Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తమిళ రాజకీయ తెరపైకి హఠాత్తుగా రజినీకాంత్… ఉమ్మడి సర్కారు…

May 8, 2026 by M S R

.

మొత్తానికి తమిళ రాజకీయాలు తమిళ సినిమా కథల్ని మించిన థ్రిల్లర్లుగా మారాయి… కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్ఠంభన, అనిశ్చితిలో రకరకాల ప్రచారాలు కూడా వస్తున్నాయి… అఫ్‌కోర్స్, నిజాలు కావద్దని కూడా ఏమీ లేదు… రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు… రజినీకాంత్‌ను బీజేపీ తెరపైకి తీసుకొస్తున్నదని తాజా ప్రచారం…

‘‘సీఎంగా తలైవా రజనీ కాంత్..! విజయ్ కు విరుగుడుగా డీఎంకే ప్లాన్..! ఎఐడీఎంకేతో చేతులు కలిపినా ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం..! తెర వెనుక కథ నడిపిస్తున్న బిజెపి..! ఈసారి విజయ్ ను అడ్డుకుంటే.. తర్వాత ఇంత ఊపు ఉండదనే ఆలోచనలో రెండు డీఎంకేల నేతలు… బీజేపీ..!

Ads

బీజేపీ ఆలోచన మరోవిధంగా..! సౌత్ లో ఏపీ ఒక్కటే తమ అధీనంలో ఉందనే ఆందోళన..! తమిళనాడు అధీనంలోకి వస్తే కాంగ్రెస్ ను ఎదుర్కోవచ్చనే ఆలోచన..! ఇండియా కూటమిని పూర్తిగా దెబ్బకొట్టాలంటే ఇపుడు సౌత్ లో స్టాలిన్ అవసరం ఉందని.. ఆయనకు లబ్ది చేయడం ద్వారా తనవైపు తిప్పుకోవాలనే ఆలోచన..’’

… ఇదీ తాజా ప్రచారం… మొన్న ఫలితాలు వెలువడిన తరువాత స్టాలిన్ వెళ్లి రజినీకాంత్‌ను కలిశాడు… ఆ భేటీ ఎందుకో ఎవరికీ తెలియదు, వాళ్లెవరికీ చెప్పరు… కానీ ఈ ప్రతిష్ఠంభనకూ ఆ భేటీకి ముడిపెడుతూ కథ అల్లినట్టుంది… ఇందులో కొన్ని నిజాలున్నాయి…

1) ఈసారి విజయ్‌ను నిలువరిస్తే, విజయ్‌కు సానుభూతి పెరుగుతుంది, హీరో అవుతాడు కానీ… ఆ ఎమ్మెల్యేలు చెల్లాచెదురవుతారు… అందులో 80 శాతం మందికి ఏ రాజకీయ నేపథ్యమూ లేదు… డీఎంకే, ఏడీఎంకేల ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే కష్టసాధ్యంగా ఉంది… ఇక టీవీకే ఎమ్మెల్యేల మాటేమిటి..?

2) ఐతే నువ్వు, లేకపోతే నేను, లేదంటే ఇద్దరమూ… ఈ దిశలో డీఎంకే, ఏడీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినా (ఉమ్మడి ప్రభుత్వం) ఆశ్చర్యం ఏమీ లేదు… రెండు పార్టీల నేతలూ ఆ సంకేతాలను ఇస్తున్నారు కూడా… అదే జరిగితే బీజేపీ కూడా సై అంటుంది… దానికి కాంగ్రెస్ కూటమి కకావికలం కావడం ప్రధానం… కానీ జనం తీర్పును అపహాస్యం చేసిన పార్టీగా ఘోరంగా బదనాం కావడం ఖాయం… అన్నాడీఎంకేకు మద్దతునిస్తే తిరగబడతాను అని కనిమొళి హెచ్చరిస్తే, ఉదయనిధి ఆమె ఇంటికి వెళ్లి సర్దిచెప్పుతున్నాడు…

3) ఇంతా అనుకున్నట్టు జరిగితే ప్రభుత్వంలో టీవీకే, బీజేపీ, కాంగ్రెస్ లేకుండా చూస్తారు… వీసీకే, పీఎంకే, సీపీఎం, సీపీఐ వరుస కడతారు… డౌటేమీ అక్కర్లేదు… పైకి స్టాలిన్ ఏం చెబుతున్నా మంచి వ్యూహకర్త… దశాబ్దాల రాజకీయంలో రాటుదేలిన కేరక్టర్… పళనిస్వామికి భయం, ఈసారి విజయ్ పాతుకుపోతే ఇక తమ చాప్టర్ క్లోజ్ అని… ఆల్రెడీ పార్టీ ఎమ్మెల్యేలలో సగం మంది విజయ్ వైపు చూస్తున్నారు…

4) ఈ సమాచారం ఉంది కాబట్టే విజయ్… డీఎంకే, అన్నాడీఎంకే కలిసి, తనను అడ్డుకుంటే తమ పార్టీ 108 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తారని బెదిరించాడు… ఒకవేళ చేస్తే మారిన పరిస్థితుల్లో అందులో సగం మళ్లీ గెలుస్తారానేది డౌటే… అప్పుడు డీఎంకెే, అన్నాడీఎంకే సీట్ల సర్దుబాటుతో పోటీచేస్తాయి, వోట్ల చీలిక ఉండదు… పైగా 108 (నిజానికి 107 మంది) లో ఎందరు పార్టీ జంపవుతారో కూడా తెలియదు.,..

5) అన్నింటికీ మించి రజినీకాంత్‌ను ఉమ్మడి నాయకుడిగా చేస్తారు సరే, కానీ తను అంగీకరిస్తాడా..? భయం, పిరికితనం, ఆలోచనలేమి… ఎన్నేళ్లుగానో వెనకకూ ముందుకూ కదులుతూ, అంతిమంగా ఓ షెల్‌లోనికి వెళ్లిపోయడు తను… సో, రకరకాల ఈక్వేషన్లు ఉంటాయి… అర్జెంటుగా ఆయన దేవెగౌడ పాత్ర పోషించాలి, ఏ ఎన్నికల్లో నిలబడి, జనం తీర్పు పొందకపోయినా… తన జీవితానికి ఇంతకుమించిన అప్రతిష్ట, తలవంపులు మరొకటి ఉండబోవు… ఈలోపు విజయ్ గనుక సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే… కథ మరింత రక్తికడుతుంది… గవర్నర్ విధులు, బాధ్యతలు, రాజ్యాంగస్పూర్తి వంటివి చాలా అంశాలు తెరపైకి వస్తాయి… ఏమో, ఏదీ కుదరకపోతే… రాష్ట్రపతిపాలన..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తమిళ రాజకీయ తెరపైకి హఠాత్తుగా రజినీకాంత్… ఉమ్మడి సర్కారు…
  • బెంగాల్‌ కమల వికాసం… చదివి తీరాల్సిన ఓ పొలిటికల్ పోస్ట్‌మార్టం…
  • డ్రగ్స్ తంబాకు కాంబో… కరీంనగర్‌లో సైడ్ ఎఫెక్ట్స్… కేటీయార్‌కు తల్నొప్పి…
  • ఆనందప్రకాష్… ఓ రాక్షసుడితో 19 ఏళ్ల అలుపెరుగని పోరాటం…
  • ప్రతిష్టంభన..! తగ్గని గవర్నర్…! తలైవా కథ సుప్రీం కోర్టు వైపు..?
  • ‘‘తమిళ గవర్నర్ తప్పు లేదు… స్పష్టత కోరడం న్యాయసమ్మతమే’’
  • సీఎం సాబ్, నీ కడుపు సల్లంగుండ..! మెచ్చుకునే నిర్ణయం చెప్పావు..!!
  • విజయ్ వెనుక మాస్టర్ బుర్ర…! పళనిస్వామిపై పగ తీర్చుకున్నాడు..!!
  • మగవాదం..! ‘‘సుమతీ శతకం’’పై ఓ సైకలాజికల్ అనాలిసిస్…!!
  • ఐ-ప్యాకప్…! సోషల్ మాఫియాపై పార్టీల భ్రమలు ఎగిరిపోయాయ్…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions