Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ రష్యన్ మహిళ వీసా పొడిగింపు… రూల్స్‌పై ఇంట్రస్టింగ్ జడ్జిమెంట్…

May 2, 2026 by M S R

.

ఆమె రష్యన్… ఇండియన్‌ను పెళ్లి చేసుకుంది, ఈ నేల సంస్కృతిని, ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రేమిస్తోంది… భర్త మరణించినా సరే, అత్త కుటుంబాన్ని అంటిపెట్టుకుని చూసుకుంటోంది… కానీ రూల్స్ ఆమెను పోపో అంటున్నాయి… వీసా కొనసాగింపుకీ వీల్లేదు అంటున్నాయి… ఈ నేపథ్యంలో హైకోర్టు మానవతాకోణంలో స్పందించి తీర్పు చెప్పింది, బాగుంది…

చట్టాలు, మార్గదర్శకాలు కేవలం పరిపాలనను క్రమబద్ధీకరించడానికే తప్ప, అసాధారణ పరిస్థితుల్లో బాధితుల పట్ల కఠినంగా వ్యవహరించడానికి కాదని  హైకోర్టు స్పష్టం చేసింది. భర్తను కోల్పోయిన ఆ రష్యన్ మహిళ వీసా పొడిగింపు విషయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుసరించిన తీరును తప్పుబడుతూ జస్టిస్ నగేశ్ భీమపాక సంచలన ఆదేశాలు జారీ చేశారు…

Ads

భగవద్గీత అనువాదకురాలికి పరీక్ష… రష్యాకు చెందిన అలైనా (Alena Evgenievna Pavlova)కు భారతీయ సంస్కృతి అంటే మొదటి నుంచీ మక్కువ… 2018 నుంచే ముద్దెనహళ్లిలోని సత్యసాయి సంస్థలో సేవలందిస్తూ, భగవద్గీతను రష్యన్ భాషలోకి అనువదిస్తోంది… ఈ క్రమంలోనే స్వరాగు అనే భారతీయుడిని 2024 జూలైలో వివాహం చేసుకుంది… అయితే, విధి వంచించి 2025 అక్టోబర్‌లో భర్త అనారోగ్యంతో మృతి చెందాడు…

భర్త కర్మకాండలు నిర్వహించడంతో పాటు, వృద్ధురాలైన అత్త నళినికి తోడుగా ఉండటం కోసం ఆమె వీసా పొడిగింపు కోరింది… కానీ, “పిల్లలు లేని విదేశీ వితంతువుకు వీసా పొడిగింపు ఉండదు” అనే నిబంధనను సాకుగా చూపి ఆమె దరఖాస్తును తిరస్కరించారు ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) అధికారులు…

అధికరణ 14 – హేతుబద్ధత ముఖ్యం… ఈ పిటిషన్‌ విచారించిన హైకోర్టు, అధికారుల తీరును ఆక్షేపించింది…

  • యాంత్రిక నిర్ణయాలు వద్దు…: మార్గదర్శకాలను యాంత్రికంగా అమలు చేయడం వల్ల అన్యాయం జరుగుతుందని కోర్టు పేర్కొంది…

  • రాజ్యాంగ స్ఫూర్తి…: ప్రతి నిర్ణయం హేతుబద్ధంగా ఉండాలని, రాజ్యాంగంలోని 14వ అధికరణం (సమానత్వపు హక్కు) ఇదే విషయాన్ని నిర్దేశిస్తుందని న్యాయమూర్తి గుర్తు చేశారు…

  • మానవీయ కోణం…: రష్యా నుంచి వచ్చి ఇక్కడి సంస్కృతిలో భాగమైన మహిళ పట్ల మానవత్వం చూపకుండా, కేవలం నిబంధనల పేరుతో వెనక్కి పంపడం ఏకపక్షమని కోర్టు తేల్చింది…

అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం … ఇది కేవలం ఒక వ్యక్తిగత సమస్య మాత్రమే కాదని, అంతర్జాతీయ సంబంధాలు, భారతదేశపు సాంస్కృతిక ప్రతిష్టకు సంబంధించిన విషయమని కోర్టు వ్యాఖ్యానించింది… వృద్ధురాలైన అత్తకు కోడలి అవసరం ఉందని గుర్తించిన న్యాయమూర్తి, ఎలాంటి జరిమానాలు లేకుండా ఆమె వీసాను వెంటనే పొడిగించాలని అధికారులను ఆదేశించింది… అలెనా నిర్ణీత గడువులోనే దరఖాస్తు చేసుకున్నందున, ఆమెపై ఎలాంటి పెనాల్టీలు విధించకుండా వెంటనే వీసా పొడిగించాలని హైకోర్టు స్పష్టం చేసింది…



ఇక్కడ చాలామందికి ఓ ప్రశ్న తలెత్తుతుంది సహజంగానే… లక్షల మంది బంగ్లాదేశ్ నుంచి, బర్మా నుంచి అక్రమంగా వలస వచ్చి, సులభంగా ఇక్కడి పౌరులు అయిపోతున్నారు… అలాంటిది ఈ నేలను ప్రేమించి, ఈ కల్చర్‌ను ప్రేమించి, భర్త మరణించినా అత్త గారి బాగోగులు చూసుకుంటున్న రష్యన్‌కు వీసా పొడిగింపు మాత్రమే కాదు, అసలు పౌరసత్వమే ఇస్తే తప్పేమిటి అని..!

క్లారిటీ ఏమిటంటే… అది వీసా పొడిగింపులాగా వెంటనే లేదా ఆటోమేటిక్‌గా జరిగిపోయే ప్రక్రియ కాదు… భారత పౌరసత్వ చట్టం (Citizenship Act, 1955) ప్రకారం, ఒక విదేశీయురాలు భారతీయుడిని వివాహం చేసుకుంటే, ఆమె  పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తుకు ముందు ఆమె కనీసం ఏడేళ్ల పాటు (7 years) భారతదేశంలో నివసించి ఉండాలి…

  • ఈ రష్యన్ మహిళ 2024 జూలైలో వివాహం చేసుకుంది, అంటే ఇప్పటికి ఆమె వైవాహిక జీవితం మొదలై రెండేళ్లు కూడా కాలేదు… కాబట్టి ఆమె ఇప్పుడే పౌరసత్వానికి అర్హురాలు కాదు… ఆమె ఏడేళ్ల నిబంధన పూర్తి చేసే వరకు ప్రతి ఏటా లేదా నిర్ణీత కాలానికి వీసా పొడిగించుకుంటూ ఇక్కడే ఉండాలి… ఆ తర్వాతే ఆమె పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోగలదు…

  • విదేశీయులు పౌరసత్వం తీసుకోవాలంటే వారి దేశ పౌరసత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుంది (Renouncing foreign citizenship), ఎందుకంటే భారత్ ‘ద్వంద్వ పౌరసత్వాన్ని’ (Dual Citizenship) అనుమతించదు…

ఐనాసరే, ఇండియన్ భర్త ద్వారా ఆమెకు పిల్లల్లేరు… సంతానం లేని విదేశీ వితంతువులకు వీసా పొడిగింపు కూడా ఉండదు రూల్స్ ప్రకారం… ఇదీ అసలు సమస్య…

ai photo(AI generated Image)



ఇక్కడే మరో కేసు గురించిన ప్రస్తావన… ఇదీ ఇంట్రస్టింగే… మహారాష్ట్ర దంపతులకు 2016లో అమెరికాలోని షికాగోలో బాలిక జన్మించింది… ఆ తర్వాత కుటుంబ నివాసం కెనడాకు మారింది… 2022 జనవరిలో కుమార్తెతో సహా ఇండియాకు వచ్చిన ఆ మహిళ కెనడా తిరిగి వెళ్లేందుకు నిరాకరించింది… కుమార్తెను తన వద్దకు పంపించాలంటూ భర్త అక్కడి కోర్టు ద్వారా ఉత్తర్వు తెచ్చుకున్నాడు… దీనిని సవాల్ చేస్తూ భార్య మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది… బాలికతో మాట్లాడిన జస్టిస్ విజయకుమార్ శుక్లా, జస్టిస్ బినోద్ కుమార్ ద్వివేదీ ఆమెను తల్లితో పాటే ఇక్కడే ఉండేందుకు అనుమతించారు… విదేశీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను పాటించడం కన్నా చిన్నారి సంక్షేమమే సర్వోన్నతమైనదని ఈ ధర్మాసనం పేర్కొంది… స్వర్గం కన్నా కన్నతల్లి, జన్మభూమి ఉన్నతమైనవని తెలిపింది…




 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అందరికీ అచ్చొచ్చింది… ఐరన్‌ లెగ్స్ కాస్తా గోల్డెన్ అయిపోయాయి…
  • ఓ రష్యన్ మహిళ వీసా పొడిగింపు… రూల్స్‌పై ఇంట్రస్టింగ్ జడ్జిమెంట్…
  • ఓ కామ ప్రకోపి… ఆ మొగుడి సూసైడ్… కానీ ఆ పిల్లల గతి..? చిక్కు ప్రశ్న..!!
  • ఒకే ఒక్కడు… టెన్త్ పాసయ్యాడు… టీచర్లు దీపావళి జరుపుకున్నారు…
  • సారీ… శారీ..! ఉర్ఫీ జావేద్ చీర కట్టింది… పాపం, ఆ చీరకే సిగ్గేసింది…
  • అక్కడ భయం… ఇక్కడ సాహసం… యాక్సిస్ ప్రదీప్ గుప్త రిస్కీ వెంచర్…
  • వీరప్పన్ ఫోటోలకూ ఫోరెన్సిక్ పరీక్షలు… చివరకు తేలిందేమిటంటే…!
  • అమ్మా, నీకు వందనం… నీ పేగు ప్రేమకు అభివందనం…
  • ప్రతిసారీ వైభవ్ గెలిపించలేడు… ఆటతీరులోనూ అస్థిరత్వం…
  • మైండ్ యువర్ ఇన్సూరెన్స్ … ఏ బీమా చూసినా ఏమున్నది, మోసం తప్ప…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions