Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎగ్జిట్ పోల్స్ చెప్పే చేదు నిజాలు… ‘అన్‌వాంటెడ్’ కేరక్టర్ల భవిష్యత్తు..?!

April 30, 2026 by M S R

.

ఈ దేశ భవిష్యత్తును మలుపు తిప్పుతాయా, మరింత సంక్షోభంలోకి తీసుకుపోతాయా అనే ఎన్నికలు ఇవి… 5 రాష్ట్రాలు… పుదుచ్చేరి అనే సగం రాష్ట్రాన్ని తీసేస్తే 4 కీలక రాష్ట్రాల ఎన్నికలు… చాలా కీలకం ఎందుకో ఓసారి చెప్పుకుని ప్రస్తుతం మనం ఏ సంధి దశలో ఉన్నామో చెప్పుకుందాం… ఇక్కడ అమిత్ షా, మోదీ కేవలం పాత్రధారులు… ఎందుకంటే, బీజేపీకి ఓ లాంగ్ టరమ్ ప్లాన్ ఉంటుంది… ఆ దిశ ప్రస్థానంలో ప్రస్తుతం వీళ్ల పాత్ర…

1)  కేరళం… పినరై విజయన్ పేరుకు లెఫ్ట్, కానీ అదో ప్రాంతీయ కుటుంబ పార్టీ అక్కడ, అవినీతి మరకలు… సీపీఎం సిగ్గుపడే పాలన వ్యవహారాలు… సీపీఐ అయితే మరీ ఘోరం… 2) పుదుచ్చేరి, వదిలేద్దాం కాసేపు, అది రాష్ట్రమూ కాదు, కేంద్రపాలిత ప్రాంతమూ కాదు… 3) అస్సోం… బంగ్లా అక్రమ వలసదార్లు, ముస్లిం డెమోగ్రఫీ మార్పులతో అస్సోం స్థానికత, మూలాలే కదిలిపోతున్న దృశ్యాలు… దరిద్రమైన ధోరణులతో కాంగ్రెస్… ఉనికి కోల్పోయే దశలో ప్రాంతీయ పార్టీలు…

Ads

4) తమిళనాడు… అవసరాన్ని బట్టి ఎటైనా మారే డీఎంకే బలమైన కూటమి… ముస్లిం పార్టీలు, లెఫ్ట్, కాంగ్రెస్… యాంటీ బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రం… అవినీతి పక్కనపెట్టండి… 5) బెంగాల్… దేశానికే దరిద్రంగా, ప్రమాదకరంగా మారిన మమత ప్రభుత్వం… పాక్- బంగ్లా ఉగ్రవాదానికి కూడా అడ్డాగా మారిన సీన్… లెఫ్ట్, కాంగ్రెస్ తమ రాజకీయ ధోరణులతో నానాటికీ భ్రష్టుపడుతున్న తరుణం…



సరే, ఇక ఓసారి ఎగ్జిట్ పోల్స్ చూద్దాం… ఎప్పుడూ ఇవి నిజం అవుతాయని కాదు… ప్రత్యేకించి వోటర్లు భయంతో చచ్చిపోయే మమతా రౌడీరాజ్యంలో ఎవడూ నోరు తెరిచి నిజం చెప్పడు… చెబితే వాడి బతుకు అస్సామే… ఈడీలు, సీబీఐలే భయంభయంగా మెసిలే భయానక రాష్ట్రం అది… కానీ ఆ ఎగ్టిట్ పోల్సే నిజం అవుతాయని అనుకుని చెప్పుకుందాం…



