Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తోపులు కాదు, తుప్పాసులు… కోట్లకుకోట్లు పెట్టి కొన్నాను కదరా…

April 23, 2026 by M S R

.

సంజీవ్ గోయెంకా… లక్నో సూపర్ జెయింట్ ఐపీఎల్ టీమ్ ఓనర్… వేల కోట్ల ఆర్థిక సామ్రాజ్యం RPSG గ్రూపు కంపెనీల ఓనర్… బిజీ బిజీ షెడ్యూళ్లు… కంపెనీల వ్యవహారాలు… ఐనా ప్రతి ఐపీఎల్ మ్యాచుకు వస్తాడు… తమ జట్టు ఆటతీరు చూస్తూ ఆనందిస్తాడు, చింతిస్తాడు, హతాశుడవుతాడు… కావ్య మారన్‌లాగే రకరకాల ఉద్వేగాలు ప్రదర్శిస్తుంటాడు…

అంతేకాదు, జట్టు ఆటగాళ్లపై అరుస్తుంటాడు కూడా… ఈసారి ఐపీఎల్ సీజన్‌లో ఈ జట్టు ఆటతీరు చూస్తుంటే… ఓనర్ వాళ్లపై అరవడంలో ఏమాత్రం తప్పులేదనిపిస్తుంది… కెప్టెన్ రిషబ్ పంత్ 27 కోట్ల ప్లేయర్, నికోలస్ పూరన్ 21 కోట్ల ప్లేయర్… అత్యంత పేలవమైన ఆట… నిన్నటి మ్యాచే చూడండి… బ్యాటర్ల పిచ్ గాకుండా ఫ్లాట్ పిచ్ తయారు చేశారు… లక్నో బౌలర్లు కాస్తో కూస్తో కష్టపడి రాజస్థాన్ రాయల్స్‌ను 159 పరుగులకు కట్టడి చేశారు, రవీంద్ర జడేజా చివరలో కాస్త విజృంభించడంతో ఆ స్కోరైనా దక్కింది…

Ads

కాకపోతే ఇలాంటి జీవం లేని పిచ్‌ల మీద వికెట్ కాపాడుకుంటూ ఎలా పరుగులు చేయాలో రవీంద్ర జడేజాలోని సీనియర్ ఎక్స్‌పీరియెన్స్‌డ్ ప్లేయర్ ఆడి చూపించాడు… ఇంత తక్కువ స్కోర్‌ను లక్నో సులభంగా చేధించాలి కదా… కానీ ఏం లాభం..? నలుగురు డకౌట్… పెద్ద పెద్ద తోపులు అనుకున్న ఖరీదైన ఆటగాళ్లు పంత్, బడోనీ, మార్క్‌రమ్ వరుసగా డకౌట్లు… ఒక దశలో 11 పరుగులకు 3 వికెట్లు… కీలకమైన దశలో బాధ్యతగా బ్యాటింగ్ చేయాల్సిన పూరన్ 22 కొట్టి ఔట్… ఒక్క మార్ష్ తప్ప శ్రద్ధగా ఆడిన ప్లేయరే లేడు…

చివరకు 18 ఓవర్లలోనే 119 పరుగులకు ఆలౌట్… మరిక గోయెంకా అరుస్తున్నాడంటే తప్పేముంది..? ప్రస్తుతం 10 జట్లలో అత్యంత దయనీయమైన రన్‌రేట్ ఉన్న లాస్ట్ జట్టు ఇదే… కోల్‌కత్తా టీమ్‌ను పట్టించుకునేవాడు లేడు, పాయింట్స్ టేబుల్‌లో లీస్ట్ టెన్ ప్లేసు దానిది… మరి లక్నోకు ఏమైంది..? గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ కేపిటల్స్ చూపించిన ఆటతీరు కూడా వీళ్లకు చేతకావడం లేదు… అసలు పంజాబ్ జట్టు చూడండి… వరుసగా అయిదు గెలుపులే… పాయింట్ల టేబుల్‌లో టాప్…

సరే, గోయెంకా విషయానికి వద్దాం… క్రికెట్ టీమ్ మాత్రమే కాదు, తనకు మోహన్ బగాన్ ఫుట్‌బాల్ క్లబ్‌లోనూ భాగస్వామ్యం ఉంది… ఈ దేశ అత్యంత ధనిక టాప్ 100 వ్యాపారుల్లో 65వ ప్లేసు… బంగ భూషణ్ పురస్కార విజేత… ఒక దశలో సీఐఐ ప్రెసిడెంట్, All-India Management Association (AIMA) ప్రెసిడెంట్ కూడా… కానీ ఈ ఐపీఎల్ జట్టును మాత్రం మేనేజ్ చేయలేక, చేతులెత్తేస్తున్నాడు… నీ కోపంలో అర్థముంది గోయెంకా సాబ్..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సిద్ధరామయ్యపై క్షుద్రపూజలు, చేతబడి చేయించింది ఎవరు..?
  • జేడీ చక్రవర్తి చెప్పిన ఓ కథలో ఆ ముసలి గాడిద ఎవరై ఉంటారబ్బా..?!
  • … చివరకు అలాంటి పాకిస్థాన్ కూడా ఈమెకు సలాం కొట్టింది…
  • తోపులు కాదు, తుప్పాసులు… కోట్లకుకోట్లు పెట్టి కొన్నాను కదరా…
  • ఈమె నోరువిప్పితే… ట్రంపు ఫ్యామిలీ బజారున పడటం ఖాయమేనా…
  • ప్చ్, కష్టం బ్రో… భార్య వేసే ‘గూగ్లీ’ని ఏ భర్త కూడా సిక్స్ కొట్టలేడు..!
  • సరిగ్గా పోల్చాలంటే ఎస్‌.జానకి మీసాలు లేని కిశోర్‌ కుమార్‌..!!
  • నెల రోజుల ముఖ్యమంత్రి … చరిత్ర క్షమించలేదు…
  • నేరగాడి ప్రేమ కథ… ఈ రోతగాడి జీవితంలో మరో ఇంట్రస్టింగ్ పార్శ్యం…
  • బెంగాల్ ఎన్నికలు..! నట్లు బోల్టులు టైట్ చేస్తున్న ఎన్నికల సంఘం…!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions