Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏ ముత్యాలూ కడగబడలేదు… కాళేశ్వరం పిక్చర్ ఔర్ బహుత్ బాకీ హై…

April 23, 2026 by M S R

.

నిజంగా కేసీయార్, హరీష్ రావు కడగబడిన ముత్యాలేనా..? కాళేశ్వరం అక్రమాలపై ఘోష్ కమిషన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కేసీయార్ నిరపరాధి అని తేలినట్టేనా..? అస్సలు కాదు… హైకోర్టు నిర్దోషులు, నిరపరాధులు అని చెప్పలేదు, కమిషన్ తన విచారణ సమయంలో తప్పక పాటించిన కొన్ని నియమాల్ని పాటించలేదు కాబట్టి, ఈ కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు వద్దు అని చెప్పింది…

సరే, దీని మీద తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుందా లేదానేది వేరే విషయం… కానీ హైకోర్టు తీర్పును అప్పటికప్పుడు బీఆర్ఎస్ తమకు అనుకూలంగా చెప్పేసుకుంది… ప్రతిచోటా చిన్నాచితకా నేతల దగ్గర నుంచి హరీష్ రావు, కేటీయార్ సహా (కేసీయార్ మినహా) అందరూ ప్రెస్‌మీట్లు, ప్రెస్‌నోట్లు, యూట్యూబ్ బైట్లు, టీవీ డిబేట్లు… కేసీయార్, హరీష్‌రావు కాళేశ్వరం కుట్రల నుంచి బయటపడ్డట్టే అన్నంత హంగామా క్రియేట్ చేసింది గులాబీ క్యాంపు… (ఇలాంటి విషయాల్లో టీడీపీ, బీఆర్ఎస్ సేమ్ సేమ్)… (జనాన్ని ప్రచారమాయలో ముంచెత్తడంలో)…

Ads

కాళేశ్వరం

గులాబీ క్యాంపు ప్రచారం చూడండి… కడిగిన ముత్యాల్లా కేసీయార్, హరీష్, హోష్ట్ రిపోర్ట్ గోదాట్లోకి… కుట్రలు జలసమాధి, కేసీయార్ నిరపరాధి అని బ్యానర్ స్టోరీలు కొట్టింది… నిజంగా హైకోర్టు అలా చెప్పిందా..? న్యాయస్థానాల తీర్పులకు ఇలాంటి వక్రీకరణ లేదా వక్రబాష్యాలు సమర్థనీయమేనా..?

సరే, కోర్టు ఏం చెప్పిందో నిన్ననే చెప్పుకున్నాం కదా… మిగతా పార్టీల స్పందనలు కూడా అంతే గందరగోళంగా ఉన్నాయి… ప్రత్యేకించి బీజేపీ…! కిషన్ రెడ్డి, బండి సంజయ్, రఘునందన్ రావు తదితరులు స్పందించారు…

‘‘కాళేశ్వరం విషయంలో భారీ అక్రమాలున్నా ఆధారాలతో వాటిని చట్టపరంగా కోర్టు ముందు పెట్టలేని రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత… రేవంత్, కేసీయార్ డూప్ ఫైట్ చేయడమే తప్ప, కేసీయార్‌ను శిక్షించే విషయంలో రేవంత్‌కు సీరియస్‌నెస్ లేదు… ఈ ఇద్దరి నడుమ లాలూచీ యవ్వారం ఉంది, లక్ష కోట్ల అవినీతి జరిగితే 9 వేల కోట్లే అంటూ సీబీఐకి లేఖ రాయడం ఏమిటి..? సీబీఐ విచారణ కోరుతూ ప్రభుత్వం మూడు లైన్ల లేఖ రాయాలి… కేవలం మూడు బరాజులపై దర్యాప్తు కాదు…’’ ఇలా సాగాయి వాళ్ల విమర్శలు…

అంటే, నిందను కాంగ్రెస్ మీద వేయడానికి ప్రయత్నం… సీబీఐ దర్యాప్తు కోరుతూ ప్రభుత్వం ఎప్పుడో సీబీఐకి లేఖ రాసింది… ఆరు నెలలకు మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేశారా అని సీబీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతోంది అంటే సీబీఐ ఈ దర్యాప్తును ఎంత లైట్ తీసుకున్నదో అర్థమవుతూనే ఉంది… దానికి జవాబు చెప్పుకోవల్సిన బీజేపీ… మళ్లీ లేఖ రాయమనడం ఏమిటో… అసలు ఏ పార్టీని ఎలా ఇరుకునపెట్టాలో, ఏం కౌంటర్ ఇవ్వాలో కూడా తేల్చుెకోలేని దురవస్థ… అటు చూస్తే అస్మదీయ బీఆర్ఎస్… పైకి మాత్రం అది కనిపించకుండా నానా ప్రయాస…

కాళేశ్వరం

ఎప్పటిలాగే కాంగ్రెస్ మరింత గందరగోళం… బీఆర్ఎస్ మేల్కొన్న చాలాసేపటికి గానీ కాంగ్రెస్ ముఖ్యులకు ఏదో ఒకటి స్పందించాలనే సోయి రాలేదు… అంతేకాదు, పొంగులేటి స్పందన మరీ విచిత్రం… ‘‘నిజాయితీ ఉంటే సీబీఐ దర్యాప్తుకు సిద్దం కావాలి, మీరు నిర్దోషులైతే సీబీఐ విచారణ అడగండి’’ అని డిమాండ్ చేశాడు… కేసీయార్, హరీష్ రావు ఎందుకు అడుగుతారు..? పైగా ఆల్రెడీ రాష్ట్రమే సీబీఐ విచారణను కోరింది కదా… నిజానికి కాంగ్రెస్ టార్గెట్ చేయాల్సింది బీఆర్ఎస్, బీజేపీలను జాయింటుగా…

ఆ పార్టీల రహస్య మైత్రిని, అందుకే కాళేశ్వరంపై ప్రారంభం కాని సీబీఐ దర్యాప్తును ప్రశ్నించాల్సింది… అది చెప్పడం ద్వారా… ‘ఔర్ బహుత్ పిక్చర్ బాకీ హై’’ అనే ఫీల్‌ను జనంలోకి పంపించాలి… అంతేకాదు, హైకోర్టు తీర్పును బీఆర్ఎస్ ఎలా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నదో… తీర్పు కాపీలోని పాయింట్లు చూపిస్తూ మీడియాతో మాట్లాడి ఉండాల్సింది… చివరాఖరిగా… కాళేశ్వరం కథ ముగియలేదు…! ‘శుద్దపూసలుగా’ ఎవరు ప్రకటించబడలేదు..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మన ఖరీదైన ఆతిథ్యం… విదేశీ ఆటగాళ్లకు ఐపీఎల్ ఓ టైంపాస్ టూర్…
  • ఏ ముత్యాలూ కడగబడలేదు… కాళేశ్వరం పిక్చర్ ఔర్ బహుత్ బాకీ హై…
  • సిద్ధరామయ్యపై క్షుద్రపూజలు, చేతబడి చేయించింది ఎవరు..?
  • జేడీ చక్రవర్తి చెప్పిన ఓ కథలో ఆ ముసలి గాడిద ఎవరై ఉంటారబ్బా..?!
  • … చివరకు అలాంటి పాకిస్థాన్ కూడా ఈమెకు సలాం కొట్టింది…
  • తోపులు కాదు, తుప్పాసులు… కోట్లకుకోట్లు పెట్టి కొన్నాను కదరా…
  • ఈమె నోరువిప్పితే… ట్రంపు ఫ్యామిలీ బజారున పడటం ఖాయమేనా…
  • ప్చ్, కష్టం బ్రో… భార్య వేసే ‘గూగ్లీ’ని ఏ భర్త కూడా సిక్స్ కొట్టలేడు..!
  • సరిగ్గా పోల్చాలంటే ఎస్‌.జానకి మీసాలు లేని కిశోర్‌ కుమార్‌..!!
  • నెల రోజుల ముఖ్యమంత్రి … చరిత్ర క్షమించలేదు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions