.
బాగా నచ్చిన వార్త… ఏమిటంటే..? నేను సీఎంను, అంటే కామన్ మ్యాన్… నాకోసం ట్రాఫిక్ ఆపేసి, రోడ్ల మీద వాహనదారుల్ని అవస్థల పాలు చేయొద్దు అని రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు… అభినందనలు… ఎందుకంటే…? పోలీసుల ఓవరాక్షన్‌తో కొన్నిసార్లు నడి ఎండలో పిల్లలు, వృద్దులతో, హాస్పిటల్ వెళ్లే రోగులతో సుదీర్ఘంగా ట్రాఫిక్ ఆపేయడం వల్ల అవస్థలు అనుభవించేవాడికే అర్థమవుతుంది…
పోలీసులు వినరు… సరే, వాళ్ల బాధ వాళ్లది… కానీ ఇంతకుముందే రేవంత్ రెడ్డి ఓసారి చెప్పాడు, తన కాన్వాయ్ కోసం మామూలు ట్రాఫిక్ ఆపవద్దని… కానీ కొన్నాళ్ల తరువాత మళ్లీ యధాతథ స్థితి… మొన్న తను శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్తుంటే ట్రాఫిక్ ఆగిపోయి జనంలో వ్యతిరేకత వ్యక్తమైంది… సహజం… ఈ ఎండల్లో ట్రాఫిక్ ఆపేస్తే ఎంత అవస్థ…
Ads
ఇది తన దృష్టికి రాగానే రేవంత్ రెడ్డి చాలా స్ట్రిక్టుగా చెప్పాడు… ‘‘నాకోసం ట్రాఫిక్ ఆపొద్దు’’… నెటిజనం నుంచి మంచి సానుకూల స్పందన వస్తోంది… నిజంగానే అభినందనీయం… జయలలిత సీఎంగా ఉన్నప్పుడు ఆమె దూరం నుంచి వెళ్తుంటే… ఇటువైపు ఆమె ఎమ్మెల్యేలు, మంత్రులు పొర్లుదండాలు పెట్టే సిట్యుయేషన్ చూశాం… అది మితిమీరిన అతి… అత్యంతాతి…
అంతెందుకు..? నాది ఉద్యమ పార్టీ… నేను జనంలో ఉంటాను అని పొంఖనాలు కొట్టిన కేసీయార్ హయాంలో తన కాన్వాయ్ వెళ్తుంటే సుదీర్ఘంగా ట్రాఫిక్ ఆపేవాళ్లు… ఓ దశలో ఓ జోకు… ఆయన పైన హెలికాప్టర్‌లో పోతుంటే కింద ట్రాఫిక్ ఆపేసేవాళ్లుట… సరే, ఆయనకు తోడు హోం మంత్రి, యాక్టింగ్ ముఖ్యమంత్రి కేటీయార్, యాక్టింగ్ సెకండ్ ముఖ్యమంత్రి హరీష్ రావు… ఎవరు రోడ్డు మీదకు వచ్చినా జనానికి అవస్థలే…
మన ఖర్మకు… ఏపీ ముఖ్యమంత్రి ఇక్కడే ఉంటాడు, తనకు విపరీతమైన సెక్యూరిటీ ప్రొటోకాల్… జనం అవస్థలు గట్రా ఏమీ పట్టని మహా నాయకుడు… ఇప్పుడు తనకు తోడుగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, తనూ ఇక్కడే ఉంటాడు… తన షూటింగులు యవ్వారాలన్నీ ఇక్కడే… అదనంగా గవర్నర్ రాకపోకలు… ఎవరు వీథుల్లోకి వచ్చినా సరే, మామూలు జనానికి అవస్థలే అవస్థలు…
వాహనదారులు ఎండొస్తే కాలాలి, వానొస్తే తడవాలి… ఈ కోణంలో నిజంగా రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సానుకూల స్పందన వస్తుందంటే దానికి అర్థముంది… వెంటనే ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో సీన్ మారింది… తను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక మామూలు ట్రాఫిక్‌లోనే తన కాన్వాయ్ ప్రయాణించింది… ఎంత అరుదు..? సూపర్… డీజీపీ సి.వి.ఆనంద్ కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాడు…
త్వరలోనే ప్రత్యేకంగా ‘ట్రాఫిక్ బ్యూరో’ను ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ ప్రకటించాడు… ఇకపై వీఐపీ కాన్వాయ్‌లు వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయకుండా, సింగిల్ లైన్‌లో వాహనాలను అనుమతించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించాడు… థాంక్యూ సీఎం సాబ్… కానీ..?
కానీ సర్, ఏపీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎం ప్రొటోకాల్స్ వల్ల అవస్థల మాటేమిటి..? ఏ వీఐపీ అయినా సరే, ట్రాఫిక్ ఆపొద్దు అని మరో ఆదేశం జారీ చేయండి, తెలంగాణ, ప్రత్యేకించి హైదరాబాద్ జనం వద్దన్నా నీకే వోటేస్తారు… పక్కా…!! Many times small things also matter a lot…
Share this Article