.
- ‘‘నేతల గదుల్లోకి వెళ్లకుండా (అర్థమైంది కదా) 90 శాతం మంది మహిళలు రాజకీయాలు చేయలేరు, రాజకీయ నాయకుల సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అదే తెలుస్తుంది… ఇదొక సంస్కృతిగా మారింది… లోకసభ, విధానసభల్లో మహిళల్ని రాబందుల్లా మిటకరించి చూస్తారు, 75 శాతం మంది ఫోన్లలో అశ్లీల చిత్రాలు చూస్తారు, మొబైళ్లు చెక్ చేయండి, అన్నీ అవే కనిపిస్తాయి… నాపై అనర్హత వేటు అంటున్న మహిళ కమిషన్ సభ్యులు కూడా రాజకీయ నేతలతో ఏ ఫోజుల్లో ఉంటారో నా దగ్గర ఆధారాలున్నాయి’’
…. కాంగ్రెస్ పార్టీ మద్దతున్న బీహార్ ఎంపీ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ రోత, వెగటు, గలీజు, విషపు వ్యాఖ్యానాలు ఇవి… ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న ప్రతి మహిళనూ కించపరిచేవి… ఒకవైపు మహిళ రిజర్వేషన్ల మీద రచ్చ జరుగుతుంటే… ఇదీ కొందరు మగ పురుష్ ఎంపీల పోకడ… దారుణం, రాజకీయాల్లో మరీ దిగజారుడుతనం…
బీజేపీ ఖండించింది… బీహార్ మహిళ కమిషన్ నోటీసులు జారీ చేసింది… జాతీయ మహిళ కమిషన్ ఖండించింది… లోకసభ స్పీకర్ తనపై అనర్హత వేటు వేయాలని చాలామంది నేతలు డిమాండ్ చేస్తున్నారు… నిజానికి ఎవడు ఈ పప్పూ యాదవ్..? ఓ గ్యాంగ్‌స్టర్…
Ads
2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం తనపై 41 పెండింగ్ కేసులు ఉన్నాయి… వాటిలో కొన్ని ప్రధానమైనవి… 1998లో సీపీఎం (CPM) ఎమ్మెల్యే అజిత్ సర్కార్ హత్య కేసులో పప్పు యాదవ్ ప్రధాన నిందితుడు… ఈ కేసులో 2008లో కింది కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది… దీనివల్ల ఆయన కొన్నాళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు… అయితే, 2013లో పాట్నా హైకోర్టు ఆధారాలు సరిగ్గా లేవని నిర్దోషిగా విడుదల (Acquitted) చేసింది…
1995లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పురూలియా ఆయుధాల కేసులో ప్రధాన నిందితుడు కిమ్ డేవీని, భారతదేశం నుంచి తప్పించుకోవడానికి పప్పు యాదవ్ సహాయం చేశాడు… ఈరోజుకూ ఆ కేసు మిస్టరీ వీడలేదు… చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఒక పాత కేసు (సుమారు 31 ఏళ్ల క్రితం నాటి ఫోర్జరీ కేసు) విషయంలో కోర్టుకు హాజరు కాకపోవడంతో, 2026 ఫిబ్రవరిలో పాట్నా పోలీసులు అరెస్ట్ చేశాడు ఇటీవల…
41 కేసుల్లో ఈ క్రింది సెక్షన్ల కింద ఆరోపణలు ఉన్నాయి… హత్యాయత్నం (Attempt to murder), కిడ్నాపింగ్ (Kidnapping), దోపిడీ, బెదిరింపులు (Extortion & Criminal Intimidation), ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, రైటింగ్ (Rioting), చట్టవిరుద్ధమైన సమావేశాలు నిర్వహించడం… జైలులో ఉన్న సమయంలో కూడా సెల్ ఫోన్లు వాడటం, అక్కడే దర్బార్ నిర్వహించడం వంటివి అప్పట్లో పెద్ద వివాదాలకు దారితీశాయి….
1990లో బీహార్‌లోని సింగేశ్వర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మొదటిసారి అసెంబ్లీకి (ఎమ్మెల్యేగా) ఎన్నిక… 1991లో పూర్ణియా నియోజకవర్గం నుండి మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేసి మొదటిసారి ఎంపీగా గెలుపు… ఆ తర్వాత సమాజ్ వాదీ పార్టీ (SP) నుంచి 1996లో తరపున ఎంపీ… రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నుంచి 2004, 2014లలో ఎంపీ… జన్ అధికార్ పార్టీ (JAP) పేరిట 2015లో తన సొంత పార్టీని స్థాపించుకుని, తరువాత దీన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశాడు… 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో పూర్ణియా నుండి మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగానే గెలిచాడు…
ఇవే, ఈ పార్టీలే మొదటి నుంచీ మహిళ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ, అడ్డుకుంటూ వస్తున్నాయి… నేరగాళ్లను రాజకీయాల్లోకి తీసుకొచ్చి భ్రష్టుపట్టించినవి కూడా ఈ పార్టీలే… ప్రత్యేకించి ఆర్జేడీ, ఎస్పీ… ఇలాంటి గ్యాంగ్‌స్టర్లకు కాంగ్రెస్ కూడా మద్దతు… మహిళా రాజకీయ నాయకులపై వీడి చెత్త వ్యాఖ్యలను ఈ పార్టీలు ఖండించలేదు… ఇప్పుడు అత్యంత కీలక పదవుల్లో కూడా మహిళ నాయకులున్నారు, ఆ పదవులకే శోభ తీసుకొస్తున్నారు… అందరినీ కించపరిచినట్టే… సో, వీడిపై అనర్హత వేటు వేయడమే కరెక్టు…
- చివరగా… వీడి భార్య రంజీత్ రంజన్ కూడా రాజకీయాల్లోనే ఉంది… రాజ్యసభ సభ్యురాలు… గతంలో లోకసభకు కూడా ఎన్నికైంది…
- లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వీడిని టార్గెట్ చేశాక… నేను నా భర్తతో రెండేళ్లుగా దూరంగా, విడిగా ఉంటున్నాను అని ప్రకటించింది ఆమె…
Share this Article