అందుబాటులో ఉన్న సర్వేల వివరాలే పరిశీలిద్దాం…

1) కేరళలో యూడీఎఫ్ ప్రభుత్వం అట… గుడ్… స్వాగతిద్దాం… జనానికి మార్పు కావాలి… పినరై మార్క్ పాలనకు దెబ్బ పడాల్సిందే… మార్పు మంచిదే… లెఫ్ట్ మరింతగా కొడిగట్టి, దేశంలోనే ఇక అధికారపు ఉనికి కోల్పోతూ… చైనా ఎర్ర మూలాలు ఇంకెంత దెబ్బ తింటాయన్నమాట… ఐనా అసలైన కమ్యూనిజం పుట్టిన దేశాల్లోనే ఉనికి కోల్పోతోంది… ఇప్పుడిక ఇక్కడ…   శబరిమల సాక్షిగా…
.
2) అస్సోంలో బీజేపీ మళ్లీ వస్తుందట… గుడ్… వెరీ గుడ్… అక్రమ బంగ్లా వలసదార్ల బెడద కోణంలో దేశానికి ఈ రిజల్ట్ మంచిదే… అవినీతి ప్రాంతీయ పార్టీలు జాడ లేకుండా పోతున్నాయి అక్కడ… కామాఖ్య సాక్షిగా… హిమంత మళ్లీ వస్తే దేశానికి మంచిదే… ఒకవేళ గౌరవ్ గొగోయ్ గనుక సీఎం అయితే… ఈశాన్యంలో మంటలు మరింత పెట్రేగిపోయేవి…
.
3) తమిళనాడులో డీఎంకే మళ్లీ వస్తుందట… ఊహించిందే… జయలలిత మరణించాక అన్నాడీఎంకే నాయకత్వ వైఫల్యం… ఆ లీడర్లలో ఎవరికీ జనంలో ఆదరణ లేదు… నిజానికి బీజేపీకి అది, దానికి అన్నాడీఎంకే పరస్పరం గుదిబండలు… సో, బీజేపీకి అన్నామలై ఉసురు తగలనుంది… బీజేపీకి తత్వం బోధపడుగాక… మధుర మీనాక్షి సాక్షిగా… 

యాక్సిస్ సర్వే మాత్రం విజయ్ పార్టీ గెలుస్తుందని చెబుతోంది… అదే జరిగితే ద్రవిడ పార్టీల కూటములు చెల్లాచెదురై తమిళనాట కొత్త రాజకీయ వాతావరణం పురుడుపోసుకున్నట్టే…
.
4) ఇక బెంగాల్…. ఎగ్జిట్ పోల్స్ బీజేపీదే అధికారం అంటున్నా సరే… ఎక్కడో ఇంకా డౌట్… భద్రకాళి కళ్లు తెరిచినట్టేనా… ఇదే జరిగితే ఇది మోర్ దేన్ సర్జికల్ స్ట్రయిక్స్ … మళ్లీ మమత గెలిస్తే మాత్రం అది దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి, రక్షణకు డేంజర్…
..

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తుమ్మిడిహట్టిపై రేవంత్‌రెడ్డి తెలివైన ‘ఎత్తు’గడ… బీజేపీని లాగాడు…
  • రాజీవ్ హంతకుడు ఇప్పుడు లాయర్ వృత్తిలోకి..! మళ్లీ ఓ చిక్కుముడి..!!
  • అంబానీ ఐపీఎల్ జట్టుకు ఇక సెలవు… కొత్త ఆటగాళ్లే శరణ్యం…
  • అనామకంగా ఆ భక్తిమాధుర్యం… అది అపురూప స్వరసంగమం…
  • 250 + 250 + టార్గెట్స్..? నో ప్రాబ్లం… సరదాగా కొట్టేద్దాం… ఇదేం ఆటరా బాబోయ్…
  • ఎగ్జిట్ పోల్స్ చెప్పే చేదు నిజాలు… ‘అన్‌వాంటెడ్’ కేరక్టర్ల భవిష్యత్తు..?!
  • మరపురాని కొన్ని ‘ఎన్‌కౌంటర్లు… ఓ జర్నలిస్టు జ్ఞాపకాలు…
  • కృష్ణుడిని చంపి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేస్తుంది ఆమె…
  • జాగ్రత్తగా, తాపీగా చదవండి… మమతా బెనర్జీ అనే ‘ద్రోహి’ గురించి…
  • “లండన్ బాబు & ది హనీ బీ… ఆర్జీవీ ఓ షార్ట్ ఫిలిమ్ తీస్తే…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions