Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Next Telangana..! ఆశ సహజమే..! ఓసారి తమిళ ఫలితంతో పోలిస్తే..?!

May 7, 2026 by M S R

.

బెంగాల్ అయిపోయింది… ఇక తదుపరి జెండా తెలంగాణలో పాతడమే… అని బీజేపీ నాయకులు ధాటిగా స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు… కానీ పాపం శమించుగాక… ఓసారి తమిళనాడులో బీజేపీ వ్యూహరాహిత్యం, ఫలితాలను… తెలంగాణ రాజకీయ స్థితిని ఓసారి పోల్చుకుంటే…. బీజేపీ ‘తోక నిష్ఫల వ్యూహాలు’ తప్ప ఇంకేమీ కనిపించవు… కటువుగా ఉన్నా నిజం ఇదే…

1) పళనిస్వామి అనే ఓ విఫల నాయకుడు చెప్పగానే… దూకుడుగా బీజేపీ సొంత బలం పెంచడానికి శ్రమిస్తున్న అన్నా మలైని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తీసేశారు… చివరకు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు… పక్కన పెట్టేశారు…

Ads

– – సేమ్, తెలంగాణలో కేసీయార్ మెప్పు కోసం… దూకుడుగా బీజేపీ సొంత బలం పెంచడానికి శ్రమిస్తున్న బండి సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి పీకేశారు… ఇంకా నయం, మరీ అవమానించకుండా కేంద్ర కేబినెట్లోకెి తీసుకున్నారు…

2) పళనిస్వామి ఎదుట సాగిలపడితే ఏమొచ్చింది… గత ఎన్నికల్లో 4 సీట్లు రాగా, ఇప్పుడు వాళ్లంతా ఓడిపోయారు… కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటు వచ్చింది ఇప్పుడు… సొంతంగా కష్టపడి ఉంటే కేరళలో వచ్చినట్టు రెండో మూడో వచ్చి ఉండేవి కదా… ఎంత ఖదర్ ఉండేది..?

– – సేమ్, ఇప్పటికీ కేసీయార్ ఎదుట సాగిలబడదాం, వేరే దిక్కు లేదు అనే ముఖ్యులే ఉన్నారు బీజేపీలో… అంటే బీఆర్ఎస్‌కు తోక పార్టీగా చేద్దామని ఆలోచన… అందుకే కాళేశ్వరం సీబీఐ కేసు ఉండదు, రేప్పొద్దున విద్యుత్తు అక్రమాల కేసు కూడా ఉండదు…

వెంకయ్యనాయుడు పుణ్యమాని ఏళ్లకేళ్లు తెలుగుదేశానికి తోకగా మార్చారు… ఎక్కడికక్కడ సొంత కేడర్ డెవలప్ గాకుండా చేశారు… ఇటు చంద్రబాబు, అటు కేసీయార్ ఇద్దరూ మోడీ మీద పరుష వ్యాఖ్యానాలు చేస్తూ, శతృవైఖరి అవలంబిస్తుంటే… హమ్మయ్య, ఇక పీడాపోయింది, ఇకనైనా సొంతంగా ఎదగడానికి ట్రై చేయాలని బీజేపీ కేడర్ ఊపిరి పీల్చుకుంది…

తరువాత అదే చంద్రబాబును చేరదీసింది… (అఫ్‌కోర్స్, అది కేంద్రంలో మెజారిటీకి ఉపయోగపడింది… అదొక రిలీఫ్)… ఇప్పుడు కేసీయార్‌నూ చేరదీయాలని అనుకుంటోంది… ఇక్కడ తేడా ఏమిటీ అంటే..? జగన్ వ్యతిరేకత తప్ప చంద్రబాబు సొంత గెలుపు కాదు అది… ఇక్కడ జగన్‌లాగే కేసీయార్ ఓటమి కూడా స్వయంకృతం… బీఆర్ఎస్‌తో కలిస్తే… తెలంగాణ బీజేపీ మరో రెండు దశాబ్దాలు వెనక్కి పోయినట్టే…

పోనీ, ఇంటర్నల్‌గా బాగుందా..? మున్సిపల్ ఎన్నికల నిధులను కూడా తినేశారని పార్టీ ముఖ్యులే మొత్తుకుంటున్నారు కదా… కేసీయార్ కోవర్టుల మాటే చెల్లుబాటవుతుందనే విమర్శలూ ఉన్నవే… బయటి నుంచి ఎవరు వచ్చినా నాలుగు రోజులు పార్టీలో ఉండలేక పారిపోతున్నది నిజం కాదా..? లోపం ఎక్కడుంది..? ఎప్పుడైనా హైకమాండ్ ఆత్మవిమర్శ చేసుకుందా..? ప్రతి రాష్ట్రంలో పార్టీని గాడినపడేసిన మోటూ భాయ్ తెలంగాణలో మాత్రం చేతులెత్తేస్తున్నాడు ఎందుకు..?

చివరకు ఈటల రాజేందర్ వంటి నేతలు కూడా అంతర్గతంగా  సెగ ఎదుర్కుంటున్నాడు.., ఉన్నవాళ్లకు ఏమీ చేతగాక, కొత్తవాళ్లకు చాన్స్ ఇవ్వక… ఇక ఎలా ఎదగాలి పార్టీ..? పోనీ, ఏ బీఆర్ఎస్ నుంచి ఏ షిండేను లాగడానికో ట్రై చేశారా..? అదీ లేదు… కొన్నాళ్లుగా హరీష్ రావును బీఆర్ఎస్‌లో సైడ్ చేస్తున్నారు.., జీవన్ రెడ్డి ఎపిసోడ్ దగ్గర నుంచి నిన్నటి రైతు సభ దాకా…

నమస్తే తెలంగాణలో కేటీయార్ రైతు సభకు మూణ్నాలుగు పేజీల కవరేజ్… ఎవరెవరో నాయకుల ప్రసంగాలు… ఫోటోలు… హంగామా… ఫాఫం, హరీష్ హైదరాబాదులో కూర్చుని ఎక్స్‌లో ఏవో పోస్టులు పెడుతూ, రైతు సభ లైవ్ చూస్తూ కాలం గడిపాడు… సో, తెలంగాణకు సంబంధించి బీజేపీ ఆలోచనలు, ఆచరణలు చాలా ఏళ్లుగా ఏదో భారీ తేడా కొడుతోంది సీనా..!!

చివరగా… నిజంగా బెంగాల్‌లో వర్క్ చేసినట్టు గనుక.,.. సంఘ్, బీజేపీ సొంతంగా సిన్సియర్‌గా వర్క్ చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధించే చాన్స్ ఉన్న రాష్ట్రం… ఎవరి ఎదుటా సాగిలబడకుండా చేస్తేనే సుమా..!!

 

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Next Telangana..! ఆశ సహజమే..! ఓసారి తమిళ ఫలితంతో పోలిస్తే..?!
  • శోభన్‌బాబును చంపేస్తే ప్రేక్షకులు ఊరుకుంటారా..? ఛఫో అనేశారు..!
  • తలైవా… Time to Lead…! నాడు జయలలిత గేటు ముందు విజయ్..!!
  • మంత్రి సీతక్క ఝలక్… బీఆర్ఎస్ దుష్ప్రచారంపై కోర్టు అక్షింతలు…
  • జనం సొమ్ము… నగలు, ఫ్యాషన్లు… వందల కోట్ల విలాస ప్రదర్శన…
  • మిన్మిని… ఓ మధుర స్వరం…! విషాదాలు, విషపు ఆంక్షలతో తెరమరుగు…!!
  • సుప్రీం చీఫ్ జస్టిస్ భలే ప్రశ్న… ఎందుకీ పిల్… నీకేం సంబంధం…
  • DMK + AIDMK…! ఇదే జరిగితే తమిళ రాజకీయాల్లో చరిత్రాత్మకం..!!
  • క్యాచ్ మిస్… మ్యాచ్ మిస్… దరిద్రపు ఫీల్డింగులో పంజాబ్ టాప్…
  • హైదరాబాద్… అల్ట్రా లగ్జరీ ఇళ్లకు అల్టిమేట్ డెస్టినేషన్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions