.
అబ్బే, బెంగాల్లో విజయం కేవలం ఈవీఎంల చలవ… బీజేపీ అందులో సిద్ధహస్తురాలు కదా, చేతివాటం ప్రదర్శించింది, గెలిచింది, దుర్మార్గం…
- ఓహో, మరి కేరళలో ఈవీఎంలే వాడారు, తమిళనాడులో ఈవీఎంలే వాడారు… మరక్కడ కాంగ్రెస్, టీవీకే ఎలా గెలిచాయబ్బా… ఆ సూత్రం మేరకు ఎఐడీఎంకే కూటమి, అనగా ఎన్డీయే కూటమి గెలిచి ఉండాలి కదా…
కాదు, కాదు, తూచ్… సర్ పేరిట ఈ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ కుట్ర ఇది, లక్షల మమత వోట్లను తొలగించాడు… మమత సుప్రీం దాకా వెళ్లింది, ఫాయిదా రాలేదు… లేకపోతే గెలిచేది ఖచ్చితంగా…
Ads
- ఔనా..? మరి తమిళనాడులో కూడా సర్ ప్రక్రియ జరిగింది కదా… నికరంగా 97 లక్షల వోట్లు తీసేసి, 12 లక్షల వోట్లను కొత్తగా చేర్చారు… టీవీకీ, డీఎంకే, ఏడీఎంకే ఎవరూ రచ్చ చేయలేదు… అక్రమ వలసదార్లు, ఫేక్ వోటర్లు, డూప్లికేషన్, మరణించినవారి వోట్లు తీసేస్తే పెంట పెంట చేసిన సీఎం మమత ఒక్కతే…
నో, నో, సీఏఆర్ఎఫ్ బలగాలను బెటాలియన్ల కొద్దీ దించారు… స్టేట్ పోలీసును బూతుల దగ్గరకే రానివ్వలేదు… అందుకే బీజేపీ గెలిచింది…
- అంటే స్టేట్ పోలీసును టీఎంసీ తన తొత్తు యంత్రాంగంగా మార్చుకున్నట్టు అంగీకరించినట్టేనా..? సర్ ప్రక్రియ పరిశీలించే న్యాయాధికారులపై దాడి చేసి, దిగ్బంధించి, సుప్రీం చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకునేదాకా బీభత్సం, వీరంగం క్రియేట్ చేసింది ఎవరు..? టీఎంసీ బూతుల దురాక్రమణ గురించే కదా ఒక నియోజకవర్గం మొత్తం ఎన్నిక రద్దు చేసి, వచ్చే నెలలో పెట్టబోతున్నారు..? కమలం గుర్తు మీద టేపులు అతికించి, ఈవీఎం కాప్చరింగ్ చేసింది ఎవరు..?
అవన్నీ కాదు, బీజేపీ మతోన్మాదంతో వోటర్లను పోలరైజ్ చేసింది, అందుకే టీఎంసీ ఓడిపోయింది..?
- అసలు ముస్లిం వోట్ల సంతుష్టీకరణతో హిందూ మతాన్ని తొక్కేయడానికి విశ్వప్రయత్నం చేసిందే మమత… నిజంగా హిందూ వోటు సంఘటన సంపూర్ణంగా జరిగితే తమిళనాడులో ఓ క్రిస్టియన్ సీఎం వస్తున్నాడుగా… కేరళలో యూడీఎఫ్ వస్తోందిగా…
అమిత్ షా బెంగాల్లోనే తిష్ట వేసి అధికార యంత్రాంగాన్ని భయభ్రాంతులకు గురిచేశాడు… మొత్తం వ్యవస్థల్ని తన చెప్పుచేతల్లోకి తెచ్చుకున్నాడు… అందుకే టీఎంసీ వోటమి…
- అందుకేనా..? అంత భయపడితే యూపీ ఐపీఎస్ అజయ్ పాల్ శర్మను టీఎంసీ జహంగీర్ ఖాన్లు, అభిషేక్ బెనర్జీలు, మహువా మొయిత్రాలు బహిరంగంగా సవాళ్లు చేసింది..?
టీఎంసీ మీటింగులకు ఆంక్షలు పెట్టారు, సరిగ్గా జరగనివ్వలేదు… అందుకే ప్రచారం సరిగ్గా జరగలేదు…
- పర్మిషన్లు ఇచ్చేదే స్టేట్ గవర్నమెంట్… టీఎంసీదే అధికారం, అడ్డుకున్నదెవరు..? ఐనా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాల్ గిరిజన తెగ మీటింగు పెట్టుకుంటే సభావేదిక మార్చి, జనం రాకుండా చేసి, గతుకుల రోడ్ల మీద పంపించింది మమత కాదా..?
సరే, పాపం పండింది, నూరు తప్పులు నిండాయి, అందుకే జనం శిక్షించారు, కలకత్తా కాళీమాత శపించింది…
- అదే కారణమని భావిస్తే టీఎంసీ ఇష్టం… 71 ఏళ్లు నిండాయి మమతకు… ఇక టీఎంసీలో జహంగీర్ఖాన్లు, అభిషేక్ బెనర్జీలదే హవా… వచ్చే ఎన్నికల నాటికి మమతలో ఈ చురుకుదనం ఉండదు, దూకుడు ఇంతగా ఉండదు, అధికారం లేకపోతే అస్సలు ఉండదు… నూరు తప్పుల శిశుపాలిక కు సెలవు…
Share this Article