Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిన్నటి హీరో, ఈరోజు విలన్? నేపాల్ రాజకీయాల్లో షాకింగ్ ట్విస్ట్!

April 24, 2026 by M S R

.

Pardha Saradhi Upadrasta ….  నిన్నటి హీరో, ఈరోజు విలన్? నేపాల్ రాజకీయాల్లో షాకింగ్ ట్విస్ట్!
ఒకప్పుడు యువతకు ఐకాన్‌గా నిలిచిన బాలేంద్ర షా ఇప్పుడు అదే యువత చేత నిరసనల వర్షంలో చిక్కుకున్నారు! ఘన విజయాన్ని ఇచ్చిన దేశమే ఇప్పుడు నిరసనలతో ఆందోళన చేస్తోంది.

అధికారంలోకి వచ్చి నెల కూడా కాకముందే పరిస్థితి ఇలా ఎందుకు మారింది?
 రెండు నిర్ణయాలే టర్నింగ్ పాయింట్
విద్యార్థి రాజకీయాలకు బ్రేక్… కాలేజీల్లో పార్టీ అనుబంధ సంఘాలపై నిషేధం… స్టూడెంట్స్ నుంచి భారీ వ్యతిరేకత. అసలు తన మూలాలు విద్యార్థుల ఆందోళనలు. విద్యార్థుల ఆందోళన వల్ల దేశం.మొత్తం జరిగిన ఆందోళనల నుండి పుట్టిన ప్రభుత్వమే అతని ప్రభుత్వం. ఇప్పుడు ఆ విద్యార్థి రాజకీయాలు వద్దు అట.

Ads

భారత్ వస్తువులపై కఠిన పన్నులు…
100 పైగా వస్తువులపై అదనపు కస్టమ్స్. సరిహద్దు ప్రజల జీవనంపై నేరుగా ప్రభావం. నేపాల్ కు దాదాపు మెజారిటీ వస్తువులు భారత్ నుండి ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో భారత్ నుండి దిగుమతి అవుతాయి. కొన్నిచోట్ల సరిహద్దు దాటి మరీ భారత్ లోకి వచ్చి ఇక్కడ పొద్దున నుండి సాయంత్రం దాకా పని చేసి వెళ్తూ వెళ్తూ ఇక్కడ వస్తువులు కొనుక్కొని వెళ్తారు. ఇప్పుడు వారి మీద ఇంపోర్ట్ పన్నులు వేస్తా అని వేసింది ఈ ప్రభుత్వం.

ఇదే సమయంలో హోంమంత్రి Sudan Gurung పై అవినీతి ఆరోపణలు రావటంతో వెంటనే రాజీనామా చెయ్యాల్సి వచ్చింది. ప్రభుత్వం వచ్చిందే పాత ప్రభుత్వ అవినీతికి , దేశంలో ఉన్న పరిస్థితికి వ్యతిరేకంగా , కానీ అతని జట్టులోనివారే అవినీతి ఆరోపణలు ఎదుర్కోవటం చాలా దారుణం. కొందరికి ఇది “నిజాయితీ”లా కనిపించినా, వాస్తవానికి ఇది ప్రభుత్వ అస్థిరతకు సంకేతం!

రాజకీయాల్లో వాస్తవ చెక్: సోషల్ మీడియా ఫేమ్ ≠ గుడ్ గవర్నెన్స్
యువత సపోర్ట్ ≠ శాశ్వత ఓటు బ్యాంక్
నిన్న గద్దె ఎక్కించిన యువతే,
రేపు గద్దె దించగల శక్తి కూడా అదే!

ముఖ్యమైన గుణపాఠం: “మార్పు” అనే మాట చెప్పడం సులువు, మార్పు చూపించడం కష్టం!
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే … — ఉపద్రష్ట పార్ధసారధి

#NepalPolitics #BalendraShah #NepalProtests #GenZ #PoliticalReality #Geopolitics #YouthPower #CurrentAffairs #InternationalNews #PardhaTalks

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిన్నటి హీరో, ఈరోజు విలన్? నేపాల్ రాజకీయాల్లో షాకింగ్ ట్విస్ట్!
  • లెన్స్‌కార్ట్ ‘బొట్టు’ను గౌరవించలేదు… ఆ పైత్యానికి అసలు కారణాలివీ…
  • భన్సాలీకి ఆ ‘మధుబాల’ దొరికేసింది..! ఈ ఇరవయ్యేళ్ల పిల్ల మెప్పిస్తుందా..?!
  • కథ బాగుండాలే గానీ… చిరంజీవి సినిమాను కూడా బీట్ చేయొచ్చు..!!
  • మన ఖరీదైన ఆతిథ్యం… విదేశీ ఆటగాళ్లకు ఐపీఎల్ ఓ టైంపాస్ టూర్…
  • ఏ ముత్యాలూ కడగబడలేదు… కాళేశ్వరం పిక్చర్ ఔర్ బహుత్ బాకీ హై…
  • సిద్ధరామయ్యపై క్షుద్రపూజలు, చేతబడి చేయించింది ఎవరు..?
  • జేడీ చక్రవర్తి చెప్పిన ఓ కథలో ఆ ముసలి గాడిద ఎవరై ఉంటారబ్బా..?!
  • … చివరకు అలాంటి పాకిస్థాన్ కూడా ఈమెకు సలాం కొట్టింది…
  • తోపులు కాదు, తుప్పాసులు… కోట్లకుకోట్లు పెట్టి కొన్నాను కదరా…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions