Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఉంగరం ధరించిన సర్పం… బంగారమంటే జెర్రిపోతుకూ ఇష్టమే…

May 3, 2026 by M S R

.

ఇది నిజమైన వార్తే… కేరళలోని కాసరగోడ్ జిల్లా, అడూర్ (Adoor) ప్రాంతంలో ఈ వింత ఘటన జరిగింది… అడూర్‌లోని రవి అనే వ్యక్తి ఇంట్లో, సుమారు రెండు వారాలుగా తెరవని ఒక టేబుల్ డ్రాయర్‌ను శైలజ అనే మహిళ తెరిచింది… అందులో కాగితాల మధ్య ఒక జెర్రిపోతు (Rat Snake) కనిపించింది… ఆశ్చర్యకరంగా, ఆ పాము శరీరానికి ఒక బంగారు ఉంగరం గట్టిగా బిగుసుకుని ఉంది…

  • ఆ ఉంగరం ఎవరిది?…: అది రవి తండ్రికి చెందిన ఉంగరమని, ఆయన చనిపోయిన తర్వాత గుర్తుగా ఆ డ్రాయర్‌లో భద్రపరిచామని కుటుంబ సభ్యులు తెలిపారు… పాము ఆ డ్రాయర్‌లోకి దూరినప్పుడు అనుకోకుండా ఉంగరంలోకి దాని శరీరం దూరి, అలాగే ఉండిపోయి ఉంటుందని భావిస్తున్నారు…

  • రక్షణ…: సమాచారం అందుకున్న అటవీ శాఖ ‘సర్ప’ (SARPA) వాలంటీర్లు అక్కడికి చేరుకుని, పాముకు ఎటువంటి హాని కలగకుండా చాలా జాగ్రత్తగా ఉంగరాన్ని కట్ చేసి దాన్ని విడిపించారు… ఉంగరం బిగుసుకుపోవడం వల్ల ఆ పాము కొంత నీరసించి ఉంది…

snake

Ads

మీకు సందేహం వచ్చి ఉండాలిగా… ఎందుకంటే ఫోటోలో ఉంగరం చాలా చిన్నదిగా, పాము శరీరం దానికంటే లావుగా కనిపిస్తోంది… అయితే ఈ ఘటనలో కొన్ని కీలక అంశాలను గమనించాలి…

  1. పాము ఎదుగుదల…: జెర్రిపోతులు (Rat Snakes) చాలా సన్నని కలుగుల్లోకి లేదా డ్రాయర్ల సందుల్లోకి సులభంగా దూరిపోగలవు. ఈ పాము చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు లేదా ఆహారం లేక సన్నగా ఉన్నప్పుడు ఆ ఉంగరంలోకి దూరి ఉండవచ్చు… ఒకసారి ఉంగరంలోకి దాని శరీరం దూరాక, ఇక పాము పెరుగుతోంది, దాంతోపాటు ఉంగరం బిగసుకుంటోంది…

  2. శరీర నిర్మాణం…: పాముల శరీరం చాలా మెత్తగా, సాగే గుణం కలిగి ఉంటుంది… ఉంగరం ఉన్న భాగం వద్ద కండరాలు నొక్కుకుపోయి, దానికి అటువైపు ఇటువైపు ఉన్న శరీరం సాధారణంగా పెరగడం వల్ల ఉంగరం మరీ చిన్నదిగా, శరీరం లావుగా కనిపిస్తోంది…

సో, ఈ చిత్రం గూగుల్ AI (Artificial Intelligence) ద్వారా సృష్టించబడింది కాదు… స్థానిక అటవీ శాఖ అధికారులు కూడా దీన్ని ధృవీకరించారు… పామును రక్షించిన స్నేక్ క్యాచర్లు ఉంగరాన్ని కత్తిరించేటప్పుడు, అది పాము చర్మంలోకి కొంత మేర చొచ్చుకుపోయిందని గమనించారు… ఇది ఆ ఉంగరం చాలా కాలంగా దాని శరీరంపై ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది…

కాబట్టి, పాము పెరిగే క్రమంలో ఉంగరం దాని శరీరానికి ఒక ‘నేచురల్ బెల్ట్’ లాగా బిగుసుకుపోయి జరిగిన వింతైన సంఘటన…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సిగ్గూజ్ఞానం లేనిది మన మీడియాకే… గుడ్డిగా పెడబొబ్బలు, శోకాలు…
  • పోయింది, గాన్, గయా, పోయి, పొచ్చు… ‘ఏక్‌దిన్’మే ఖల్లాస్…
  • ఉంగరం ధరించిన సర్పం… బంగారమంటే జెర్రిపోతుకూ ఇష్టమే…
  • మన తొలి మిస్ వరల్డ్… నో మోడలింగ్, నో మూవీస్… ఇప్పుడు 82 ఏళ్లు…
  • ఆమె ఒంటిపై లైఫ్ జాకెట్… పిల్లాడిని గట్టిగా హత్తుకుని… మరెలా మరణించింది..?
  • పాటలతోనే కథనం… ‘సింగ్ గీతం’ మరో ప్రయోగం… డీఎస్పీకి పరీక్ష…
  • ఆప్ సీఎం ఎప్పుడూ ‘ఆన్’లోనే… ఇండియా ఇజ్జత్ తీసిన ఓ నిర్వాకం తెలుసా…
  • అందరికీ అచ్చొచ్చింది… ఐరన్‌ లెగ్స్ కాస్తా గోల్డెన్ అయిపోయాయి…
  • ఓ రష్యన్ మహిళ వీసా పొడిగింపు… రూల్స్‌పై ఇంట్రస్టింగ్ జడ్జిమెంట్…
  • ఓ కామ ప్రకోపి… ఆ మొగుడి సూసైడ్… కానీ ఆ పిల్లల గతి..? చిక్కు ప్రశ్న..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions