Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మగవాదం..! ‘‘సుమతీ శతకం’’పై ఓ సైకలాజికల్ అనాలిసిస్…!!

May 7, 2026 by M S R

.

Psy Vishesh ….. వస్తావా? రేట్ ఎంత? మనం 21వ శతాబ్దంలో ఉన్నాం, అంతరిక్షంలోకి వెళ్తున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ప్రపంచాన్ని శాసిస్తున్నాం. కానీ, మల్కాజ్‌గిరి సీపీ బి. సుమతి గారు నిర్వహించిన ఒక్క ‘స్టింగ్ ఆపరేషన్’ మన నాగరికత అట్టడుగున ఇంకా ఎంతటి కుళ్ళిన మనస్తత్వం దాగి ఉందో బట్టబయలు చేసింది.

ఒక ఉన్నత స్థాయి పోలీసు అధికారిణి సాధారణ మహిళగా రోడ్డు మీద నిలబడితే, 40 మంది మగవారు ఆమెను చుట్టుముట్టి వేధించారంటే… అది కేవలం ఒక క్రైమ్ రిపోర్ట్ కాదు; అది మన సమాజం సామూహిక మానసిక వైఫల్యం.
ఈ 40 మందిలో ప్రతి ఒక్కరూ ఒక వేటగాడిలా (Predator) ప్రవర్తించడం వెనుక ఉన్న వికృత సైకాలజీని మనం లోతుగా తవ్వాల్సి ఉంది.
ఒక సైకాలజిస్ట్ గా ఈ 40 మంది ప్రదర్శించిన ఆ Predatory Filth పై నా విశ్లేషణ ఇక్కడ ఇస్తున్నాను.

Ads

Serial Predatory Behavior… ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే — ఆ 40 మంది ఒకే గుంపుగా లేరు. విడివిడిగా వెళ్తున్న బ్యాచ్‌లు కూడా ఆమెను చూడగానే ఒకేలా స్పందించాయి.
అంటే, రాత్రిపూట తిరుగుతున్న యువతలో ఎంతమంది ఈ Objectification (స్త్రీని వస్తువుగా చూడటం) అనే మానసిక రోగంతో ఉన్నారో అర్థమవుతోంది.
వీరి దృష్టిలో రాత్రిపూట ఒంటరిగా కనిపించే మహిళ ఒక మనిషి కాదు, కేవలం తమ శారీరక వాంఛలను తీర్చుకునే ఒక ‘వ్యాపార వస్తువు’.

“రేట్ ఎంత?” అని అడిగే ధైర్యం వారికి ఎక్కడి నుంచి వచ్చిందంటే — అది మన పితృస్వామ్య వ్యవస్థ వారికి ఇచ్చిన Unconscious License.
ఆడపిల్ల కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి, గౌరవించాల్సిన పనిలేదు, ఆమెకు ఒక ధర కట్టి కొనొచ్చు అనే అహంకారం వీరి రక్తంలో ఇంకిపోయింది.

The Psychology of Male Entitlement… ఈ 40 మందిలో అత్యధికులు చదువుకున్న విద్యార్థులే కావడం అత్యంత విషాదకరం. వీరి మెదడులో ఒక ప్రమాదకరమైన Cognitive Distortion ఉంది. తాము ‘మగవారం’ కాబట్టి ఏదైనా చేయొచ్చు అనే Entitlement Mindsetతో బతుకుతున్నారు.
రాత్రిపూట మహిళ బయట ఉంటే, ఆమెను ఏమైనా అడిగే హక్కు తమకు ఉందనే భ్రమలో వీరు బతుకుతున్నారు.

ఒక మహిళను మాటలతో లొంగదీసుకోవాలని చూడటం, ఆమెను భయపెట్టడం ద్వారా తాము ‘శక్తివంతులం’ అని నిరూపించుకోవాలని చూస్తారు. దీనినే సైకాలజీలో Toxic Masculinity అంటారు. అంటే తన బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి స్త్రీపై అధికారాన్ని ప్రదర్శించడం.

 ఇద్దరు ముగ్గురు కలిస్తే చాలు.. మృగం నిద్రలేస్తుంది! … ఆ 40 మంది విడివిడిగా, ఇద్దరు ముగ్గురు చొప్పున వేధించారు. దీన్ని Small Group Deindividuation’ అంటారు. ఒక్కడున్నప్పుడు భయపడేవాడు కూడా, పక్కన ఇంకో స్నేహితుడు తోడవ్వగానే తన నైతికతను చంపేసుకుంటాడు.
ఒకడు నీచంగా వాగితే, పక్కన ఉన్నవాడు నవ్వి ప్రోత్సహిస్తాడు. ఆ ప్రోత్సాహం వారిని మరిన్ని అసభ్య పదజాలం వాడేలా చేస్తుంది.
రాత్రి చీకటి తమను గుర్తుపట్టనివ్వదు అనే ధీమా వారిని ‘కవర్డ్స్’ (పిరికిపందలు) నుండి ‘ప్రిడేటర్స్’ (వేటాడే మృగాలు) గా మారుస్తుంది.

 Dark Triad … మనస్తత్వ శాస్త్రం ప్రకారం, ఇలాంటి నేరస్తులలో మూడు ప్రధాన వికృత లక్షణాలు ఉంటాయి.
🔹 Narcissism: తమ కోరికలే ముఖ్యం, ఎదుటివారి గౌరవం తృణప్రాయం అనే అహంభావం.
🔹Psychopathy: ఒక మహిళకు అంతటి నీచమైన ప్రశ్న వేస్తున్నప్పుడు కనీసం మనస్సాక్షి (Conscience) అడ్డుపడకపోవడం. ఎదుటివారి వేదన వీరికి వినోదం.
🔹Machiavellianism: పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని, బాధితురాలిని మానిప్యులేట్ చేయడానికి ప్రయత్నించడం.
⚡ సీపీ సుమతి గారు ఆ 40 మందికి ఇచ్చిన ట్రీట్‌మెంట్ సామాన్యమైనది కాదు. దీనిని సైకాలజీలో Cognitive Shock అంటారు.

తాము ఒక ‘వస్తువు’ అనుకుని రేటు కట్టాలని చూసిన వ్యక్తి, తమ మెడకు బేడీలు వేసే ‘అత్యున్నత శక్తి’ అని తెలిసినప్పుడు వారి అహంకారం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది.”
“నువ్వు ఏ అమ్మాయిని చూసినా, ఆమె వెనుక ఒక సిపీ సుమతి ఉండొచ్చు అనే భయం నీ మెదడులో నిరంతరం ఉండాలి” అని ఈ ఘటన ద్వారా ఆమె సమాజానికి స్పష్టమైన ఇచ్చిన సందేశం ఇచ్చారు.

ఈ భయం మాత్రమే ఇలాంటి మృగాలను అదుపులో ఉంచుతుంది. గౌరవం లేని చోట భయమైనా ఉండాలి.
ఆమె సీపీ సుమతి కాబట్టి ఎవరేం అనడంలేదు. అదే వేరే మహిళ అయ్యుంటే.. “అంత అర్ధరాత్రి ఆమె అక్కడ ఎందుకు ఉంది?” అని అడిగే వెధవలు కూడా మన చుట్టూనే ఉన్నారు.
మనం ఇంకా Victim Blaming దశలోనే ఉంటే, ఈ 40 మంది మృగాల కంటే మనం భయంకరమైన వాళ్ళం.

🔹హీరోయిన్ వెంటపడటమే హీరో లక్షణం అని నమ్మే పిచ్చితనం నుండి యువత బయటకు రావాలి.
🔹 తోటి మనిషి బాధను పంచుకునే ‘సహానుభూతి’ లేని సమాజం శవాల కుప్పతో సమానం.
🔹 డిగ్రీలు వస్తున్నాయి కానీ క్యారెక్టర్ రావడం లేదు. ఈ 40 మంది విద్యార్థులకు ఇప్పుడు కావాల్సింది జైలు శిక్షతో పాటు Behavioral Therapy.

