.
ఉగ్రనేతలకు పాకిస్థాన్ జన్మస్థలి… అది టెర్రరిస్టుల ఫ్యాక్టరీ… ఈ ధూర్తదేశం టెర్రరిస్టులందరికీ సేఫ్ అడ్డా… పాకిస్థాన్ ప్రభుత్వాలు, మిలిటరీ, ఐఎస్ఐ, పార్టీలు… అన్నీ టెర్రరిస్టులకు మద్దతే… ప్రపంచాన్ని, ప్రత్యేకించి ఇండియాను వణికించే ఉగ్ర అగ్రనేతలు అక్కడ బహిరంగంగానే తిరుగుతూ మీటింగులు పెడుతుంటారు… కానీ, ఇది ఒకప్పుడు… అందరినీ వణికించే ఉగ్రనేతలు సైతం ప్రాణభయంతో ‘చచ్చిపోతున్నారు’…
ఒకప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK), దాని వెంబడి ఉంటే పాకిస్థాన్ భౌగోళిక ప్రాంతాలు ఉగ్రవాదులకు సురక్షిత స్థానాలు… అక్కడే లాంచ్ ప్యాడ్లు, శిక్షణ కేంద్రాలు…. భారత్‌పై దాడులకు ఇక్కడే ప్లాన్లు వేసేవారు.., బహిరంగంగా తిరుగుతూ శిక్షణ ఇచ్చేవారు… కానీ ఇప్పుడు ఆ సీన్ పూర్తిగా మారిపోయింది…
Ads
పహెల్‌గామ్ దురాగతం తరువాత ఇండియా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌తో చాలా శిక్షణ కేంద్రాలు పేలిపోయాయి… వందల మంది మరణించారు, బయటికి చెప్పుకోదు పాకిస్థాన్… కానీ ఉగ్రనేతలే తమ కుటుంబ సభ్యులను కోల్పోయినట్టు చెబుతున్నారు…
మసూద్ అజార్ అఫ్ఘానిస్థాన్‌లో ఉన్నాడని అంతర్జాతీయ సమాజానికి పాకిస్థాన్ అబద్ధాలు చెబుతోంది… కానీ అసలు నిజం వేరు… ప్రస్తుతం పాకిస్థాన్, అఫ్ఘాన్ తాలిబాన్ల మధ్య ‘ఉప్పు-నిప్పు’ కయ్యం నడుస్తోంది… సరిహద్దు వివాదాలు, ఐఎస్ఐ (ISI) జోక్యంపై తాలిబాన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు…
ఒకవేళ మసూద్ అజార్ కానీ, హఫీజ్ సయ్యద్ కానీ పొరపాటున తాలిబాన్ల చేతికి దొరికితే, వారు క్షణం కూడా బతకనివ్వరు… అందుకే పాక్ చెబుతున్న “అఫ్ఘాన్ ఆశ్రయం” అనేది పచ్చి అబద్ధం… వారిని తమ గుప్పిట్లోనే ఉంచుకుని ISI ఎక్కడో రహస్యంగా రక్షణ కల్పిస్తోంది… దావూద్ ఇబ్రహీం వంటి ఎందరో టెర్రరిస్టులకు రక్షణ ఐఎస్ఐ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా…
భారత భద్రతా దళాల వ్యూహం, అజ్ఞాత శక్తుల కదలికలతో పీఓకే కూడా ఇప్పుడు వారికి డెత్ జోన్‌గా మారింది… గతంలో మసూద్ అజార్, హఫీజ్ సయ్యద్ వంటి వారు ముజఫరాబాద్, కోట్లీ ప్రాంతాల్లో యథేచ్ఛగా సంచరించేవారు… కానీ ఇప్పుడు అక్కడ భారత నిఘా ఏజెంట్ల ప్రభావం పెరగడంతో వారు అటువైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడుతున్నారు…
పీఓకేలోని ప్రతి అడుగుపైనా భారత నిఘా వర్గాల డేగకన్ను ఉంది… ఎక్కడ ఏ ఏజెంట్ మాటు వేసి ఉంటాడో, ఏ క్షణంలో ఏ డ్రోన్ వచ్చి మీద పడుతుందోనన్న భయం వారిని వెంటాడుతోంది… స్థానికంగా భారత ఏజెంట్ల నెట్‌వర్క్ బలోపేతం కావడంతో, ఉగ్రనేతల కదలికలు నిమిషాల్లో భారత్‌కు తెలిసిపోతున్నాయి…
వీటికన్నా అసలు భయం ‘దురంధర్’… అంటే అజ్ఞాత వ్యక్తులు స్వేచ్ఛగా సంచరిస్తూ… ఉగ్రనేతల జాడలు కనుక్కుని, హఠాత్తుగా వచ్చి కాల్చేసి వెళ్తున్నారు… ఉగ్రనేతల్ని ఆ భయం వెంటాడుతోంది ఇప్పుడు… అందుకే ప్రాణభయంతో దాక్కుని, చస్తూ బతుకుతున్నారు… బహిరంగ సభల్లో ఊగిపోయే ఈ ఉగ్రనేతలు, ఇప్పుడు ముఖానికి ముసుగు వేసుకోకుండా బయటకు రాలేని స్థితికి చేరుకున్నారు…
లష్కర్, జైషే సంస్థలకు చెందిన 9 కీలక స్థావరాలను భారత్ క్షిపణులతో భూస్థాపితం చేసింది ఆపరేషన్ సిందూర్‌లో… మురిద్కే, బహవల్పూర్ కోటలు ధ్వంసం కావడంతో ISI ఇప్పుడు వారిని లాహోర్, కరాచీల్లోని రహస్య బంకర్లలో, గృహ నిర్బంధాల్లో దాచిపెడుతోంది…
ఒకప్పుడు భారత్‌ను హెచ్చరించిన గొంతుకలు ఇప్పుడు ప్రాణభిక్ష కోసం అల్లాడుతున్నాయి… పీఓకేలో పట్టు కోల్పోవడం, తాలిబాన్ల శత్రుత్వం, ‘దురంధర్’ వంటి అజ్ఞాత ఏజెంట్ల నిరంతర నిఘా… వెరసి… పాక్ పెంచి పోషించిన ఈ ఉగ్ర కాలకూట విషసర్పాలు ఇప్పుడు తమ సొంత గూట్లోనే ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్నాయి… ఇది భారత రక్షణ, నిఘా వ్యవస్థ సాధించిన చారిత్రాత్మక విజయం…
Share this Article