.
క్రికెట్ పిచ్‌పై సిక్సర్ల వర్షం కురిపించే యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ వ్యక్తిగత జీవితం సినిమాని తలపించే మలుపులతో సాగింది… ఒకవైపు కెరీర్‌లో అద్భుతమైన ఎదుగుదల, మరోవైపు ఊహించని విషాదం… ఈ రెండింటి మధ్య సాగిన ఆయన ప్రయాణం ఇప్పుడు కొత్త వెలుగులోకి వచ్చింది…
చీకటి నీడలు: తానియా సింగ్ మరణం …. అభిషేక్ శర్మ జీవితంలో 2024 ఆరంభం తీవ్ర విషాదాన్ని నింపింది… మోడల్ తానియా సింగ్‌తో ఆయనకున్న అనుబంధం అందరికీ తెలిసిందే… అయితే, ఫిబ్రవరి 2024లో ఆమె ఆత్మహత్య చేసుకోవడం క్రీడా లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది…
Ads
ఈ కేసులో పోలీసులు అభిషేక్‌ను విచారించడం, ఆయన మానసిక ఒత్తిడికి లోనవ్వడం వంటి ఘటనలు ఆయన వ్యక్తిగత జీవితంపై మాయని మచ్చలా మిగిలాయి… ఆ సమయంలో అభిషేక్ తీవ్రమైన విషాదంలో మునిగిపోయారు…
కొత్త ఆశలు: లైలా ఫైసల్ పరిచయం… ఆ చీకటి రోజుల నుండి కోలుకుంటున్న సమయంలో, అభిషేక్ జీవితంలోకి లైలా ఫైసల్ ప్రవేశించింది… ఢిల్లీకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అయిన లైలాతో అభిషేక్ స్నేహం నెమ్మదిగా బలపడింది…
కుటుంబంతో సాన్నిహిత్యం….: అభిషేక్ సోదరి కోమల్ శర్మ వివాహ వేడుకల్లో లైలా సందడి చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది… కుటుంబ సభ్యులతో ఆమె కలిసిపోయిన తీరు చూసి, వీరిద్దరి మధ్య స్నేహానికి మించిన బంధం ఉందని అభిమానులు ఫిక్స్ అయ్యారు…
ప్రోత్సాహం…: మైదానంలో అభిషేక్ సెంచరీ బాదినప్పుడు లైలా సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్‌లు, వీరిద్దరూ కలిసి వెకేషన్లకు వెళ్లడం వంటివి అభిషేక్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని సూచిస్తున్నాయి. గతంలోని చేదు జ్ఞాపకాలను వెనక్కి నెట్టి, లైలా అండతో అభిషేక్ మళ్ళీ కెరీర్‌పై దృష్టి సారించాడు…
ప్రస్తుతం వీరిద్దరూ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా, వీరి ‘సోషల్ కెమిస్ట్రీ’ మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్…. నో, నో, కావ్యా మారన్… వదిలెయ్, ఆశలు పెంచుకోకు… తను ఆల్రెడీ కమిటెడ్..!!
Share this Article