“నైట్ కు వస్తావా?” అని అడిగిన ఆ 40 మంది యువకులు మన సమాజపు ‘నైతిక పతనానికి’ సజీవ సాక్ష్యాలు.
సిపీ సుమతి గారు కేవలం ఆ 40 మందిని పట్టుకోలేదు, మన కళ్లముందు ఉన్న ముసుగును తొలగించారు. ఆ బస్టాండ్‌లో ఉన్నది కేవలం ఒక అధికారిణి కాదు, ఆమె మన సమాజపు ఆత్మగౌరవం.
శిక్ష పడటం వల్ల నేరస్థుడు భయపడతాడు, కానీ సరైన సంస్కారం ఉన్నప్పుడు అసలు నేరస్తుడే పుట్టడు. ఈ 40 మంది పోకిరీల ఉదంతం ప్రతి తల్లికి, తండ్రికి ఒక మేలుకొలుపు — మీ అబ్బాయిలను మనుషులుగా పెంచుతున్నారా లేక మృగాలుగా మారుస్తున్నారా?
పునరాలోచించుకోండి!
సైకాలజిస్ట్ విశేష్




ఇక్కడే ఈ పోస్టుపై వచ్చిన ఓ కామెంట్ కూడా సందర్భహితం… Krishna Kishore Malladi …. ఈ ఘటనలో ఆ యువకుల ప్రవర్తన తప్పు కాదని ఎవరూ చెప్పలేరు. మహిళలను వేధించడం, అసభ్యంగా మాట్లాడటం, “రేట్ ఎంత?” వంటి ప్రశ్నలు అడగడం ఖచ్చితంగా ఖండించాల్సిన విషయాలే.

కానీ, ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని మొత్తం పురుష సమాజాన్ని “మృగాలు”, “ప్రెడేటర్స్”, “డార్క్ ట్రయాడ్ వ్యక్తులు”గా చిత్రీకరించడం కూడా సమానంగా ప్రమాదకరమైన అతిశయోక్తి.

 Individual Crime ≠ Collective Male Psychology … 40 మంది చేసిన నీచమైన పనిని ఆధారంగా తీసుకుని “యువత మొత్తం ఇలా ఆలోచిస్తోంది”, “పితృస్వామ్యం అందరికీ లైసెన్స్ ఇచ్చింది” అని చెప్పడం ఒక sweeping generalization.
ప్రతి నేరానికి సామాజిక కారణాలు ఉండొచ్చు, కానీ ప్రతి పురుషుడు ఒక latent predator అన్న భావన సైకాలజీ కాదు — అది ideological framing.

 Psychology Should Explain, Not Demonize … సైకాలజీ అంటే మనుషుల ప్రవర్తనను అర్థం చేసుకోవడం. కానీ ఇక్కడ ఉపయోగించిన భాష — “మృగాలు”, “వేటగాళ్లు”, “ఫిల్త్”, “డార్క్ ట్రయాడ్” — విశ్లేషణ కంటే moral condemnation ఎక్కువగా కనిపిస్తోంది.
ఒక వ్యక్తికి narcissism లేదా psychopathy ఉందని నిర్ధారించడానికి clinical assessment అవసరం. రోడ్డుపై అసభ్యంగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరినీ psychopath అని పిలవడం శాస్త్రీయంగా సరైనది కాదు.

 Toxic Masculinity అనే పదం Overused అవుతోంది … కొంతమంది యువకులు అసభ్యంగా ప్రవర్తించడం నిజం. కానీ దాన్ని మొత్తం “masculinity” సమస్యగా చూపడం వల్ల healthy masculinity కూడా demonize అవుతుంది.
అనేక మంది పురుషులు మహిళలను గౌరవిస్తారు, రక్షిస్తారు, సహచరులుగా చూస్తారు. వారి ఉనికిని పూర్తిగా విస్మరించి “మగవాళ్లలో దాగి ఉన్న మృగం” అనే narrative నిర్మించడం balanced analysis కాదు.

 Fear Cannot Replace Values …. “గౌరవం లేకపోతే భయమైనా ఉండాలి” అనే వాదన తాత్కాలికంగా పనిచేయొచ్చు. కానీ భయం మీద నిలిచిన సమాజం ఆరోగ్యకరమైనది కాదు.
శాశ్వత పరిష్కారం fear policing కాదు — emotional maturity, empathy, family upbringing, accountability, and education.

 Victim Blaming తప్పే… కానీ Self-Responsibility చర్చ కూడా అవసరం… ఒక మహిళ రాత్రి బయట ఉండటం వల్ల వేధింపులకు గురి కావడం ఎప్పటికీ సమర్థనీయం కాదు. కానీ అదే సమయంలో వ్యక్తిగత భద్రత, ప్రమాద అవగాహన, సామాజిక పరిస్థితుల గురించి మాట్లాడటం కూడా victim blaming కాదు.
సమాజం unsafe గా ఉంటే, అందరూ — మహిళలు, పురుషులు — జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

 Cinema, Society, Parenting — సమస్య చాలా సంక్లిష్టం… “హీరోయిన్ వెంటపడటం హీరో లక్షణం” అనే సినిమా culture ప్రభావం కొంతవరకు నిజమే. కానీ కుటుంబ వ్యవస్థల మార్పు, social media hypersexualization, pornography addiction, peer validation culture, unemployment frustration — ఇవన్నీ కూడా యువత ప్రవర్తనపై ప్రభావం చూపుతున్నాయి.
ఒక్క “patriarchy” అనే పదంతో మొత్తం సమస్యను explain చేయడం oversimplification.

 Law Should Punish Actions, Not Identities… ఆ 40 మందిని వారి ప్రవర్తనకు శిక్షించాలి. కానీ వారిని “జన్మతః మృగాలు”గా చిత్రీకరించడం rehabilitation అవకాశాన్ని తగ్గిస్తుంది.
చాలా మంది యువకులు peer pressure, immaturity, impulse control లోపం వల్ల తప్పులు చేస్తారు. కఠిన శిక్ష అవసరమే కానీ reform కూడా equally important.

సారాంశంగా: ఈ సంఘటన మహిళల భద్రత గురించి గంభీరమైన హెచ్చరిక. కానీ దాన్ని ఉపయోగించి “పురుషత్వం = హింస”, “యువత = మృగాలు” అనే భావనను బలపరచడం సమాజాన్ని మరింత విభజిస్తుంది.
నేరాన్ని ఖండించాలి. బాధితురాలికి మద్దతు ఇవ్వాలి. కానీ విశ్లేషణ balanced గా ఉండాలి — outrage driven గా కాదు….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మగవాదం..! ‘‘సుమతీ శతకం’’పై ఓ సైకలాజికల్ అనాలిసిస్…!!
  • ఐ-ప్యాకప్…! సోషల్ మాఫియాపై పార్టీల భ్రమలు ఎగిరిపోయాయ్…!!
  • ఎన్నో ఆత్రేయ పాటల్లో- పదాల్లో ఉర్దూ గజల్ స్థాయి అభివ్యక్తి..!
  • Next Telangana..! ఆశ సహజమే..! ఓసారి తమిళ ఫలితంతో పోలిస్తే..?!
  • శోభన్‌బాబును చంపేస్తే ప్రేక్షకులు ఊరుకుంటారా..? ఛఫో అనేశారు..!
  • తలైవా… Time to Lead…! నాడు జయలలిత గేటు ముందు విజయ్..!!
  • మంత్రి సీతక్క ఝలక్… బీఆర్ఎస్ దుష్ప్రచారంపై కోర్టు అక్షింతలు…
  • జనం సొమ్ము… నగలు, ఫ్యాషన్లు… వందల కోట్ల విలాస ప్రదర్శన…
  • మిన్మిని… ఓ మధుర స్వరం…! విషాదాలు, విషపు ఆంక్షలతో తెరమరుగు…!!
  • సుప్రీం చీఫ్ జస్టిస్ భలే ప్రశ్న… ఎందుకీ పిల్… నీకేం సంబంధం…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions