Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒకే ఒక్కడు… టెన్త్ పాసయ్యాడు… టీచర్లు దీపావళి జరుపుకున్నారు…

May 2, 2026 by M S R

.

తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి… ఇన్ని మార్కులు, మా ఘనత అని కార్పొరేట్ స్కూళ్లు, ప్రైవేటు స్కూళ్లు కూడా బోలెడు యాడ్స్ ఇచ్చుకుని ప్రమోట్ చేసుకుంటున్నాయి… ఇదంతా కామన్… కానీ ఒక విద్యార్థి… ఒకే విద్యార్థి ఫలితం మాత్రం రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకట్టుకుంది… ఆ కథేమిటో ముందు చెప్పుకుందాం…

పెద్దపల్లి జిల్లా, ధర్మారం మండలం, మల్లాపూర్ జెడ్పీ హైస్కూల్‌… అందులో చదువుతున్న ఏకైక పదో తరగతి విద్యార్థి పాసయ్యాడు… తన పేరు గుంటి మధు… 429 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు…. మధు స్కూల్‌కు వెళ్లకపోయినా సరే, ఉపాధ్యాయులు పట్టుదలతో అతడి ఇంటికెళ్లి పాఠాలు చెప్పారు… మధు పాస్ కావడం తన అవసరం కాదు, అది ఉపాధ్యాయుల అవసరం…

Ads

సరే, మధు ఉత్తర్ణుడు కావడంతో… ఉన్నదే ఒక్క టెన్త్ స్టూడెంట్… సో, స్కూల్ జీరో పర్సెంట్ ఫలితాల నుంచి బయటపడింది… స్కూల్‌లో పనిచేసే ఉపాధ్యాయులు ఆనందంలో ఉన్నారు…. కాదు, ఊపిరి పీల్చుకున్నారు… హమ్మయ్య, పాసయ్యావురా బాబూ, బతికించావు అనుకున్నారు… ఖుషీ అయ్యారు, స్వీట్లు కూడా పంచుకున్నారేమో తెలియదు గానీ, అసలు కథేమిటంటే..?

ఆ ప్రభుత్వ స్కూల్‌లోపదో తరగతి విద్యార్థి ఒక్కడే ఉన్నాడు… అక్కడ ఏడుగురు ఉపాధ్యాయులు ఉంటే… స్కూల్‌లో విద్యార్థులు ఆరుగురే ఉన్నారు… టెన్త్‌లో ఉన్న ఒకే ఒక్కడు పాసైతే స్కూల్‌ పదోతరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లవుతుంది… అంతా మాయ, లెక్కల మాయ…

ఒకవేళ మధు ఫెయిలైతే ఉత్తీర్ణత శాతం సున్నాగా ఉండేది… అందుకని ఉపాధ్యాయులు ఎలాగైనా మధును పాస్ చేయించాల్సిందేనని భీష్మ ప్రతిజ్ఞలు చేసుకున్నారు… ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు… ఒరే, బాబూ, కాస్త రోజూ స్కూల్‌కు రారా నాయనా అనడిగారు… ఎహె, వస్తే వస్తా, లేకపోతే లేదు, నా ఇష్టం అన్నాడేమో… అసలు క్లాస్ మేట్స్ లేరు అనుకున్నాడేమో, రెగ్యులర్ హాజరు ఉండేది కాదు…

తీట టీచర్లది కదా,.. మధు ఇంటికే వెళ్లి పాఠాలు చెప్పేవాళ్లు… సరే, ఏదో ఆ టీచర్ల లక్ ఫలించింది… మధు 429 మార్కులతో పాసయ్యాడు… సో, మధు క్లాస్‌లో టాపర్, స్కూల్‌లో టాపర్, పదో తరగతిలో ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు…

ఇక్కడ కొన్ని చేదు నిజాలు చెప్పుకోవాలి… ఏడుగురు టీచర్లు… జస్ట్, ఆరుగురు స్టూడెంట్లు… అర్థం చేసుకొండి… ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఎంత..? ఎందరికి ప్రయోజనం..? దగ్గరలోని వేరే హైస్కూల్‌లో విలీనం చేస్తే తప్పేముంది..?

అసలు అది కాదు సమస్య… అనేకచోట్ల విద్యార్థులు బోలెడు, టీచర్లు సరిపోరు… కానీ కొన్నిచోట్ల స్టూడెంట్లు ఉండరు, టీచర్లు బోలెడు… హేతుబద్ధీకరణ ఏది..? ఏ ప్రభుత్వమైనా చేయలేని పని అది… ఖజానా మొత్తం జీతభత్యాలకే ఖర్చయిపోతోంది అని బాధపడే రేవంత్ రెడ్డి కూడా చేయలేని టాస్క్ ఇది… ఉద్యోగులతో, అదీ ప్రభుత్వ టీచర్లతో, యూనియన్లతో ఎవరూ గోక్కోరు…

మరో నిజం ఏమిటంటే..? ప్రైవేటు వైపు విద్య వెళ్లిపోతూనే ఉంటుంది, ప్రభుత్వ బడి ఇంకా ఇంకా దెబ్బతింటూనే ఉంటుంది… రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్న ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూళ్లు సక్సెస్ కావడం మాత్రమే కాదు, జీరో ఎన్‌రోల్‌మెంట్, లెస్ ఎన్‌రోల్‌మెంట్ స్కూళ్ల విలీనం కూడా ఈ సమస్యకు ఓ పరిష్కారం…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అందరికీ అచ్చొచ్చింది… ఐరన్‌ లెగ్స్ కాస్తా గోల్డెన్ అయిపోయాయి…
  • ఓ రష్యన్ మహిళ వీసా పొడిగింపు… రూల్స్‌పై ఇంట్రస్టింగ్ జడ్జిమెంట్…
  • ఓ కామ ప్రకోపి… ఆ మొగుడి సూసైడ్… కానీ ఆ పిల్లల గతి..? చిక్కు ప్రశ్న..!!
  • ఒకే ఒక్కడు… టెన్త్ పాసయ్యాడు… టీచర్లు దీపావళి జరుపుకున్నారు…
  • సారీ… శారీ..! ఉర్ఫీ జావేద్ చీర కట్టింది… పాపం, ఆ చీరకే సిగ్గేసింది…
  • అక్కడ భయం… ఇక్కడ సాహసం… యాక్సిస్ ప్రదీప్ గుప్త రిస్కీ వెంచర్…
  • వీరప్పన్ ఫోటోలకూ ఫోరెన్సిక్ పరీక్షలు… చివరకు తేలిందేమిటంటే…!
  • అమ్మా, నీకు వందనం… నీ పేగు ప్రేమకు అభివందనం…
  • ప్రతిసారీ వైభవ్ గెలిపించలేడు… ఆటతీరులోనూ అస్థిరత్వం…
  • మైండ్ యువర్ ఇన్సూరెన్స్ … ఏ బీమా చూసినా ఏమున్నది, మోసం తప్ప…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions