పార్ధసారధి
#India #BMIP #MaritimePower #AtmanirbharBharat #GlobalTrade #Shipping #Geopolitics
Share this Article