Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ ఐపీఎల్ సీజన్‌కు కెప్టెన్లే సగం దరిద్రం… ఇదుగో వివరాలు…

April 24, 2026 by M S R

.

ఆరు మ్యాచులు… జస్ట్, 97 పరుగులు… మూడే వికెట్లు… 12.66 ఎకానమీ… ఇదీ ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా… కెప్టెన్సీ వైఫల్యాలు, తోటి ఆటగాళ్లపై నోరు పారేసుకోవడం సరేసరి… నిన్నటి చెన్నైపై జరిగిన కీలక మ్యాచులో ఒక పరుగు, 19 పరుగుల ఎకానమీతో నో వికెట్… అతిరథ మహారథులు, గ్రేట్ ట్రాక్ రికార్డు ఉన్న ముంబై జట్టు దురవస్థ ఇది…

పోనీ, అంతే గ్రేట్ ట్రాక్ రికార్డు ఉన్న చెన్నై జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సంగతి..? 7 మ్యాచులు, 104 పరుగులు… ఘోరమైన ప్రదర్శన… నిన్నటి ఒక్క మ్యాచ్, అదీ ముంబై వైఫల్యాల కారణంగా గెలిచి, పాయింట్ల పట్టికలో ఎగబాకింది గానీ… తన సమర్థత ఏమీ కాదు…

Ads

ఒక ధోనీతో ఒక గైక్వాడ్… ఒక రోహిత్‌తో ఒక హార్ధిక్‌ను పోల్చి చూడండి ఒక్కసారి… ఈ జట్ల పేలవమైన ఆటతీరుకు అసలు కారకులెవరో తేలిపోతుంది… వీళ్లే కాదు, పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మినహా కెప్టెన్లందరూ నాసిరకం కెప్టెన్సీ, వ్యక్తిగత ఆటతీరుతో నిరాశపరుస్తున్నారు… ఢిల్లీ అక్సర్ పటేల్ ఆరు మ్యాచులు 31 పరుగులు, ఆరు వికెట్లు… అంతే…

గుజరాత్ టైటాన్స్ శుభమన్ గిల్ కాస్త నయం… 5 మ్యాచులు 265 పరుగులు… కానీ కెప్టెన్‌గా సోసో… కలకత్తా కెప్టెన్ గురించి చెప్పుకోవడమే దండుగ… పాయింట్ల పట్టికలో లాస్ట్… అజింక్య రహానే 7 మ్యాచుల్లో 152 పరుగులు మాత్రమే… ఆటతీరులో కిందామీదా పడుతూ పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్న లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఖరీదెక్కువ, ఆట తక్కువ… 7 మ్యాచులు కేవలం 147 పరుగులు, ప్లస్ కెప్టెన్సీ ఫెయిల్యూర్స్…

హైదరాబాద్ జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్ కొంచెం బెటర్… ఫామ్‌లో ఉన్నాడు, కెప్టెన్‌గా దొరికిన చాన్స్ కూడా ఉపయోగించుకుంటున్నాడు… 7 మ్యాచుల్లో 238 పరుగులు… ఇక బెంగుళూరు కెప్టెన్ రజత్ పాటీదార్ విషయానికొస్తే… 6 మ్యాచుల్లో 230 పరుగులు పర్లేదు… ఫీల్డ్‌లో కోహ్లీ గైడెన్స్ లభిస్తోంది, కెప్టెన్‌గా కూడా దారిలోనే ఉన్నాడు… అందుకే బెంగుళూరు పాయింట్ల టేబుల్ టాప్ 4 లో ఉంది…

రియాన్ పరాగ్… ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో స్థిరమైన ప్రదర్శన ఉన్న రాజస్థాన్ జట్టు కెప్టెన్ తను… అనూహ్య విజయాలున్నాయి… కానీ బ్యాటర్‌గా ఫెయిల్… 7 మ్యాచులు, కేవలం 81 పరుగులు మాత్రమే… 2 వికెట్లు కూడా… చివరగా… పంజాబ్ శ్రేయాస్ గురించి… 5 మ్యాచుల్లో 208 పరుగులతో బ్యాటర్‌గా గొప్ప పర్‌ఫామెన్స్ ఏమీ కాకపోయినా… జట్టు వరుస విజయాల క్రెడిట్ కెప్టెన్‌గా తన ఖాతాలోనే పడుతుంది…

అందరూ ఇండియన్లే… కొందరికి అనుకోకుండా కెప్టెన్సీ చాన్స్ వచ్చింది… ఎందరు వినియోగించుకుంటున్నారు అనేదే ప్రశ్న… వ్యక్తిగతంగా ఏ కెప్టెనూ గొప్ప ఆట చూపించడం లేదు… పోనీ, కెప్టెన్సీ..? శ్రేయాస్, ఇషాన్ మినహా ఎవరూ ఇంపాక్ట్ చూపించలేకపోతున్నారు… కారణాలు అనేకం ఉండొచ్చు కానీ… ఫీల్డింగ్ వ్యూహాలు, బౌలింగులో మార్పులు, బ్యాటర్ల సమయోచిత ప్రయోగం, ఇంపాక్ట్ ప్లేయర్ల వినియోగం… చాలా విషయాల్లో ఎక్కువ మంది కెప్టెన్లు ఫెయిల్… ఫెయిల్…!!

(నిన్న విదేశీ ప్లేయర్ల నిర్వాకం గురించి చెప్పుకున్నాం కదా… ఇదేమో మన సొంత కెప్టెన్ల వైఫల్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Ola, Uber, Rapido… ‘చక్కదిద్దడం’ ఈ సర్కారుకు చేతకాదా..?
  • సత్తెన్నా… గిసంటోళ్ల కోసమా నువ్వు జీవితాన్ని ధారబోసింది…
  • ఈ ఐపీఎల్ సీజన్‌కు కెప్టెన్లే సగం దరిద్రం… ఇదుగో వివరాలు…
  • సంభవం… మలయాళీ డైరెక్టర్లూ, ఇలాంటి మూవీస్ మీకే సంభవం…
  • ప్రపంచాన్ని వణికించే ఉగ్రభూతాలు… భయంతో వణికి చస్తున్నాయి…
  • నిన్నటి హీరో, ఈరోజు విలన్? నేపాల్ రాజకీయాల్లో షాకింగ్ ట్విస్ట్!
  • లెన్స్‌కార్ట్ ‘బొట్టు’ను గౌరవించలేదు… ఆ పైత్యానికి అసలు కారణాలివీ…
  • భన్సాలీకి ఆ ‘మధుబాల’ దొరికేసింది..! ఈ ఇరవయ్యేళ్ల పిల్ల మెప్పిస్తుందా..?!
  • కథ బాగుండాలే గానీ… చిరంజీవి సినిమాను కూడా బీట్ చేయొచ్చు..!!
  • మన ఖరీదైన ఆతిథ్యం… విదేశీ ఆటగాళ్లకు ఐపీఎల్ ఓ టైంపాస్ టూర్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions