.
అసలు విషయం ఒక్కటే — అస్సాంలో Himanta Biswa Sarma ఎదుగుదల అంటే కేవలం వ్యక్తిగత ప్రతిభ కథ కాదు.., Indian National Congress, పర్టిక్యులర్‌గా రాహుల్ గాంధీ వ్యక్తిగత వ్యవహారశైలి., వ్యూహాత్మక తప్పుల ఫలితం కూడా… హిమంత విశ్వ శర్మ పుట్టు బీజేపీ కాదు, సంఘ్ నుంచి ఎమర్జ్ అయినవాడు కూడా కాదు… ఒకప్పుడు పక్కా కాంగ్రెస్… కానీ తనను ఈ పార్టీ కాపాడుకోలేక, చేజేతులా బీజేపీకి అప్పగించింది.,.
సంఘ్ నుంచి ఎమర్జయినవాళ్లకే ప్రాధాన్యం, ముందస్తుగా సీఎం పేరు చెప్పకపోవడం వంటి పాత పద్ధతులను పక్కనబెట్టి బీజేపీ హిమంత విషయంలో ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది… అది ఫలించింది… ఫలితంగా పదేళ్లుగా కాంగ్రెస్ మళ్లీ కోలుకోలేదు… ఇంకా వివరాలు చెప్పుకుందాం…
కాంగ్రెస్ నుంచి బీజేపీ వరకు: ఒక మలుపు… Himanta Biswa Sarma ఒకప్పుడు అస్సాంలో కాంగ్రెస్‌కు ప్రధాన శక్తి… Tarun Gogoi ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాడు… కానీ కాలక్రమేణా పార్టీలో అంతర్గత విభేదాలు పెరిగాయి… తన భవిష్యత్తు, నాయకత్వంలో తన స్థానం గురించి సందేహాలు మొదలయ్యాయి…
Ads
ఈ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ఆయన నేరుగా Rahul Gandhiను కలిసే ప్రయత్నం చేశాడు… అదే సమావేశం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది…
రాహుల్ వ్యవహారశైలి: టర్నింగ్ పాయింట్ …. ఆ సమావేశం గురించి తర్వాత హిమంత చెప్పిన వివరాలు రాజకీయంగా పెద్ద చర్చగా మారాయి… తన సమస్యలు చెప్పడానికి వెళ్లినప్పుడు, Rahul Gandhi పూర్తి దృష్టి పెట్టలేదని, సమావేశాన్ని సీరియస్‌గా తీసుకోలేదన్న భావన కలిగిందని ఆయన పేర్కొన్నారు…
ప్రత్యేకంగా, చర్చ జరుగుతున్న సమయంలో పక్కనే ఉన్న పెంపుడు కుక్కలకు బిస్కెట్లు వేస్తూ, మాట్లాడుతున్న విషయంపై ఫోకస్ లేకుండా వ్యవహరించారని హిమంత చెప్పిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్రంగా వైరల్ అయ్యాయి… ఒక రాష్ట్రంలో కీలక నేతగా ఉన్న వ్యక్తి సమస్యలను వినాల్సిన సమయంలో ఇలా లైట్‌గా తీసుకున్నట్టుగా కనిపించడం — అది కేవలం వ్యక్తిగత అవమానం కాదు, నాయకత్వ వైఫల్యానికి ఉదాహరణగా మారింది…
అదే క్షణం నుంచి హిమంతలో “ఇక్కడ నాకు భవిష్యత్తు లేదు” అనే భావన బలపడింది అని చెప్పడం అతిశయోక్తి కాదు…
![]()
బీజేపీ స్ట్రాటజీ: అవకాశాన్ని అందిపుచ్చుకోవడం … ఈ అసంతృప్తిని సరిగ్గా అర్థం చేసుకున్నది Bharatiya Janata Party… అప్పటివరకు అస్సాంలో పరిమిత స్థాయి ఉన్న పార్టీ, హిమంతను తీసుకోవడం ద్వారా గేమ్ మార్చేసింది…
అప్పటి సీఎం Sarbananda Sonowalను కేంద్రానికి తీసుకెళ్లి, రాష్ట్రంలో పూర్తి బాధ్యత హిమంతకు అప్పగించడం — ఇది బీజేపీ తీసుకున్న కీలక నిర్ణయం… ఆ నిర్ణయం తర్వాత అస్సాంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి…
కాంగ్రెస్‌కు నష్టం ఎలా జరిగిందంటే…. ఇక్కడ ప్రధాన ప్రశ్న: హిమంతను కాంగ్రెస్ ఎందుకు కోల్పోయింది? సమాధానం క్లియర్ — నాయకత్వ లోపం, కమ్యూనికేషన్ లోపం… ఒక కీలక నేత అసంతృప్తిని అర్థం చేసుకోలేకపోవడం, అతనికి గౌరవం ఇవ్వలేకపోవడం — దీని ఫలితమే ఈ పరిస్థితి… Rahul Gandhi స్థాయిలో ఉన్న నాయకుడు తీసుకున్న అలాంటి వైఖరి, అస్సాంలో పార్టీని బలహీనపరిచింది.
గౌరవ్ గొగోయ్ – ఎలిజబెత్ వివాదం: అదనపు ఒత్తిడి … ఇప్పటికే బలహీనంగా ఉన్న సమయంలోనే Gaurav Gogoi కుటుంబం చుట్టూ తిరుగుతున్న వివాదం కూడా కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారింది… ఆయన భార్య Elizabeth Gogoi గురించి వచ్చిన ఆరోపణలు (పాకిస్థాన్ ఐఎస్ఐ లింకులున్న సంస్థలతో సంబంధాలు) రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చాయి…
ఈ వివాదం నిజం ఎంత, రాజకీయంగా అతిశయోక్తి ఎంత అన్నది పక్కనపెడితే — పబ్లిక్ పర్సెప్షన్ మాత్రం కాంగ్రెస్‌కు నష్టం కలిగించేలా మారుతోంది…

ముగింపు : ఒక నిర్లక్ష్యం – దీర్ఘకాల ప్రభావం …. Himanta Biswa Sarma కథలో ప్రధాన పాఠం స్పష్టం — రాజకీయాల్లో వ్యక్తులను గౌరవించడం, వారి మాట వినడం అనేది స్ట్రాటజీ కంటే ముఖ్యమైన అంశం… ఒక సమావేశంలో కనిపించిన నిర్లక్ష్యం… ఒక నాయకుడి అసంతృప్తి… చివరకు ఒక రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును మార్చేసింది…
ఇప్పుడు హిమంత హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్తుంటే, కాంగ్రెస్ మాత్రం గతంలో చేసిన ఒక నిర్ణయాన్ని — లేదా తీసుకోలేని ఒక నిర్ణయాన్ని — మళ్లీ మళ్లీ గుర్తు చేసుకునే పరిస్థితిలో ఉంది… ఈ కారణాలకుతోడు అక్రమ వలసదార్లతో కొన్ని ప్రాంతాల్లో డెమోగ్రఫిక్ ఇన్‌బ్యాలెన్స్ పెరుగుతోంది… తద్వారా అస్సాం హిందూ వోటు సంఘటితమవుతోంది… హిమంత అతి పెద్ద బలం అదే… అదే ఈ హేట్రిక్ కారణం…
Share this Article