Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ కామ ప్రకోపి… ఆ మొగుడి సూసైడ్… కానీ ఆ పిల్లల గతి..? చిక్కు ప్రశ్న..!!

May 2, 2026 by M S R

.

యుద్ధం, ప్రకృతి ప్రకోపం, నేరాలు… ఏ విపత్తుకైనా సరే మొదటి బాధితులు పిల్లలు… కామం ప్రకోపించి, ప్రియుళ్లతో కలిసి మొగుళ్లను చంపడమే కాదు, కొందరు పిల్లల్నీ చంపుతున్నారు… పిల్లల్ని వదిలేసినా సరే, ఇలాంటి నేరాల తరువాత ఆ పిల్లలు అనాథలు కావడమే కాదు, వాళ్ల జీవితాంతం ఈ సంఘటనలు వేధిస్తాయి… ఇతర పిల్లలతో పోలిస్తే అసాధారణ బతుకులు..,

చికాకులెన్ని ఉన్నా సరే, తల్లిదండ్రులు కలిసి ఉన్న కుటుంబాలు… ఇరువైపులా ఉండే తాతలు, బామ్మలు, మామ్మల ప్రేమ ఇచ్చే భరోసా, ఆ పిల్లల ఎదుగుదలపై పాజిటివ్ ప్రభావం అంతాఇంతా కాదు… ఓ ప్రొటెక్టివ్ ఎన్విరాన్‌మెంట్… కానీ అనేక కుటుంబాల్లో పిల్లల బతుకులు పూర్తి భిన్నంగా, విషాదమయంగా మారుతున్నయ్…

Ads

నిన్నామొన్నటి నుంచి వైరల్ అవుతున్న సాఫ్ట్‌వేర్ సీతారాం ఆత్మహత్య కేసులోనూ ఇదే… ఇద్దరు పిల్లలు… రేపు రేపు వాళ్ల గతేమిటి..? ఇదీ అసలు ప్రశ్న..! ఈ ఆత్మహత్యలో కూడా ఆమె వికటకోణం కనిపిస్తోంది… ఆమెకు పెళ్లికి ముందే ఆరుగురితో యవ్వారాలట… పెళ్లయ్యాక కూడా ముగ్గురితో సంబంధాలు అట… పైగా ప్రియులతో కలిసి ఉన్న తన వీడియోలు, ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసుకున్నారట… ఆర్థిక స్థిరత్వం ఉన్న కుటుంబం, ఇద్దరు పిల్లలు, ఐనా ఇదేం రోగం అంటారా..? అవును, రోగమే…

వార్త సంక్షిప్తంగా చెప్పుకుందాం మరోసారి… హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సీతారాం, హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు… ఆయన మరణానికి ముందు రాసిన 19 పేజీల సూసైడ్ నోట్ ఇప్పుడు ఈ కేసులో కీలక ఆధారంగా మారింది… దాన్ని సోషల్ మీడియాలో పెట్టి… “ఆమెకు ఏం కావాలి? నా నుంచి ప్రేమనా లేక శృంగారమా? దేనికోసం ఈ మోసం?” అని తను వేసిన ప్రశ్న వైరల్ అయిపోయింది…  తన భార్య రేణుక ప్రవర్తన, ఆమె అక్రమ సంబంధాలు, తనను మానసిక క్షోభకు గురిచేసిన తీరును అందులో అత్యంత ఆవేదనతో వివరించాాడు…

ఇప్పుడు తాజాగా తెలిసిన సమాచారం మరింత విస్మయకరం… భర్త చనిపోయిన నెలకే ప్రియుడు రమణారెడ్డిని పెళ్లి చేసుకుందట… భర్త చనిపోగానే పీడాపోయింది, అడ్డంకులన్నీ పోయాయి అనుకుందేమో… ఆ ఇద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు మొత్తం యవ్వారాలన్నీ తవ్వుతున్నారు… తండ్రి చనిపోయాడు, తల్లి జైలుపాలు… మరి ఆ పిల్లలు..?

రాను రాను మన వివాహ వ్యవస్థే భారీ ఒడిదొడుకులకు గురవుతోంది… విలువలు లేని వివాహేతర సంబంధాలు, బరితెగింపు యవ్వారాలు, నేరాలు ఓ సంక్షోభం వైపు నెట్టేస్తున్నాయి… ఈ మొత్తం పరిణామ క్రమంలో పాపం, బాధిత పిల్లల మాటేమిటనేదే ఇక్కడ ఆందోళనకరమైన కీలక ప్రశ్న…!!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అందరికీ అచ్చొచ్చింది… ఐరన్‌ లెగ్స్ కాస్తా గోల్డెన్ అయిపోయాయి…
  • ఓ రష్యన్ మహిళ వీసా పొడిగింపు… రూల్స్‌పై ఇంట్రస్టింగ్ జడ్జిమెంట్…
  • ఓ కామ ప్రకోపి… ఆ మొగుడి సూసైడ్… కానీ ఆ పిల్లల గతి..? చిక్కు ప్రశ్న..!!
  • ఒకే ఒక్కడు… టెన్త్ పాసయ్యాడు… టీచర్లు దీపావళి జరుపుకున్నారు…
  • సారీ… శారీ..! ఉర్ఫీ జావేద్ చీర కట్టింది… పాపం, ఆ చీరకే సిగ్గేసింది…
  • అక్కడ భయం… ఇక్కడ సాహసం… యాక్సిస్ ప్రదీప్ గుప్త రిస్కీ వెంచర్…
  • వీరప్పన్ ఫోటోలకూ ఫోరెన్సిక్ పరీక్షలు… చివరకు తేలిందేమిటంటే…!
  • అమ్మా, నీకు వందనం… నీ పేగు ప్రేమకు అభివందనం…
  • ప్రతిసారీ వైభవ్ గెలిపించలేడు… ఆటతీరులోనూ అస్థిరత్వం…
  • మైండ్ యువర్ ఇన్సూరెన్స్ … ఏ బీమా చూసినా ఏమున్నది, మోసం తప్ప…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions